బలహీనతలు.
రచన: నూతక్కి రాఘవేంద్ర రావు. 

ప్రపంచంలో యే మహామహుని
చరిత్ర అయినా ,….. కృష్ణుడి శ క్తు లొ అటు క్రీస్తు ఘనతలో …ప్రచారం
లేకుండా ,వెలుగులోకి రాలేదు. యే శాస్త్రీయ సూత్రమైనా
ప్రచారం లేకుండాను ప్రాసిస్త్యం పొందలేదు .ప్రచారం వ్యాపార వర్ణం పొందినపుడు
విస్త్రుతమౌతుంది. ప్రచారమాధ్యమాలు తామర తంపరగా పెరిగిన యీ తరుణం లొ….ప్రేమనే కాదు, మాత్రుత్వాన్నే, కాదు మిత్రత్వాన్నే కాదు, దేన్నైనా పెట్టుబడి పెట్టి ప్రాసిస్త్యం లోకి తెచ్చుకో గలరు, లాభాలు పొందనూ గలరు.

నాడు నమ్మకం నింపుకున్న శిష్యులు భక్తులై ప్రచారకులయ్యే వారు. నేడు ప్రచారాన్ని నమ్ముకొన్న వారికి ప్రచారం ద్వారా నమ్మకాలు అమ్ము కొంటున్నారు ప్రాచ్చ్యు లు.

అది వారి వ్యాపార నీతి, మన చేతకాని తనం. వారి కౌశలం.అ కుశలత వేసిన వల … ఆ వలలో మనం … వాళ్ళను తప్పుబడుతూ ఆక్రోసిస్తున్నాం .

విద్య ఉద్యోగాల రీత్యా తరతరాల వృత్తులు త్యజించి ఎండమావుల వైపు పయనించి విచ్చిన్నమైన వుమ్మ డి కుటుంబ జీవన వ్యవస్థ .

ప్రపంచం లొ ఎవరికీ అనుభవానికి రానంత పురాతన సంస్కృతీ సంపద మనకున్నాయని
యువతకు తెలిజేయని విద్యా వ్యవస్థ ,మారిన కుటుంబ జీవన వ్యవస్థ …ఆక్రోసించి
లాభం లేదు . ఒరవడిని అడ్డుకొని ఆపగాలిగేది నేటి యువత మాత్రమే. ఆ యువతే
ఆధునికత పేరుతొ విదేశీ ప్రచారాల మత్తులో కొట్టుకు పోతున్నారు. ఆవేదనచేంది
ఫలితమేముంది ?

ప్రేమికుల రోజు, మాత్రు దినోత్సవం ,పిత్రుదినోత్సవం ,స్నేహితుల దినాలు ,కృతజ్ఞతా దినాలు వగైరా వగైరాలు వేడుకలు …వీటినీ మనం చేసుకోవాలా అని విభ్రాంతి కలిగిస్తూ వ్యాపారాత్మకమై , ….మనకు లేని సంస్కృతా ! మన ప్రాచీన సంస్కృతిలోనే జీర్ణించుకొని వున్నాయి కదా ! వీటిని వారినుండి నేర్చుకోవాలా వంటి ప్రశ్నలు అభ్యంతరాలు …సందేహాలు .నిజమే ! మన సంస్కృతిలో వున్నాయేమో ,మనకు తెలియనివీ కావేమో?

ప్రపంచంలో ఎక్కడా లేనంతగా మన దేవాలయాలపై బూతు బొమ్మలు శిల్పించుకోగాలిగాము . . ఎందు కంటే బూతు అన్నది నాటి సమాజం లొ తప్పుగా భావించని స్వచ్చమైన ప్రాకృతిక అవసరం కాబట్టి.ఆరోగ్యకరమైన మైధున శిక్ష ప్రతి ఒక్కరికీ అవసరమని భావించారు కాబట్టి. యీ వ్యవస్తను ఆధునిక ప్రపంచ దేశాలు గౌరవిన్చాయికాని అభిశంసించలేదు. మనం ప్రచారం చేయకున్నా వారు గౌరవించి స్వీకరించారు. అలా అని వారెవరూ వారి దేవాలయాలపై శిల్పించ లేదు. వారికీ కావలిసినంత మాత్రమే ఇతర సంస్క్రుతులనుండి స్వీకరించడం వారికీ బాగా తెలుసు.

కాని మనలో మంచైనా చెడైనా మంచి చెడుల విచక్షణ అన్న మీమాంస లేకుండా ఇతరులను అనుకరించాడమనే మానసిక బలహీనత పెచ్చారిల్లడం …ప్రజా ప్రభుత్వాలు విశ్వవ్యాప్త వ్యాపార తంత్రంలో చిక్కుకు పోయి యువతను నిర్లక్ష్యం చేయడం, మరో కారణం. 

వారి వ్యాపార జాలం లొ చిక్కుకు పోయి ఆయా దినాలు పర్వదినాలుగా చేసుకుంటున్న మనం మన మనసులను నియంత్రించుకోవాలి గాని వారి వ్యాపార తంత్రాన్ని వ్యతిరేకించడమో వారి సంస్కృతిని నిరసిన్చడమో అది మన బలహీనత . మనపై మనకు విశ్వాసం లేకపోవడమే.