యువతా జాతి భవితా మేలుకో .
 
ప్రజాస్వామ్యం లొ
 
పన్నాగాలు పడగలెత్తి 
 
కాటేసేందుకు బుసకొడుతున్న వేళ   
 
నిర్లిప్తత నిరాసక్తత  వీడి
 
కళ్ళు తెరిచి కాచుకో  
 

కోట్లాది ప్రజల జీవితాలు 

ఫణంగా పెట్టి తెచ్చిన 

లక్షలకోట్ల ప్రపంచ  బ్యాంకు

అప్పు లు ,

పన్నుల రూపం లొ ప్రజలు కడుతున్నతప్పు  

సేజ్జుల పేర 

కోట్లాది ఎకరాల ప్రజల

ప్రభుత్వ  భూములు ,
 
ప్రజలిచ్చిన అధికారం బలం తో

అప్పనంగా

దోచుకున్న అదినాధులు .


పీల్చే గాలినీ దోచేసుకున్నారు. 

గుక్కెడు నీళ్ళూ నీకు దక్కకుండా 

కుట్రలు పన్నుతున్నారు 

మనకేంటని నిమ్మకు

నీరెత్తినట్లు కూర్చున్నావు .

నీవు చేయని అప్పు నీవె తీర్చాలని 

మరిచావా, వెట్టికి తల ఒగ్గావా 

పెరిగిన పెట్రోలు ధరలూ,

పెరిగిన యింటి పన్నులూ
 
ఆకసాన్నంటిన 

దినవారీ సరకుల ధరలూ

రవాణా  చార్జీలు
 
వైద్యం ఖర్చులు 

అందలం దక్కించుకొన్న 

ప్రజా ప్రతినిధులు 

అధికారం చిక్కిందే అదనుగా 
 
అంతా చక్కబెట్టుకుని   

ప్రజల సొమ్ము దిగమింగిన
 
ప్రజా ద్రోహులు 
 
అతీగతీ లేకుండా చిద్రం 
 
అధికార దాహంలో 
 
సుపుత్రులు 
 
అక్రమ సంపాదన 
 
కాపాడుకొనేందుకు .
 
భావి యువ జీవితాలను

నిర్వీర్యం చేసే కుట్రల  ప్రణాళికలు 

సాగి పోతున్నాయి. 
 

 
యువతా జాతి భవితా మేలుకో .
 
ప్రజాస్వామ్యం లొ
 
పన్నాగాలు పడగలెత్తి 
 
కాటేసే వేళ కళ్ళు తెరిచి కాచుకో