సాకారం 
రచన : నూతక్కి రాఘవేంద్ర రావు. 

నేడెవరో అన్నట్లు 
అమృతమని
భావించకున్నా 
మృతం కాదు 
తెలుగు భాష 
పీక పిసుకుతూ  
ప్రభుత్వాలు 
పాటశాలల్లో 
ఆంగ్లానికే పెద్ద పీట వేసినా 
విధుల్లో ఆంగ్లాన్నే కిస్సించినా  
సౌద హర్మ్యాలనుండి
ఏనాడో తొలగించబడినా   
తన ఉనికిని  
కాపాడుకొని 
బ్రతికుతోంది 
అధిక సంఖ్యాకులైన 
గుడిసెవాసుల గుండెల్లో 
ప్రభుత్వ బడిలో 
బ్రతికున్నది  పేదల 
మమతల్లో 
సమతా వ్యక్తీకరణలో 
మాండలిక రీతుల్లో  
సరళ పద నర్తనలో 
అంతే  కాదు నేడు 
విద్యాధిక 
యువత లొ  అధికమైన 
ఉత్సాహం  
అంతర్జాల 
తెలుగు సమూహాల 
సేతలలొ సాకారం