నిర్దాక్షిణ్యంగా   …నీవు
రచన:నూతక్కి రాఘవేంద్ర రావు.

చెలీ !
నను నీ   మనసు పొరల నుండి
తొలగించావని నాతో చెప్పి
నిచ్చింతగా మురిసి
పోతున్నావని నేననుకోలేదు
నీ  అంతరంగం నేను చదవనిదా
చెలీ !
పంచుకున్న ఆశలు
ఊహాలోకంలో నిర్మించుకున్న
భవిష్య సౌద ప్రణాళికలు
అన్నిటినీ మరచావా
నిను మరచి నేనో క్షణమైనా
ఉండలేనని
నీకు తెలియనిదా ప్రియా !
నీ  ముఖ పుస్తక కుడ్యం పై
నా ప్రేమాక్షరాలు లిఖిస్తున్నా
నీ  అనుమతి పొందకనే.
తొలగించే లోపు ఒకసారైనా
చదవుతావని ఆశతోఆకాంక్షతో
వ్యక్తిగాతాన్ని బహిర్గతం చేయడం
నాకూ సంక్లిష్టతే .
కాని డియర్!
నను  మురిపించి మైమరపించి
నేడు  నన్నెందుకిలా
నీ మానాన   
నను నిర్దాక్షిణ్యంగా   నిర్లక్షించావు 
నా తప్పేమిటో ఒకపరి  చెప్పవూ.