ముళ్ళపూడి హరిచ్చంద్ర ప్రసాద్
మనకిక లేరట !!!….నూతక్కి:
తెలుగుల ముద్దు బిడ్డడు

ఆంధ్ర జాతికే గర్వ కారణం
పారిశ్రామిక విప్లవ గీతం

జాతి గర్వించ గ తగ్గ వాడు

తొట్టతొలి
వ్యవసాయాధారిత

పారిశ్రామిక పితరుడు
జాతికి నిరతము తీపినిచ్చిన
సహస్రాది శ్రామిక జన హితైషి
సేవా నిరతుడు
అన్న దాత
నిత్య కృషీవలుడు
నిరంతర శ్రామికుడు
మహోన్నత దార్శనికుడు
మార్గ దర్శి
ఆంధ్రుల బిర్లాగా ప్రస్తుతించబడి
తన వారికి  తెలుగులకు
భరత జాతికీ
తాజేసిన అనన్య సేవలకు
తానే తృప్తిపడి
నిస్చ్చింతగా కనుమూసి
జగతి వీడి న
హరిశ్చ్చంద్రుడు ముళ్ళపూడి
సత్యవాది
ఇకలేరని
తెలిసి  కలచి న
నా గుండె
 గొంతుక
 మూగవోతే …..
ఇదే నా హృదయపూర్వక నివాళి.