ఊదు  గొట్టం, బియ్యం చెట్లు
రచన :నూతక్కి.
ఊది ఊది చుట్టూ మూగిన
పొగలో తంటాలు పడుతూ
పాపం పచ్చి కట్టెలతో
పొయ్యికడ  పాపం ఆ పడతి
ఈనాటి యువత గనుక చూస్తే
ఆ ఊదు గొట్టం ఎందుకో
ఆ పొగ రావడమేమిటో
ఆ కన్నీళ్లు ముక్కు
చీదుడులు
అంతా అనాగరిక చర్యల్లా
సుఖపడటం తెలియని మూర్ఖుతగా
యీసడించే రోజులు
ఆనాటికి ఆ ఊదు గొట్టం ఓ సాంకేతిక
ఆవిష్కారమన్న ఆలోచన
ఎవరికీ ఏ కోశానా రాదు.
అవును
బియ్యం కాసే చెట్టును
చూడాలనే సంతతిని
మనమే కద పండిస్తున్నాం.