సెప్టెంబర్ 2011


శిల్పీ!

Rachana: Nutakki Raghavendra Rao
శిల కావ్యమై

కావ్యం శిల్పమై

శిల్పం గాన చిత్రమై

గానం సప్తవర్నరాగమై

రాగం రసరమ్య గాత్రం మై

సఫలమై సంపూర్ణం మై ….

అది నీకే సాధ్యం

మోడు
నీడనివ్వదు
పక్షికి
గూడునివ్వదు

(Rachana: Nutakki)

chiru kavitalu

Rachana: GIJIGADU.

కొబ్బరి చెట్టున
కాయలు
చెట్టెక్కడం
తెలియదు

మొక్క పెట్టగానే
చెట్టెక్కడం నేర్చుకో

తేనెతుట్టె నిర్మాణం
అద్భుతం
తేటి జేర్చే తేనే
మహాద్భుతం

తుట్టె కదిపతే
కష్టాల పాలే

ముళ్ళపూడి హరిచ్చంద్ర ప్రసాద్
మనకిక లేరట !!!….నూతక్కి:
తెలుగుల ముద్దు బిడ్డడు

ఆంధ్ర జాతికే గర్వ కారణం
పారిశ్రామిక విప్లవ గీతం

జాతి గర్వించ గ తగ్గ వాడు

తొట్టతొలి
వ్యవసాయాధారిత

పారిశ్రామిక పితరుడు
జాతికి నిరతము తీపినిచ్చిన
సహస్రాది శ్రామిక జన హితైషి
సేవా నిరతుడు
అన్న దాత
నిత్య కృషీవలుడు
నిరంతర శ్రామికుడు
మహోన్నత దార్శనికుడు
మార్గ దర్శి
ఆంధ్రుల బిర్లాగా ప్రస్తుతించబడి
తన వారికి  తెలుగులకు
భరత జాతికీ
తాజేసిన అనన్య సేవలకు
తానే తృప్తిపడి
నిస్చ్చింతగా కనుమూసి
జగతి వీడి న
హరిశ్చ్చంద్రుడు ముళ్ళపూడి
సత్యవాది
ఇకలేరని
తెలిసి  కలచి న
నా గుండె
 గొంతుక
 మూగవోతే …..
ఇదే నా హృదయపూర్వక నివాళి.

వినాయక చవితి శుభాకాంక్షలు

ప్రపంచ వ్యాప్త
తెలుగు వారందరికీ
 వినాయక చవితి
 శుభాకాంక్షలు
శ్రేయోభిలాషి …నూతక్కి రాఘవేంద్ర రావు