అక్షర శిల్పి.
రచన :నూతక్కి రాఘవేంద్ర రావు.
అక్కడ ఎన్నో
మూస లు
వైవిధ్య మై
అతడు మూసలు
తయారు చేయడు
వాటిని
వినియోగిస్తాడు
కావాలనుకున్న
మూసలో
వలసిన పదార్ధం
వేసి
కూర్చి విడ దీసి
ఆ మూసనుంచి వెలికి వచ్చే
బొమ్మలు అన్నీ ఒకే తీరు
ముక్కు కళ్ళు చెవులు తల
ఎట్సెట్రా ఎట్సెట్రా
ఒక్కో మూసనుంచి
ఒక్కో ఆకృతి
కవితో! కధో ! నవలో!
అతడు అక్షర శిల్పి
భావకుడు
అక్షరం
పదమై
వాక్యమై
భావనలే
వర్ణ రంజితమై
పొందిన సొబగులు
కూర్చిన తీరులు …
నిపుణత లై .
వెరసి
కవి చాతుర్యమై
…………………..