ఆగస్ట్ 2011


ఈద్ ముబారక్
శ్రేయోభిలాషి: నూతక్కి.

తనను  నమ్మిన

జగతి జనులను
సకల విధముల
కావమని
వేడుకొంటూ
ముస్లిం మిత్రులకు
రంజాను
శుభాకాంక్షలు

స్నేహితాలు .

రచన : నూతక్కి రాఘవేంద్ర రావు.

 

జీవన యానం లొ

సమకూర్చుకున్న

పరిచయాలు

వేళ్ళతో లేక్కిన్చలేనివి

వేలల్లో లక్షల్లో

కాలక్షేపానికి కొన్ని

అవసరార్ధం కొన్ని

ఆకలి తీర్చుకొనే యత్నంలో కొన్ని

పరస్పర సహకారం లొ కొన్ని

ఆపదలో ఆదుకొన్నవి కొన్ని

మమతలతో ఆడుకొన్నవి కొన్ని

మనసులు పిండినవి కొన్ని

గుండెలు నలిపినవి కొన్ని

ఉనికిని ద్వేషించినవి కొన్ని

నన్ను అన్వేషించినవి కొన్ని

నను వుద్ధరించినవి కొన్ని

ఉద్ధరణకు లోనైనవి కొన్ని

స్వార్ధంతో దరి చేరినవి కొన్ని

నా హితం కోరి చేకూరినవి కొన్ని

జన్మతః నిలిచి వున్నవి కొన్ని

ఇలా ఇలా ఇంకా ఇంకా ఎన్నో ఎన్నెన్నో

అయినా

మనసును తడిమినవి

మమతతో తడిపినవి

కొన్నే !

అవి …

స్నేహితాలు .