ప్రియా !
నా  హృదయ  ద్వారం 
తెరిచి  వుంచా
నీవొస్తావని 
స్వాగత భావనా 
తోరణాలు కట్టి 
రుధిర కణ ధారలతో
స్నానం  చేయించా 
పరిశుద్ధంగా
నా అంతరంగాన్ని
నీకర్పిద్దామని 
 
ఎన్ని వాలెంటైన్ డేస్
కాలగార్భాన కలిసి
పోతున్నాయో 
నీ నిరీక్షణలో 
నా హృదయం 
తెరిచేవుంది నీ రాకకై 
నేడైనా రావా !