మనకు స్వేచ్చ అజీర్తి చేసింది.

రచన …నూతక్కి రాఘవేంద్ర రావు.

నేను కోరుతున్నా

యీ దేశానికి నియంతృత్వం

నేనుకోరుతున్నా ప్రస్తుత

వికృత ప్రజాస్వామ్య నిధనం

విసిగి వేసారాను

మితిమీరి న స్వేచ్చ అతి యై

అజీర్తి చేసి

వికారాలు

ఎన్నికలలో అధికారాన్ని

మార్చ గలిగే ప్రజాస్వామ్య

సంవిధానం మాకుందని

చంకలు ఎగరేసుకొంటూ

ప్రపంచానికి చాటుకొంటూ

బాహ్య అంతర్ శ త్రువుల నుండి

దేశాన్ని ,ప్రజలను సంరక్షించలేక

అనునిత్యం శల్యమై