అణువులు .  
నూతక్కి రాఘవేంద్ర రావు.
……………………………………………………………………………………………………………………………………………………………….
 
అణువులు
 
(యాబై అరవై మద్దెగాల)
 
రచన :నూతక్కి రాఘవేంద్ర రావు,
అణువులు
యాబై అరవై మద్దెగాల….1
 
రచన : నూతక్కి 
 
మనసు వురకలేస్తనే వుంటది
 
శరీరం సాయం జేయ్యది
 
గంతనే
 
మూడు చక్రాల బండి
……………………………………….
 
ప్రక్రియ : అణువులు
యాబై అరవై మద్దెగాల….2
 
రచన : నూతక్కి 
 
కాయ గోయ్యనీకి బోయి  ….
 
చెట్టును నేనెక్కినుంటి 
 
గంతనే!
 
మూడు చక్రాల బండి
 
——————————————————
యాబై అరవై మద్దెగాల-3
 
రచన : నూతక్కి 
(ప్రక్రియ:అణువులు )
 
డ్రైనేజి మూత
 
దీసి బెట్టిన్రుజూస్కోలె
 
గంతనే!
 
మూడు సెక్రాల బండి
 
———————————————-
 
యాబై అరవై మద్దెగాల-4
 
రచన : నూతక్కి 
 
రోడ్డేసిన్రు
 
కేబులోల్లు తవ్విన్రు 
 
గంతనే!
 
మూడు సెక్రాల బండి
 
—————————————–
 
యాబై అరవై మద్దెగాల-5
 
రచన : నూతక్కి 
 
అద్దం లెక్క బాత్రూం
 
హాపిగ లోన బోతి 
 
గంతనే!
 
మూడు సెక్రాల బండి
 
————————————————–
యాబై అరవై మద్దెగాల-6
 
రచన : నూతక్కి 
 
రోడ్డు దాట బోతుంటిని 
 
రాంగు రూట్ల కుర్ర బైకు 
 
గంతనే!
 
మూడు సెక్రాల బండి
 
——————————————————
యాబై అరవై మద్దెగాల -7
 
రచన : నూతక్కి 
 
ప్లాస్టిక్ చైర్ల కూర్సుండ బోతి 
 
కుర్సీ ఎనక్క్కిజరిగే 
 
గంతనే!
 
మూడు సెక్రాల బండి ల్
————————————————————
అణువులు .  
నూతక్కి రాఘవేంద్ర రావు.
 
యాబై అరవై మద్దెగాల-8
 
అలసిపోయి ఆత్రంగా 
 
సోఫాల కూలబడితి
 
గంతనే!
 
మూడు సెక్రాల బండి
———————————————————
 
అణువులు .  
యాబై అరవై మద్దెగాల-9
 
రచన : నూతక్కి రాఘవేంద్ర రావు.
 
స్టూలు పైన స్టూ లేసుక 
 
టూబు లైటు మార్చ బోతి 
 
గంతనే!
 
మూడు సెక్రాల బండి
————————————————————-
 
యాబై అరవై మద్దెగాల -10
 
రచన : నూతక్కి 
 
 
పిండి కాడ కాపలా 
 
కుక్కొస్తే తరమ బో తి 
 
గంతనే 
 
మూడు సెక్రాల బండి
 
——————————————————————
యాబై అరవై మద్దెగాల-11 
 
రచన : నూతక్కి 
 
మనుమడేమో మొండికేత్తే 
 
అల్లబిల్లి తిప్పినుంటి 
 
గంతనే 
 
మూడు సెక్రాల బండి
 
——————————————————————-
యాబై అరవై మద్దెగాల-12
 
 
రచన : నూతక్కి 
 
పోర్టరు కూలెక్కువని 
 
ట్రంకు పెట్టె మోసినుంటి 
 
గంతనే 
 
మూడు సెక్రాల బండి
—————————————————————–
 
అణువులు.
 
యాబై అరవై మద్దెగాల-13
 
రచన : నూతక్కి 
 
అటక మీన బలువు సరుకు 
 
దించుతనని నే నెక్క బడితి 
 
గంతనే 
 
మూడు సెక్రాల బండి.
————————————————————–
 
అణువులు.
 
యాబై అరవై మద్దెగాల-14
 
రచన : నూతక్కి 
 
దగ్గరైతదని టు వీలర్ల 
 
గుంతల రూటేంచుకొంటి 
 
గంతనే 
 
మూడు సెక్రాల బండి
…………………………………………………
 
అణువులు.
యాబై అరవై మద్దెగాల-15
 
రచన : నూతక్కి 
 
బస్ స్టాప్ కాడ జర స్లో 
 
జూస్కోలె నే దిగ బడితి 
 
గంతనే 
మూడు సెక్రాల బండి
—————————————–
 
అణువులు.
యాబై అరవై మద్దెగాల-16
 
రచన : నూతక్కి 
 
రూఫు మీన
 
 పాకుడట్టె 
 
సాఫుజేయ కాలుజారే 
 
గంతనే 
 
మూడు సెక్రాల బండి.
—————————————-
 
అణువులు
 
యాబై అరవై మద్దెగాల-17
 
రచన : నూతక్కి రాఘవేంద్ర రావు,
 
 
ఎలక తల్లి ఇంట్ల జొర్రె 
 
తరుముకుంట ఎగిరి పడితి 
 
గంతనే 
 
మూడు సెక్రాల బండి.
 
అణువులు.

————————————————-

 
యాబై అరవై మద్దెగాల- 18
 
రచన : నూతక్కి
 
కొమ్మ మీన ఉడత తల్లి
 
పూటో తీయ ఎంట బడితి 
 
గంతనే 
 
మూడు సెక్రాల బండి
——————————————————-
 
అణువులు.
 
యాబై అరవై మద్దెగాల- 19 
 
రచన : నూతక్కి 
 
దారిమద్దె గుండు బండ 
 
అసంటకు నెట్ట జూస్తి 
 
గంతనే 
 
మూడు సెక్రాల బండి.
———————————————–
 
అణువులు.
యాబై అరవై మద్దెగాల-.-20
 
రూఫు మీన నడుసుకుంట 
 
ములక్కాడ తెంచబోతి 
 
గంతనే 
 
మూడు సెక్రాల బండి.
———————————————–
అణువులు.
యాబై అరవై మద్దెగాల- 21
 
రచన : నూతక్కి
 
మనుమడు  అడగిండని     
 
పుట్టు బాలు తన్నినుంటి 
 
గంతనే                               
 
మూడు సెక్రాల బండి
——————————————————
posted on 29-08-2011. 
 
 
అణువులు
 
యాబై అరవై మద్దెగాల- 22
 
రచన : నూతక్కి
 
 
తూనీగను తరుముతున్న 
 
మనుమని నేనడ్డ బోతి 
 
గంతనే 
 
మూడుసెక్రాల బండి .
 
——————————————-
 
అణువులు
 
యాబై అరవై మద్దెగాల- 23
 
రచన : నూతక్కి 
 
పై ట్యాంకుల నీల్లు లేవు 
 
బిజిలిబోవ మోయబడితి 
 
గంతనే 
 
మూడుసెక్రాల బండి
————————————————–
 
అణువులు
యాభై అరవై మద్దెగాల -24
 
రచన  :నూతక్కి 
 
సీడీ లెంట  గుట్ట గుడికి 
 
 పోరలెంట వురకబడితి 
 
గంతనే
 
మూడుసెక్రాల బండి 
——————————————-
అణువులు
 
(చివరిది,పచ్చీస్వీ)
 
యాబై అరవై మద్దెగాల- 25
 
రచన : నూతక్కి
 
ఎత్తుగడ్డ తోక్కలేక 
 
రిచ్చవోడు, సాయంబోతి
 
గంతనే
 
మూడు సెక్రాల బండి 
————————————————–