మార్చి 2012


ప్రపంచ వ్యాప్త తెలుగులకు,తెలుగుభాషాభిమానులకు ,అంతర్జాల మిత్రులకు ,ముఖపుస్తక 

హితులకు, బ్లాగ్మిత్రులకు నా హృదయపూర్వక “నందన” నామ ఉగాది శుభాకాంక్షలు .

శ్రేయోభిలాషి….నూతక్కి రాఘవేంద్ర రావు.

బుడం చెట్టు కొబ్బరి కాయ.

రచన :నూతక్కి రాఘవేంద్ర రావు.

శలవుల్లో మా వూరు వెళ్లాను .

మా మామిడి తోటకు పోతూ

రైలు లైన్ ప్రక్కమ్మట నడుస్తున్నా

నాటి జ్ఞాపకాలు ఈగల్లా ముసురుకొని

వుక్కిరిబిక్కిరి చేస్తూ ……..

రైలు పట్టాలపై నడుస్తూ

పడకుండా బ్యాలెన్సు

చేసుకుంటూ …..

పడకుండా నడవటం

నా హాబీ !

ఏదో ఒక రోజు

ఖమ్మం నుంచి మధిర దాక

రైలు పట్టాల మీద

పడకుండా నడుస్తా ….

అది నా టార్గెట్.

పట్టాలపై ఎంత దూరం నడిచానో !

ట్రైన్ …దగ్గరకోచ్చానని

బొగ్గింజిను

పొడవాటి కూతపెట్టింది.

గభాలున

పట్టాలపై నుండి

కంకర పైకి ఆక్కడి నుండి

ప్రక్కకు దూకి

ఏమీ ఎరగనట్లు మొఖం పెట్టి

నిలబడితే

డ్రైవరు కోపంగా చూసి ఏదో తిట్టాడు …

దులిపెసుకొని అక్కడే నిలబడ్డా

దిగిన దగ్గరే పట్టాలపై నా ప్రయాణం

ప్రారంభించాలిగా…

మళ్ళా నా ప్రయాణం రైలు పట్టాల పైన ….

ఓ అరగంట …

గూడ్స్ రైలు వస్తోంది .

కింగ్ జార్జ్ బోడిగుండు

చిల్లు కాని

పట్టాలపై పెట్టి

దూరంగా ఎదురుగ్గా నిలబడ్డా .

ఇంజిను దగ్గరకొచ్చింది.

గ్రీజివ్వవా అని అరిచా .

రెండు గ్రీజు పొట్లాలు విసిరాడు.

మంచాడే.

గూడ్స్ రైలు వెళ్ళిపోయింది.

నా… కాని …చిల్లు కాని

ఎంత పెద్ద చిల్లు కాని!

పాలబెల్లం కొనుక్కుంటా నంటే

అమ్మ ఇచ్చిన చిల్లుకాని .

వెంకట్రామయ్య కొట్లో

కొనుక్కున్నానని చెప్పాలి…..

కాని అమ్మ అబద్ధం చెప్పడం

తప్పని చెప్పిందికదా. నిజమే చెబుతా

అమ్మ తిట్టినా నేను అబద్ధం చెప్పను .

గ్రీజు పొట్లాలు తీసుకొని మళ్ళా పట్టాల పై

నా పయనం మొండి గేట్ల దాక.

రోజూ పట్టాలపై నా ప్రయాణం

వూళ్ళో గోడలపై ఇక్కడ పట్టాలపై …

అక్కడ నుంచిమా పొలానికి వెళ్లి

అక్కడ మామిడి చెట్టెక్కా

అబ్బ ఎర్ర గండు చీమలు

కుడుతున్నాయ్.

అయినా చేట్టేక్కేసా.

ఓ కొమ్మ మీద ..

మామిడి కాయలు కోసుకొని

నా చిల్లు కాని కత్తితో

ముక్కలు కొసా .

జేబులో వుంది ఉప్పూ కారం పొట్లం

నంజుకు కు తింటూంటే

అయ్యో గ్రీజు పొట్లాలు

క్రింద పదుతున్నాయ్ !

అయ్యో మట్టి కొట్టుకు పోతే!

బొమ్మలేట్లా చేయడం ?

అప్రయత్నంగా జేబు చుట్టూ

బిగిసింది నా చేయి. .

ఎంత సహజంగా వుంది

గతకాలపు వూహ .

యీ క్షణాన జరుగుతున్నట్లు

అందమైన ఆ క్షణాలు

ఎంత తాజా గా వుంది?

ఏనాటిదీ జ్ఞాపకం ?

ఏమయ్యిది సిన్న దొరా

గుండె పట్టు కుంటున్నారు ?

ఆదుర్దాగా ఎవరో అడుగుతున్నారు ..

జ్ఞాపకాల సుడినుంచి బయటకు వచ్చా

సిన్న దొరా

కొబ్బరి బొండాం తాగు .

ఆయాసపడ్డావా

మన బుడం చెట్టుది.

అప్పుడు నువు నాటిన

చెట్టుకాయ సిన్న దొరా….

ఎదురుగ్గా మా పాలేరు

సుబ్బయ్య బాబాయ్ . .

వగర్చుకొంటూ

కొబ్బరి బొండం తో….

ఏమి లేదు బాబాయ్ !

జేబుమీది చేయి తీస్తూ అన్నా.

స్వయం కృతం .
రచన: నూతక్కి రాఘవేంద్ర రావు. 

నా చుట్టూ నే గీసుకున్న గిరి లొ 
నేనో ఒంటరిని. 
గిరిని బరిగా మార్చాలని 
చూసే నా శత్రు మూకలు 
దరిచేరకుండా నా జాగ్రత్గ్త్డ లు నావి .
ఆ యత్నంలో నేనుంటే 
నా అనేవారంతా నా
దరిజేరడం మానేశారు 

క్రొత్తవారూ దరిజేరరు. 
ఇప్పుడు నేనో ఒంటరిని.