నవంబర్ 2011


జలధి తరంగమా !
రచన  : నూతక్కి రాఘవేంద్ర రావు. 
జలధి తరంగమా !
నిరంతరం
ఏదో సందేశం
ఎవరి
దరికో
చేర్చాలన్నట్లు
ఎందుకు
నీకీ
తపన
ఉవ్వెత్తున
ఎగసిపడుతూ
జోరుతో
హోరుగా
నురగలతో
తీరం లొ
భంగాపడుతూ …
మిత్రమా  !
ఎందులకీ
యాతన
ఎందులకీ
వేదన  ?
అవమానం
పాలయినా
తీరామే
నీ ప్రస్తానమా ?

ఇంతకూ
ఎచట నుండి
నీ రాక ?
అవునూ !
ఏమది

నీ మదినందలి  

సందేశం ?

ఫెంటోలు ( నావి కొన్ని)

 

1)గాలిలో ఎగిరే ఆకు చీమ కూడా ఫ్రీగా .

2)ఆకులు రాలుతున్నాయి రాలుగాలం .

3)మా, నా,స్వార్ధ వ్యక్తీకరణలు

4)మీది, మా ది , నీది , నా ది , మీరు, మేము, వేర్పాటు వేదనలు

5)చెట్లు ,పండ్లు, పక్షులు, విత్తులు, మొక్కలు ప్రకృతి ప్రక్రియ.

6)నూతిలో రాయేస్తే ప్రతిబింబం అలజడిలో

7)సంఘీభావం సహజీవనం చెదపురుగులు

8)మహా భారత కాలం అధర్మానికీ ఓ ధర్మం వుండేది.

9)న్యాయాన్యాయాలు సందర్భోచిత విన్యాసాలు.

10)పాతా ళం లొ తెలుగు భాషా వ్యాప్త వుద్యమ తీరులు,