తోటి బ్లాగరు మిత్రులకు చాలా కాలం తరువాత మిమ్ములనందరినీ తిరిగి నా “హైకూ “శతకం తో కలుస్తున్నందుకు చాల ఆనందంగా వుంది.మధ్యకాలంలో ఈ బ్లాగు పై దృష్టి కేంద్రీకరించక పోవడానికి సాంకేతికంగా నా ల్యాప్ తాప లో కొన్ని ఇబ్బందులు తలెత్తడమే కాక నా బ్లాగులో నేను ఎంత ప్రయత్నించినా నా పోస్టులు ఎందు చేతనో అనుమతించ బడక ఎక్కువ భాగం ఫేసు బుక్ లో పోస్ట్ చేయడం జరిగేది. చాలా రోజుల తరువాత ప్రయత్నిస్న్చా నా హైకూ శతకం “కుహుకుహూలు” పోస్ట్ చేయ గలిగాను. ఈ మధ్య కాలం లో ఎఫ్ బి లో పది హీను వందల పై చిలుకు “నానోలు”, రెండు వందలు “హైకూలు”, రెండు వందల యాభై పై గా “రెక్కలు” , వెయ్యికి పైగా ” చిరువాక్య కవితలు “(ఫెంటోలు)మరికొన్ని వ్యాసాలూ, కవితలు ఫొటోలతో అలా కాలం గడిపాను.నిజానికి తోటి బ్లాగర్లను ,వారి ప్రచురణలను చూసి కామెంట్ చేసే అవకాసం లేకపోయిందని చెప్పడానికి చింతిస్తున్నాను. గతం లో లా నన్ను స్వాగతించి ఆదరిస్తారని ఆసిస్తూ…అందరికీ నా శుభాకాంక్షలు. …మీ శ్రేయోభిలాషి ..నూతక్కి రాఘవేంద్ర రావు.