కణ కణం శరీరాన
ఎదురు చూపు లు
ఆహారం కొఱకు…. .
ఆహారాన్ని
అందించే గుండె …
ఆ గుండె  గోడలకూ
ఆహారాన్నందించే
వ్యవస్థ
పాపం
ఆహారం అందలేదేమో
కొండొకచో బక్క  చిక్కి
ఎదురు చూపులు ….
వాటికీ
 కోపమొచ్చిందను కుంటా
పని  చేయమని
 మొరాయించా యని వైద్యులు.
నాదేదో తప్పున్నట్లు
నాపై అలిగింది గుండె.
నాకు తప్పదుగా
ఓ నాలుగు రోజులు
బుజ్జగించి వచ్చా  .
వైద్య శాలలో
అందుకే  యీ  నా అదృశ్యం .