ఏడ్పు కాకిక నవ్వులెక్కడ?
రచన:నూతక్కి రాఘవేంద్ర రావు.
మమతలు కోల్పోయి
మనసులు ఏడుస్తున్నాయి
మరి ఎడ్వవూ ?
ఏడ్పు కాకిక నవ్వులేక్కడ?
వ్యవసాయాధారిత దేశానికి
గ్రామాలే పట్టుగొమ్మలంటూ
గ్రామావసరాలను
విస్మరించి న
వానాకాలం చదువులు
గ్రామ రాజ్యం కూల్చివేసిన
చదువులు.. పై చదువులు
అర్ధాలే కోల్పోయిన
బంధాలు అనుబంధాలు
అనురాగాలు ఆప్యాయతలూ
ధనార్జన ధ్యేయమై
భుక్తి ప్రాధాన్యమై
జన్మనిచ్చిన
చదువులిచ్చిన తమ వూరునే
తిరిగి చూడని యువగణం
నగరీకరణ నేపధ్యం
వ్యవసాయం నామోషీ
గ్రామాలలో యువత ఎక్కడ?
యువ శక్తిని
గ్రామ గ్రామం
పట్టి ఉంచే
వ్యూహమేక్కడ?
యువత నిలిచే
గ్రామమెక్కడ?
గ్రామ గ్రామం కునారిల్లితే
దేశ ప్రజలకు ఫుడ్డు ఎక్కడ?
గ్రామాలకు స్వరాజ్యమేక్కడ?
ఏడ్పు కాకిక నవ్వులెక్కడ?
జూన్ 9, 2012 at 9:02 సా.
మీ కవీత చాలా బాగుందండీ
జూన్ 9, 2012 at 9:38 సా.
Thankyou Very Much for visiting my Blog n liking my post. Iam Very glad Dear. Pl Do Visiting …Sreyobhilashi ..Nutakki Raghavendra Rao.
జూన్ 10, 2012 at 6:57 ఉద.
nice, good one.
జూన్ 11, 2012 at 5:45 సా.
Wow ! happy to see your comment Dear. Thank you Very much…Sreyobhilaashi…Nutakki.
జూన్ 11, 2012 at 11:56 ఉద.
chaannallaki sumandee…mee kavitvam choodadam….chala baagundi
జూన్ 11, 2012 at 5:44 సా.
Thamk you Very much for visiting my blog n comment .