జలధి తరంగమా !
రచన  : నూతక్కి రాఘవేంద్ర రావు. 
జలధి తరంగమా !
నిరంతరం
ఏదో సందేశం
ఎవరి
దరికో
చేర్చాలన్నట్లు
ఎందుకు
నీకీ
తపన
ఉవ్వెత్తున
ఎగసిపడుతూ
జోరుతో
హోరుగా
నురగలతో
తీరం లొ
భంగాపడుతూ …
మిత్రమా  !
ఎందులకీ
యాతన
ఎందులకీ
వేదన  ?
అవమానం
పాలయినా
తీరామే
నీ ప్రస్తానమా ?

ఇంతకూ
ఎచట నుండి
నీ రాక ?
అవునూ !
ఏమది

నీ మదినందలి  

సందేశం ?