ప్రపంచ వ్యాప్త బ్లాగరు మిత్రులందరికీ యీ నూతన ఆంగ్ల సంవత్సరం 2012 మీ జీవితాలలో దివ్యమై
భవ్యమై ఆనంద ఆహ్లాద భద్రతా భరితమై, సకల సౌభాగ్య సుఖ సంతోషానందాలను ప్రసాదించాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ
…మీ శ్రేయోభిలాషి …నూతక్కి రాఘవేంద్ర రావు.
ప్రేమ మూర్తి ప్రభు క్రీస్తును ప్రేమించే ప్రపంచ వ్యాప్త ప్రజలందరికీ,అంతర్జాల మిత్రులకు ,హితులకు ..క్రిష్టమస్ పర్వదినం సకల సుఖ శాంతి
సౌభాగ్యాలను అందించాలని ఆకాంక్షతో ఇవే నా క్రిష్టమస్ శుభాకాంక్షలు ….శ్రేయోభిలాషి …నూతక్కి రాఘవేంద్ర రావు.
అంతర్జాల తెలుగు సేత …లేఖినిలో రాత ….వీవెనుడి నేత.
రచన : నూతక్కి రాఘవేంద్ర రావు.
అంతర్జాలం లొ తెలుగు.బ్లాగుల్లో తెలుగు. నేడు ముఖ పుస్తక పుటలలో సాహితీ సమాఖ్యాలలో తెలుగు, … ప్రపంచ వ్యాప్త తెలుగుల తెలుగు వినియోగం. వెరసి తెలుగు ప్రపంచ వ్యాప్తి. .. యీ సందర్భం లొ ఆధునిక యుగం లొ అంతర్జాలం లొ తెలుగు వ్యాప్తిలో ,వినియోగం లొ నిత్యం స్మరించుకోవలసిన వ్యక్తులలో వీవెన్ అతి ముఖ్యుడు. అంతర్జాలం లొ తెలుగును పడుగు పెకల్లో పెనవేసిన వారిలో అతి ప్రముఖుడు. . యీ విషయం గురించి యీ కొద్ది రోజులుగా కొందరు తెలుగు రాసే ప్రక్రియల గురించి…. ప్రచారం చేయాలని లేకుంటే తెలుగు భాషాభివృద్ధికి తమ వంతు కృషి చేయనివారవుతారని తెలియజేస్తూ తమవంతుగా తాపత్రయ పడుతున్నారు. వారికీ ధన్యవాదాలు.కాని యీ సందర్భంలో ఈనాడు అంతర్జాలం లొ తెలుగు లిపిని వినియోగించి తెలుభాషలొ మనం వ్యవహరిస్తున్నామంటే అందుకు కృషిచేసిన నిబద్ధులైన యువ శాస్త్రజ్ఞులను వ్యక్తులు గాని, రచయితలు కవులు గాని, ,తేలుగు భాషా ఔత్సాహిక యువత గాని మరువ కూడదు. వారిని గురించి తెలుసుకోవలసిన విషయాలు అనేకం. యే రంగమైనా సృష్టికర్తలను, ఆద్యులను మరువ రాదు.
గత ఇరవై సంవత్సరాల క్రితం తెలుగులో టైప్ మిషన్ పై టైప్ చేయగలిగే సదుపాయం వుండేది కాదు. ఆ తరువాత సైక్లోస్తిల్ పరికరం తో నకల్లు తీసుకొనే సదుపాయం వచ్చింది. ఆతరువాత తెలుగు టైపు రైటర్లు వచ్చాయి . ఇంతలో టేబుల్ టాప్ కంప్యూటర్లు వచ్చాయి. కాని అవి వచ్చినా నా తెలుగు భాషకి వాటిని వినియోగించ లేకపోయాము. అలా కొన్నిసంవ త్సరాలు అలా సైక్లో స్తిలింగ్ పరికరాలతో గడిచిపోయింది. ఆతరువాతి కాలాలలో షుమారు ఏడెనిమిది సంవత్సరాల క్రితం అనుకుంటా తెలుగుకి కొన్ని పరికరాలు కంప్యూటర్ కు అనుసంధానం చేసుకొనే సదుపాయం లభించినా అందరికీ లభ్యమయ్యేవి కావు. అదీ కాకుండా వ్యక్క్తిగత కంప్యూటర్ లు వేయికోక్కరికి అందుబాటులో ఉండేవి.
గత అయిదేళ్ళ క్రితం వరకు అంతర్జాలం వ్యక్తిగతంగా అందుబాటులో వుండేది కాదు. అలాగే టేబుల్ టాప్ కంప్యూ ట ర్లూన్నూ. ఆఫీసులకు సాఫ్ట్ వేర్ కంపనీలకు మాత్రమే పరిమితమై ఉండేవి.
ఇంజినీరింగ్ కాలేజీల పెరుగుదల, వున్నత విద్యా వ్యాప్తి, అంతర్జాల విస్తరణ ,పి.సి ల సౌలభ్యత తో ఇంటింటా క్రమేణా పి సి ల వాడకం పెరిగింది. కాని అంతర్జాలం లబ్ది తక్కువగా వుండేది. అంతర్జాలం విప్లవాత్మకంగా వినియోగం లోకి వచ్చిన తరువాత వ్యాపారవేత్తలకు మాత్రమే పరిమితమైన స్వంత వెబ్ సైట్ ,వ్యక్తిగతంగా ఏర్పాటు చేసుకోవాలనుకొనే ఉత్సాహవంతులకు ఆర్ధిక వరుల లేమి . ఆ తరుణం లొ వారికీ బ్లాగులు ఓ వరం అయ్యాయి కాని తెలుగు లిపి అందుబాటులో లేక ఆంగ్ల లిపిలోనే తెలుగు వ్యవహారం జరుగుతుండేది.
అప్పటి కాలాలలో యాహూ , గూగుల్ , మైక్రో సాఫ్ట్ ,వంటి అంతర్జాల సంస్థలు ,యేవో కొన్ని అంతర్జాతీయ భాషలలో తప్ప తెలుగు పరికరాలు పొందుపరచ లేక పోయాయి.
అట్టి పరిస్థితిలో అంతర్జాలం లొ తెలుగును ప్రవేసపెట్టి వినియోగించాలని ఉత్సాహం తో కొందరు ఉత్సాహవంతులు సాఫ్ట్ వేర్ విజ్ఞానవంతులు అంతర్జాలంలో వినియోగించేందుకు పరిశోధనలు చేసి తెలుగు పరికరాలు సృష్టించి అందుబాటులోకి తెచ్చి అంతర్జాలం లొ తెలుగు భాషా ప్రతిభను ప్రపంచ స్థాయికి తీసుకు వెళ్ళారు. వారిలో ..ప్రముఖులు…వీవెన్ “.లేఖిని.ఆర్గ్ సృష్టి కర్త. “ఇ” తెలుగు సంస్థకు ,సిద్ధాంత కర్త.సంధాన కర్త.
అంతర్జాలం లొ వీవెనుడు తెలుగు నేత నేయక ముందు తెలుగు బ్లాగర్లు ఆంగ్ల లిపిలో తెలుగు పదాలు రాసే వారు . బ్లాగులను పిచ్చాపాటి చర్చిన్చుకోనేందుకు వినియోగించే వారు. సాహితీ ప్రక్రియలకు అంతగా వినియోగించే వారు కాదు. అప్పటికి బ్లాగులు సాఫ్ట్వేర్ ఇంజినీర్ ల వరకే పరిమితమయ్యాయి. ఎందుకంటే కంప్యూటర్ లు వారి వద్దె ఉండేవి కనుక.
గత అయిదు సంవత్సరాల క్రితం కూడా బ్లాగ్ అంటే సామాన్య జనులకే కాదు విద్యావంతులకూ అవగాహన లేని తరుణం.
బ్లాగులు విరివిగా వినియోగం లోకి వచ్చి న గత అయిదు సంవత్సరాలలో అంతర్జాతీయంగా అంతర్జాలం లొ మహత్తరమైన అభి వృద్ధి సాధించింది తెలుగు భాష. ఔత్సాహిక రచయితలు కవులు ,పత్రికలలో తమ రచనలు ప్రచురణకు నోచుకోని ఎందరో , బ్లాగుల ద్వారా తమ రచనలు వివిధ ప్రక్రియలలో అంతర్జాలం లొ ప్రచురించడం ప్రారంభించారు. తొలినాళ్ళలో పిచాపాటి సంభాషణలతో ప్రారంభమైన బ్లాగులు సాహిత్య వేదికలుగా పరిణతిని పొందాయి. అంతర్జాతీయ అంతర్జాల కవిసమ్మేళ నాలకు వేదికలుగా నిలిచాయి. తరుణం లొ ఫేస్ బుక్ అందుబాటులోకి వచ్చి అభిప్రాయాలు పంచుకొనే స్థితి నుండి సాహిత్యాభివృద్ధికి ఓ వరంగా మారి పోయింది. నాకు అవగాహన ఉన్నంత వరకు ఆ రీతిగా ఫేసు బుక్ లొ అభిప్రాయాలు పంచుకొనే వేదికగా ప్రారంభించ బడిన న తొలి వర్గపు సాహితీ సమూహం” తెలుగు సాహితీవలయం ” అందలి ప్రాధమిక సభ్యులు సృష్టించినవే ఫేస్ బుక్ లొ నేటి అనేక తెలుగు సాహితీ సమూహాలు. రోజుకువివిధ ప్రక్రియలలో కొన్ని వందల తెలుగు సాహిత్య ప్రచురణలు. తెలుగులో వస్తున్న వార ,పక్ష, మాస, త్రైమాసిక పత్రికలన్నిటా ప్రచురించబడుతున్న సాహిత్యానికి మించి బ్లాగులలోనూ, ఫేసుబుక్ తెలుగు సమూహాలలోనూ ప్రచురించబడుతున్నకవితలు, వ్యాసాల్పూ, అభిప్రాయాలూ, కథలూ, కొన్ని నవలలూ , ఇలా విస్తరిస్తూ దినదిన ప్రవర్ధమానమై ,తెలుగు భాష యడల యువతను ఆకర్షిస్తున్నాయి. అందున అత్యధిక రచనలు యువతనుండే . ,తెలుగు భాషాభి వృద్ధికి మహత్తరమైన సేవలను …అంతర్జాల సౌకర్యాలు అందిస్తున్న తరుణం లొ ,మనమందరం .. యీ సందర్భం లొ ఎందరినో .స్మరిన్చుకోవలిసి వుండి.
అంతర్జాల సృష్టికర్తలైన శాస్త్రజ్ఞులకు, అనేక రీతుల వినియోగకరమైన సదుపాయాలను ప్రపంచానికి అందిస్తున్న ప్రపంచ సాంకేతిక సమూహానికి హృదయపూర్వక కృతఙ్ఞతలు తెలుపవలసిన యీ తరుణం లొ ..
తెలుగు భాషను అంతర్జాతీయంగా ప్రసిద్ధిపొందేలా తెలుగులో వ్యవహరించడానికి అనువైన పరికరాన్ని స్రుష్టించిన యువ శాస్త్రజ్ఞులకు మీదు మిక్కిలి లేఖిని సృష్టి కర్త “వీవెన్” కు ప్రత్యేక అభినందనలు తెలియ పరచడం మన విధి.
నేడు ..యాహూ, జిమెయిల్, బరః ప్యాడ్ వంటి అనేక సంస్థలు తెలుగు పరికరాన్ని అందిస్తున్నాయి . తెలుగు భాషాభి వృద్ధికి తమ వంతు సహకారం అందిస్తున్నాయి. భవన నిర్మాణం లొ పునాది రాయిని మరిచినట్లు మరువకుండా ,నిబద్ధతతో ,అకున్తిత దీక్షతో అచంచల మైన కృషి చేసిన “వీవెనుడు ” వంటి మహత్తర వ్యక్తులను, యితరులనూ తెలుగు సమాజం గౌరవించి సకల విధాల ప్రోత్సహించి అట్టి వారిని, ఎందరో మహానుభావులు అందరినీ గౌరవించుకొని జాతి శిరసా నమస్కరించా వలసి వుంది.
వేల సంఖ్యలో తెలుగు బ్లాగులు . ఇంగ్లీషు లిపిలో తెలుగు రాసుకున్న కాలాలు. పిచ్చాపాటి సంభాషణలతో తొలినాళ్ళలో వినియోగింపబడిన తెలుగు బ్లాగులు నేడు గొప్ప సాహిత్య నిధులు.
రాసిలోనూ ,వాసిలోనూ , దినదినాభి వృద్ధి చెందుతున్న బ్లాగులూ, “ముఖ పుస్తక” సాహితీ ప్రపంచం ” తెలుగు భాష అభివృద్ధికి మహత్తరమైన సేవలు అందిస్తూవున్నాయి. , తెలుగు యువతకు మహత్తరమైన ప్రోత్సాహాన్ని అందిస్తున్నాయి. సామాజిక స్పృహను కలిగిస్తున్నాయి.. వారిని తెలుగు భాషవైపు ఆకర్శిస్తున్నాయి. తెలుగులందరూ ….”అంతర్జాల తెలుగు సేత …లేఖినిలో రాత ….వీవెనుడి నేత”. వీవెన్ . ఎ తెలుగుకు చేస్తున్న కృషికి ధన్యవాదాలు చెప్పి తీరవలసిందే ప్రతీ తెలుగు వ్యక్తీ.
రెచ్చగొట్టిన గుంటనక్కలు తోకముడిచాయి
రెచ్చిపోయిన పెద్ద పులులు గొంతు మూసాయి
గ్రామ సింహం లక్కుతోటి సింహమయ్యింది