మనకు స్వేచ్చ అజీర్తి చేసింది.
రచన …నూతక్కి రాఘవేంద్ర రావు.
నేను కోరుతున్నా
యీ దేశానికి నియంతృత్వం
నేనుకోరుతున్నా ప్రస్తుత
వికృత ప్రజాస్వామ్య నిధనం
విసిగి వేసారాను
మితిమీరి న స్వేచ్చ అతి యై
అజీర్తి చేసి
వికారాలు
ఎన్నికలలో అధికారాన్ని
మార్చ గలిగే ప్రజాస్వామ్య
సంవిధానం మాకుందని
చంకలు ఎగరేసుకొంటూ
ప్రపంచానికి చాటుకొంటూ
బాహ్య అంతర్ శ త్రువుల నుండి
దేశాన్ని ,ప్రజలను సంరక్షించలేక
అనునిత్యం శల్యమై
జూలై 15, 2011 at 8:53 ఉద.
బాగా చెప్పారు. ఏకీభవిస్తున్నాను. నిజమే, ఇప్పుడు (కనీసం ఒక పాతికా-ముప్ఫయ్యేళ్ళ దాకా) ఈ దేశానికి కావాల్సింది ప్రజాస్వామ్యం కాదు. ప్రాజ్ఞ నిరంకుశత్వం (Enlightened Despotism) మాత్రమే. ఉన్న పరిస్థితుల్లో ఈ దేశస్థులు ప్రజాస్వామ్యానికి తగరు.
జూలై 16, 2011 at 12:22 ఉద.
వికసిత జ్ఞానులు .చక్కగా విశ్లేషించారు .ధన్యవాదాలు తాడేపల్లి వారు. చాలా కాలం తరువాత మనం యిలా.. మీరెలా వున్నారు? మీ వ్యాసంగము ఎలా వుంది? ధన్యుణ్ణి….శ్రేయోభిలాషి …నూతక్కి రాఘవేంద్ర రావు.
జూలై 16, 2011 at 3:20 సా.
మితిమీరిన స్వేచ్ఛ అన్నారు. ఏ దేశం గురించి మాట్లాడుతున్నారో తెలుసుకోవచ్చా..? ఈ దేశంలో రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్ఛనే అనుభవించలేకపోతున్నాం. రాజ్యాంగం వాక్ స్వాతంత్ర్యం ఇచ్చింది. హైదరాబాద్‌లో నుంచుని రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచండి అనండి చూద్దాం. రాజ్యాంగంలో పౌరులు ఈ దేశంలో ఎక్కడైనా జీవించవచ్చు అని ఉంది. మరి బీహారీలు ముంబయ్‌లో పని వెతుక్కుంటే శివసేన, ఎంఎన్ఎస్లు ఒప్పుకోవెందుకని? స్వేచ్ఛ అంటే రోడ్ల మీద మూత్ర విసర్జన చెయ్యడం, చెత్తని వీధుల్లో పారబోయడం కాదు. రవీంద్రుడు అన్నట్టు ఎక్కడ భావాలు స్వేచ్ఛగా ప్రకటింపబడతాయో అక్కడే మనిషికి స్వేచ్ఛ ఉన్నట్టు. ఇక నియంతృత్వం రాజ్యాల్ని ప్రగతిపథంలో నడిపిన ధాఖలాలు చరిత్రలో ఎక్కడా లేవు. ప్రజాస్వామ్యం మీద ఆశాభావంతో ఉండండి. నిరాశావాదం ఎప్పుడూ ప్రమాదమే.
ఆగస్ట్ 9, 2011 at 10:24 ఉద.
మనకు స్వేచ్చ అజీర్తి చేసింది.
నిజమేనండి.
ఆగస్ట్ 9, 2011 at 11:05 ఉద.
ధన్యుణ్ణి ఏకీభావన లభించినందుకు.