జూలై 2011


మనకు స్వేచ్చ అజీర్తి చేసింది.

రచన …నూతక్కి రాఘవేంద్ర రావు.

నేను కోరుతున్నా

యీ దేశానికి నియంతృత్వం

నేనుకోరుతున్నా ప్రస్తుత

వికృత ప్రజాస్వామ్య నిధనం

విసిగి వేసారాను

మితిమీరి న స్వేచ్చ అతి యై

అజీర్తి చేసి

వికారాలు

ఎన్నికలలో అధికారాన్ని

మార్చ గలిగే ప్రజాస్వామ్య

సంవిధానం మాకుందని

చంకలు ఎగరేసుకొంటూ

ప్రపంచానికి చాటుకొంటూ

బాహ్య అంతర్ శ త్రువుల నుండి

దేశాన్ని ,ప్రజలను సంరక్షించలేక

అనునిత్యం శల్యమై

నేర్వనిపాఠాలు
అసంబద్ధ రాజకీయాలు
రచన :నూతక్కి.

రక్షిస్తాడని,
భద్రత కలిపిస్తాడని,
అధికారం
కట్ట బెడితే !,
కాదా యిది మరి
పిచ్చివాడి చేతికి
అందించిన
రాయి చందం?
నాడు
ప్రజాసామ్య సౌధం పై

జరిగిన దాక్ష్నీకం
భాగ్యనగర విస్ఫోటనలు
ముంబాయి దాడులు
దహన కాండ
ఇంకా ఎన్నని ఎన్నెన్నని

వాటినుండి మనమింకా
నేర్వని పాఠాలు
అసంబద్ధ రాజకీయ విసృన్ఖలత లొ
మరచిన ప్రజా రక్షణ వ్యూహాలు

ప్రజా బక్షణ యోజనా రచన కై
నిమగ్నమై ప్రజా ప్రభుతలు
నేను .
రచన : నూతక్కి.

నేటి మానవుడు

నేను లేనిదే కాలు కదపడు . .

నా స్తాయితోనే పెరుగుతుంది
నను వినియోగించే మనిషి దర్పం
నేను తోడున్నప్పటి విలువ
యింటా బయటా అంతటా
నేను లేకుంటే లోకువ
నేను ఒకటి కాదు జంటను
ఒంటరిగా ఎందుకూ కోరగాను
కుడి ఎడమల వ్యత్యాసంతో .
నన్ను సృజించిన
వాణ్ణి
నీచంగా చూస్తుందీ  ప్రపంచం.
నన్ను సృజించినందు ననే
 అస్ప్రుస్యు డై ఆతడు .
డబ్బున్నవాడు నను యంత్రాలతో
సృజియిస్తే  వాడికి సిరి
ఎక్కడకేగినా పురస్కారమే
అప్పులతో ఆకలితో చస్తున్న వాడు
నను తయారు  చేస్తే వానికది వెలి
ఎటు వెళ్ళినా  తిరస్కారమే
నను వినియోగించే వాడు
సంఘంలో గౌరవ సభ్యుడు
నను తయారు చేసినవాడినీ
నను రెండు కాళ్ళతో త్రోక్కినట్లే
త్రొక్కుతూ  సమాజం
వాకిలి వెలుపల  ఎచటో నొ
దూరంగా పెడుతూ
చచ్చిన కళేబరాలను
దూరంగా తరలించి తాను
కుళ్ళు దుర్వాసనల
రోగాల పాలయి
చర్మాన్ని వలిచి
నను సృష్టిస్తూ
సమాజపు సంరక్షణలో
సంఘం తో  ముద్రవేయించుకుని
 అంటరాని వాడై
నాకున్నమాత్రపు
విలువ పొందని
నా సృష్టి కర్తను తలుచుకుంటూ
కిర్రుమంటూ జంట గా
రోదనలో వేదనలో  నేను
విసృన్ఖల మహాన్ మేరా భారత్
(ఆ మధ్య ఒకరి ప్రచురణకు నా కామెంట్ కొద్ది మార్పులతో  )
రచన : నూతక్కి.

స్వతంత్ర భారతిన

అంతా స్వేస్చ్చే

హత్యలు
దోపిడీలు దొంగతనాలు
దాక్ష్ట్నీకాలు కిడ్నాపులు
యాసిడు దాడులు
అంతా
ఖుల్లం ఖుల్లా
అంతా విసృన్ఖలత
యింకెక్కడి సంకెలలు
శ్రుంఖలాలు తెంచుకొని భారత్
ఊదు  గొట్టం, బియ్యం చెట్లు
రచన :నూతక్కి.
ఊది ఊది చుట్టూ మూగిన
పొగలో తంటాలు పడుతూ
పాపం పచ్చి కట్టెలతో
పొయ్యికడ  పాపం ఆ పడతి
ఈనాటి యువత గనుక చూస్తే
ఆ ఊదు గొట్టం ఎందుకో
ఆ పొగ రావడమేమిటో
ఆ కన్నీళ్లు ముక్కు
చీదుడులు
అంతా అనాగరిక చర్యల్లా
సుఖపడటం తెలియని మూర్ఖుతగా
యీసడించే రోజులు
ఆనాటికి ఆ ఊదు గొట్టం ఓ సాంకేతిక
ఆవిష్కారమన్న ఆలోచన
ఎవరికీ ఏ కోశానా రాదు.
అవును
బియ్యం కాసే చెట్టును
చూడాలనే సంతతిని
మనమే కద పండిస్తున్నాం.