ఏడ్పు  కాకిక నవ్వులెక్కడ?
రచన:నూతక్కి రాఘవేంద్ర రావు.
మమతలు కోల్పోయి
మనసులు ఏడుస్తున్నాయి
మరి ఎడ్వవూ ?
ఏడ్పు  కాకిక నవ్వులేక్కడ?
వ్యవసాయాధారిత దేశానికి
 గ్రామాలే పట్టుగొమ్మలంటూ
గ్రామావసరాలను
విస్మరించి న
వానాకాలం  చదువులు
గ్రామ రాజ్యం కూల్చివేసిన
చదువులు.. పై చదువులు
అర్ధాలే కోల్పోయిన
బంధాలు అనుబంధాలు
అనురాగాలు ఆప్యాయతలూ
ధనార్జన ధ్యేయమై
భుక్తి ప్రాధాన్యమై
జన్మనిచ్చిన
చదువులిచ్చిన తమ వూరునే
తిరిగి చూడని యువగణం
నగరీకరణ నేపధ్యం
వ్యవసాయం నామోషీ
గ్రామాలలో యువత ఎక్కడ?
యువ శక్తిని
గ్రామ గ్రామం
పట్టి ఉంచే
వ్యూహమేక్కడ?
యువత నిలిచే
గ్రామమెక్కడ?
గ్రామ గ్రామం  కునారిల్లితే
దేశ ప్రజలకు ఫుడ్డు ఎక్కడ?
గ్రామాలకు  స్వరాజ్యమేక్కడ?
ఏడ్పు  కాకిక నవ్వులెక్కడ?