జనవరి 2012
జనవరి 28, 2012
జనవరి 28, 2012
ఏమి కోరి సూరీడు
ఏమి కోరి చందురుడూ
ఏమి కోరి ధరియిత్రీ
నిత్యం అనునిత్యం
పరిభ్రమణ …
నిద్రాహారాలు మాని
నిద్రాహారాలు …
ఎండనకా వాననక
ఎండలు వానలు
శ్రమియించి
యిచ్చి న
త్యాగధనులు
మానవాళికి
స్పూర్తిప్ర దాతలు
స్వార్ధరహిత భావనలు
ప్రేమాస్పద వేదనలు
నేర్చుకుందాం
గణతంత్ర దినాన
ప్రేమను పంచుదాం
జనవరి 28, 2012
వాటికి అ దో పిచ్చి
రచన : నూతక్కి రాఘవేంద్ర రావు
అవును
వాటికి అదో పిచ్చి
నువ్వంటే
సూరునికీ
చంద్రునికీ
భూమాతకు
మువ్వురికీ
పిచ్చి కాక మరియేమిటి ?
ఎండనక వాననక
ఎండవానలిస్తుంటే
అది పిచ్చి కాక మరి ఏమిటి
పిచ్చే …
నిరంతరం
నీ కోసం శ్ర మియిస్తూ
నిష్కలంక రీతుల
నిద్రాహారాలు మాని …
నిద్ర ను ఆహారాన్నిస్తూ
శక్తినిచ్చి యుక్తినిచ్చు
ఎండ
విశ్రాంతినిచ్చి
శక్తి పెంచు రాత్రి
రాత్రనక పగలనక
రాత్రి పగలు కల్పిస్తూ
దివారాత్రులనీయ
సౌకర్యాలంటూ
ఓజోను విధ్వంసం
నీలిలోహిత కిరణ
ప్రచండ విలయం
ప్రాణ వాయువందించే
పచ్చని వృక్ష ధ్వంసం
యింతటి దారుణాలు
కాళిదాస విన్యాసం
అవును ఇంకా
వాటికి అ దో పిచ్చి
మనిషంటే
జనవరి 12, 2012
మహనీయులకు నివాళి
రచన : నూతక్కి రాఘవేంద్ర రావు.
జయంతులు
వివాకానందుడైన
విప్లవ మూర్తులైన
రాజకీయ ఉద్దండులైన
జాతికి మార్గం చూపిన
మహనీయులు ఇంకెవరైనా
జన్మదినాలు ఉత్సవాలు
ఉపన్యాసాలు కాదోయ్
కావలిసింది .
వారందించిన సద్భొదలు
స్వీకరించి సత్కర్మలనాచరించు
ఆడంబరాలు వదలి ఆచరణలో
సమాజ కళ్యాణ మనే
యజ్ఞానికి నీవూ
ఓ సమిధావు కా
అదే
ఆ మహనీయులకు
నీనివాళి .
జనవరి 11, 2012
స్వామి శ్రీ వివేకానంద …వుద్భోద
Posted by Gijigaadu under అవర్గీకృతం | ట్యాగులు: Sooktulu |13 వ్యాఖ్యలు
స్వామి శ్రీ వివేకానంద …వుద్భోద
(“భారత జాతికి నా హితవు ” అన్నస్వామి వారి చిరు గ్రంధం ఆధారం. )
నీ పై నీకు నమ్మకము ఆత్మ విశ్వాసము
లేనప్పుడునీవు ప్రపంచంలోని కోట్లాది దేవతలపై
నమ్మకముండి పూజించినా ప్రయోజనం శూన్యము.
ఆత్మ విశ్వాసమున్న కొందరి చరిత్రే ప్రపంచ చరిత్ర.