మహనీయులకు నివాళి

రచన : నూతక్కి రాఘవేంద్ర రావు.
జయంతులు

వివాకానందుడైన

విప్లవ మూర్తులైన

రాజకీయ ఉద్దండులైన

జాతికి మార్గం చూపిన

మహనీయులు ఇంకెవరైనా

జన్మదినాలు ఉత్సవాలు

ఉపన్యాసాలు కాదోయ్

కావలిసింది .

వారందించిన సద్భొదలు

స్వీకరించి సత్కర్మలనాచరించు

ఆడంబరాలు వదలి ఆచరణలో

సమాజ కళ్యాణ మనే

యజ్ఞానికి నీవూ

ఓ సమిధావు కా

అదే
ఆ మహనీయులకు

నీనివాళి .