కుహుకుహూలు 
రచన :నూతక్కిరాఘవేంద్ర రావు 
చిరుకవితలు
(200 హైకూలలో ఈ తొలి 100 హైకూలు
లోగడ నా ఎఫ్బి కుడ్యం పై ప్రచురించబడినవి )
………………………………………

1) కొమ్మగాలిలో 
చెట్టు వేర్లు భూమిలో 
నీళ్ళివ్వాలిగా
………………………………………

2)పునాది రాళ్ళు 
లేనిదే ఇల్లుండదు 
కనిపించవు 
……………………………………….

3) నేను చెట్టెక్కా 
కొమ్మిరిగిపడింది 
నా జేబు ఖాళీ
………………………………………..

4)వేకువ పొద్దు 
అలారపు మోతలు 
కోడి కూతలు(కుక్కురోకోలు)
………………………………………..

5) మనసు కోతి 
చేట్లుగోడలు లెక్కా,
ఎక్కిన్చేస్తుంది
…………………………………………

6) అంతరంగాలు 
అర్ధం కావెవరికి 
విప్పే వరకు
………………………………………..

7) తప్పును దిద్దు 
దిద్దకపోతే తప్పే , 
రైటనుకొంటా
………………………………………..

 పునాది రాయి 
కోపమొచ్చి ఊగింది 
ఇల్లు కూలింది
………………………………………….

9) బావి గిలక 
కిలకిలలు కావు 
పిచ్చుకలాట
………………………………………….

10) కంకులు కట్టాం
పిచ్చుక లొస్తాయని
పిచ్చి ఆశలు
………………………………………….

11) రాసా నేనున్నూ 
హైకూలే అనుకుని 
హైకూలంటారా
…………………………………………

12) చెట్లంటే ప్రేమ 
ఎన్నిటినో పెంచాను 
విద్యుత్తుకీర్ష్య
…………………………………………

13)అక్షరాలవి 
అంకెల్లేవు లెక్కలే , 
ఆల్జీబ్రానట
…………………………………………..

14) మేఘాలాకారం 
వేటికి అవే 
పోలికలుండవు
…………………………………………..

15) తుమ్మెద నాదం 
తన్మయమై పుష్పం 
పుష్ప విలాసం
……………………………………………

16)నీలాకాసమె 
మేఘానికి క్యాన్వాసు,
చలన చిత్రం.
…………………………………………..

17)చెట్ల ఉయ్యాల్లో
ఊగుతుంది తెమ్మెర 
స్వంతమైనట్లు
…………………………………………..

18) మండుటెండలో
ఆకలితో పడితే 
తప్పెవరిది ?
………………………………………….

19)రాలే నక్షత్రం 
వెలుగులు దివ్యం 
ఆరే దీపం లా
………………………………………….

20) పుట్టలో పాము
అక్కడుంటేదేవుడు
బయట భయం
………………………………………….

21) విశ్వంలో నీవు 
ఇసుకపలుకులో 
లక్షో వంతట.
………………………………………….

22)ఇసుక కన్నా 
అల్పులు మనుజులు 
కొండంత అహం.
…………………………………………..

23)చరిత్రలను 
శహభాషనుకొందాం 
సోమరులౌదాం.
………………………………………….

24)ఇతరులను 
విమర్శించడమేగా
పనేమున్దింక
…………………………………………

25) మన భుజాలు 
మనమె తట్టుకుందాం 
తట్టరెవరు.
…………………………………………

26)
నీ ప్రతిభను 
వెలికి తీసి చూపు 
మెరవాలంటే
…………………………………………

27) 
సాధన చేయి 
అసాధ్యమేముందని 
సంకల్పం ముఖ్యం
…………………………………………

28)పాప కేరింత 
అమ్మను చూడగానే 
మహదానందం
…………………………………………..

29) 
నింగిన డేగ 
రెక్కల్లోపిల్ల కోళ్ళు 
తల్లి జాగ్రత.
………………………………………….

30 )
తన స్వార్ధంతో 
కుక్షి వేయిస్తుంటుంది 
వేషా లేన్నెన్నో
…………………………………………..

31)
ఉదయసంధ్య 
పికరవగానంతో
వుల్లముప్పొంగు
…………………………………..

32)
ముప్పది రెండు 
గంటకొక్కటి పూర్తి
నా చేతి హైకూ.
…………………………………..

33)
నేతులు త్రాగి 
పెద్దల మూతులెన్నో 
నాకేమేరుక
……………………………………..

34) 
కోట్ల ఆశలు 
అంతేలేని చావులు 
పొట్ట తిప్పలు.
……………………………………….

35)
నీతి ఒంటికి
నిండా “అవి” రుగ్మత
వైద్యుడెక్కడ?
……………………………………….

36)
నిజం నిప్పులా 
రగిలి మంటౌనంట
యుగాలైతేనేం
…………………………………………

37)
చరిత్ర సజీవం 
శతాబ్దాల పర్యంతం 
రాత తీరులో
………………………………………….

38)
మనసు మాట 
అంతరంగమొప్పాలి 
పాసవ్వాలంటే
…………………………………………….

39)
నిర్మలాకాశం
కనులకు పసందే , 
వర్షించదుగా.
………………………………………………

40)
గుండె చెరువు 
మనసు ఆనకట్ట 
ఏడుపాపాలి
……………………………………………….

41)
కాకతీయులు 
లంకెల చెరువులు 
జాతి వరాలు.
………………………………………………..

42)
పాలపుంతతో 
విశ్వయానం ఫ్రీ కదా ,
భూమిపై జీవికి
…………………………………………………

43)
అనుకుంటుంటాం
ఇంట్లోనే వున్నామని 
విశ్వం చుడుతూ
………………………………………………….

44)
అనంత యానం 
భూ గ్రహ నక్షత్రాలు
కాళ్లు నిలవ్వు .
……………………………………………………

45)
రెచ్చి పోతున్నారు 
రచ్చకు సిద్ధం వాళ్ళు 
ఓర్పు నీవంతు.
……………………………………………………

46)
ఓర్పు సహనం 
సాధనా పరికరాలు
వినియోగించు .
…………………………………………………..

47)
సమయం చూసి 
విచక్షణ వాడాలి 
మనిషివి గా
………………………………………………….

48)
సమాజం భద్రం 
వుమ్మడి కుటుంబంతో 
పునః నిర్మిద్దాం
…………………………………………………..

49)
ఆకసానికి
విసనకర్ర వృక్షం 
చెట్లు పెంచండి
…………………………………………………….

50)
లోహ భ్రమణం 
ఐస్కాంత క్షేత్రము లో 
విద్యుదుద్భవం
……………………………………………………

51)
అభిమతమె 
మతమయి మూర్ఖమై
హింసకు తావు
…………………………………………………….

52)
ఏకెప్పటికి 
మేకుకాదుఎంతన్నా 
సామేతకోకే 
…………………………………………………….

53)
ఇజాలెన్నున్నా 
నిజాలుగా మార్చవు 
రాజకీయాలు 
……………………………………………………..

54)
చల్లత్రాగకు 
తాటిచెట్టుల క్రింద 
కల్లనుకుంటే !
……………………………………………………..

55)
నవ వధువు 
ఆకాంక్షలు ఎన్నెన్నో 
ధన్యులేందరో 
……………………………………………………

56)
గుప్పెడు కుక్షి 
ఆటలు ఆడిస్తుంది 
మనుషులను.
……………………………………………………..

57)
మనిషి చేసే 
పనులకు వెనుక 
పాత్ర కుక్షిదే
……………………………………………………….

58)
తేనే టీగలు 
కష్టపడి కూర్చితే 
తేనే దోపిడీ 
………………………………………………………..

59)
రవి కిరణం 
మానవాళికి వరం 
విద్యుత్కరువా?
…………………………………………………………..

60)
విద్యుత్ రాజు 
రాబోయే కాలానికి 
సూర్య కిరణం
……………………………………………………………

61)
బహు జాగ్రత్త 
స్నేహితుడే విద్యుత్తు
నిర్లక్ష్యం శత్రు:
……………………………………………………………..

62)
కరువైపోతే 
నీరు నిప్పు ఇంధనం 
సూరయ్య దయ.
……………………………………………………………..

63)
సూరయ్య శక్తి 
తరగని వనరు 
భావికి వరం
…………………………………………………………….

64)
నిశిరాత్రి లో 
మెరుసే దివాకరం 
సోలార్విద్యుత్.
……………………………………………………………..

65)
చేనంతా మెక్కి
బందీదొడ్డి అనువు 
నెమరేతకు.
……………………………………………………………..

66)
ప్రేమ పల్లవి 
రెండు అంతరంగాల 
నాట్య రవళి.
………………………………………………………………

67)
అదేంటో! ప్రేమ 
నానుతుందరి నోళ్ళ 
నిత్యాహారమై .
……………………………………………………………..

68)
ప్రేమను పంచు 
ఊరుతూ నె వుంటుంది 
ఊట బావిలా
………………………………………………………………

69)
క్రమ శిక్షితం 
అలుపెరుగనిది 
సమయసూచి
………………………………………………………………..

70)
నాకెందుకులే! 
నిరాసక్త యువత,
ప్రోత్సాహం లేదు.
………………………………………………………………….

71)
తన కెందుకని 
భూభ్రమణ మాపితే 
మనమేమౌతాం
……………………………………………………………………

72)
మనిషిక్కడే 
మనసెక్కడో మరి 
అన్యమనస్క
……………………………………………………………………

73)
సంక్షిప్త రూపం 
భావానా విస్ఫోటనం
చిరు కవిత
…………………………………………………………………..

74)
వ్యక్తీకరణ
రూపాలెన్నెనని 
కవితొకటి
……………………………………………………………….

75)
రాసేదెందరో 
బ్రతికేది కొందరే ,
కవితలుగా
………………………………………………………………

76)
ప్రగతి,ధ్వంసం 
శాస్త్ర విజ్ఞానానికి 
ఇరు పార్శ్వాలు
………………………………………………………………..

77)
పచ్చటిచెట్టే 
మ్రోడయ్యిందేన్దుకో 
కిలకిల్లేవు
………………………………………………………………..

78)
కావాలన్నది 
పొందినా వెంపర్లాట 
అసంత్రుప్తంట.
…………………………………………………………………

79)
నీ నా భావన 
పెరిగుతున్న దూరం, 
అందుకే మనం.
………………………………………………………………….

80)
తృప్తి సంతోషం
అసంతృప్తి దుఃఖము 
సంతోషం పొందు.
…………………………………………………………………

81)
చేద చేంతాడు 
బావి పైన తాగాడి, 
తోడుకో నీళ్ళు .
……………………………………………………………………

82)
పచ్చని వనం 
వెదుకుతున్నమేఘం 
ప్రసవానికి
…………………………………………………………………..

83)
మేఘప్రసవం 
వర్షానికి జననం 
ధాత్రి తన్మయం
………………………………………………………………………

84)
వేరేవరిదో
భావనం తమదిగా, 
భావ చోరులు.
………………………………………………………………………….

85)
ఇది కోయిల 
పాడిన పాటలా లేదూ
హైకూ అంటుంటే.
……………………………………………………………………………

86)
పండు వున్నది 
చిట్టచివరి కొమ్మకు 
ఆశ పడకు
…………………………………………………………………………….

87)
జామ చెట్టెక్కి 
పండు తింది ఉడత, 
క్రిందంతా పెచ్చు
……………………………………………………………………………..

88)

గుండె గాయని 
లబ్ డబ్ సంగీతం 
ఆగితే చావు.
……………………………………………………………………………..

89)

నిత్య నిబద్దం 
జీవితాంతం నృత్యమే 
గుండె నర్తకి
……………………………………………………………………………….

90)
మంచి, చెడుకు
వేర్వేరుగా నదులు 
గుండె నిర్మాణం
………………………………………………………………………………..

91)
మెదడు ఒక 
అనుభావాలపెట్టె 
ఎన్ని అరలో.
……………………………………………………………………………….

92)
బొట్టు బొట్టును 
ఒడిసి పట్టు 
నీరు అమూల్యం.
………………………………………………………………………………

93)
నీటి యుద్ధాలు 
గ్రహాంతర యాత్రలు 
భవిష్యత్తులో 
……………………………………………………………………………….

94)
నీరు లేనిదె 
బ్రతుకుసున్నా 
మనిషీ టేక్కేర్
………………………………………………………………………………..

95)
తీర్చదు దాహం 
సంద్రం విశాలమైనా 
ఉప్పని నీరు.
………………………………………………………………………………….

96)
చిన్న చలమ 
తీర్చును పెను దాహం.
తియ్యని నీరు
……………………………………………………………………………………

97)
వ్యక్తి గౌరవం 
పరస్పరం ఇస్తేనే 
సుఖ సంసారం
…………………………………………………………………………………

98)
శతకం వైపు 
నా హైకూ పయనం 
విసుక్కోకండి
………………………………………………………………………………….

99)
భార్యా భర్తలు
సంసారపు బండికి 
కట్టిన ఎడ్లు 
………………………………………………………………………………..

100)
హైకూ శతకం 
సంపూర్ణమీక్షణం 
స్వంత చప్పట్లు.
………………………………….