స్వయం కృతం .
రచన: నూతక్కి రాఘవేంద్ర రావు.
నా చుట్టూ నే గీసుకున్న గిరి లొ
నేనో ఒంటరిని.
గిరిని బరిగా మార్చాలని
చూసే నా శత్రు మూకలు
దరిచేరకుండా నా జాగ్రత్గ్త్డ లు నావి .
ఆ యత్నంలో నేనుంటే
నా అనేవారంతా నా
దరిజేరడం మానేశారు
క్రొత్తవారూ దరిజేరరు.
ఇప్పుడు నేనో ఒంటరిని.
మార్చి 6, 2012 at 11:20 సా.
బాగుందండి గిజిగాడు గారూ. మీ కవిత చదివాక నాకొకవిషయం చెప్పాలనిపిస్తుంది. కానీ చెప్పినా ఉపయోగం కూడా లేదనిపించింది. ఎందుకంటే మీరు గీసుకున్న గిరి దాటి వెలుపలకి రాలేరు కాబట్టి.