గెలాక్సీ …చిరువాక్య కవనం : రచన నూతక్కి రాఘవేంద్ర రావు. (నావి కొన్ని ఫెంటోలు)

November 30, 2014 at 11:07pm

నా ఫెంటోలు.

రచన : నూతక్కి రాఘవేంద్ర రావు.

గతం లో ఫెంటోలు గ్రూప్  తొలినాళ్ళలో ఆగ్రూప్  నిర్మాణ దశలో వ్రాసిన నా ఏకవాక్య  రచనలలో  కొన్ని  .

——————————————————————————————————-

1)  ఆకులు రాలి పూలోస్తే వసంతం కూస్తుంది కుహుమని.

2) గొంతుందని అరిచినంత సందేశం కాబోదది.

3) కావాలనుకుంటే కోల్పోవడానికి  సిద్ధపడక తప్పదు .

4) ఆశయ సాధన లొ ఎవరో అడ్డంకని ఏడవడం చేతకాని తనం.

5) పాల కోసం తోకేత్తి నిలబడితే  ప్రయోజనం శూన్యం  తన్నులు తప్ప.

6) శతాబ్దాలక్రితం  జరిగిన అన్యానికి నేడు మరెవరినో భాధ్యులనడం విజ్ఞత కాదు.

7) నాడెవారో చేసిన అన్యాయాని కి నేడెవరో భాధ్యులా ?

8) మూర్ఖుడు హితుని ద్వేషిస్తాడు విచక్షణా రహితుడు.

9) వర్తమానం  త్రుటికాలం .

10 )మనిషి బ్రతుకు  త్రుటికాలమే.

…………………………………………………………………………..

11) భవితలో  జీవించడం అసాధ్యం… వర్తమానంలోనే జీవిస్తాం  కనుక.

12) భూత కాలం శోచనీయం భవిత యోచనీయం .

13) నిండు తేనెపట్టు  దోపిడీ  పాలు .

14) గాలిలోఎగిరింది ఆకు చీమ కూడా ఫ్రీగా.

15) కాయలున్న చెట్టుకే రాళ్ళ దెబ్బలు .

16 )మ్రోడు నీడ నివ్వదు,గూటికి తావునివ్వదు  .

17)చెట్లు ,పండ్లు, పక్షులు, విత్తులు, మొక్కలు ప్రకృతి ప్రక్రియ.

18) ఆకులు రాలుతున్నాయి రాలుగాలం.

19)మా, నా,స్వార్ధ వ్యక్తీకరణలు .

20)మీది,  మా ది ,  నీది , నా ది , మీరు, మేము,  వేర్పాటు వేదనలు.

……………………………………………………………………………

21)మన, మనం,  సౌహార్ద్ర భావనలు

22)గాలిలో ఎగిరే ఆకు చీమ కూడా ఫ్రీగా .

23)చెట్టున పండుటాకు బిక్కు బిక్కుమంటూ

24)మనం ఒకటి అన్న బలం నిలిచి వుండు కలకాలం .

25)  ధనం ప్రపంచాన్నిశాసిస్తున్దంకోవడం  పొరబాటు.

26)ధనంతోటి  కొన్నబలం వుంటుందోక క్షణకాలం.

27) కుక్షె జగతిని శాసిస్తోంది    .

28)ఆకలి ఆవిష్కరణలకు మూలం.

29) దినకరుడు శక్తి ప్రదాత   .

30)  జలం దివ్యౌషధం.

…………………………………………

31)ధాత్రీ పరిరక్షణ జీవకోటి సంరక్షణ.

32)జీవకోటికి  ఆధారం  ధరిత్రి.

33)ఊపిరి  జీవుల ప్రాణాధారం.

34)వుచ్వాసం నిశ్వాసం మంచి చెడులు.

35)ఉచ్వాస నిశ్వాసాలే   ఊపిరి .

36) భావోద్వేగం అక్షర సంకలనం కవిత .

37) నూతిలో రాయేస్తే ప్రతిబింబం అలజడి.

38)   సంపాదనకన్న పొదుపు మిన్న.

39) సంఘీభావం సహజీవనం చెదపురుగులు .

40) క్రమశిక్షణకు ఆదర్శం చీమలు.

…………………………………………………….

41) శ్రమ  జీవన సౌందర్యం తేటి .

42) తేటికి  ముద్దులిచ్చి మురిసినవి  విరులు

43) సాహసం వీరుని  ధీర లక్షణం.

44) మహా భారత కాలం అధర్మానికీ ఓ ధర్మం వుండేది .

45) రెక్కలు  తెగిన  పక్షులు వృద్ధులు.

46) ధర్మాధర్మాలు ఊసరవెల్లులు .

47) ఒకరికి న్యాయం మరొకరికి అన్యాయం.

48) న్యాయాన్యాయాలు సందర్భోచిత విన్యాసాలు.

49) భాషా ప్రవీణుల అహంకార ఆభిజాత్యం సరళ త పై ఉక్కు పాదం.

50)పాతా ళం లొ తెలుగు భాషా వ్యాప్త వుద్యమ తీరులు.

………………………………………………………………………..

51)మెలుకువలోనిద్ర నటన తెలుగు భాష పై ప్రభుత.

52)భాషకు వెలుగు అంత ర్జాలంలో ఆధునిక యువత.

53)భాషకు వెలుగు అంత ర్జాలంలో ఆధునిక యువత.

54)తెలుగు భాష ఔత్సాహికులు  ..ఉత్సాహపు జ్వాలలు …నిబంధనల నీళ్లు.

55) ఉచ్చ్వాసం నిశ్వాసం ప్రాణానికి ప్రాణం.

56) చేలో కలుపు, కడుపునున్నమలినం, నిత్యం వర్జితం.

57) విశ్వంలో దినకరుడొక రేణువు… మరి మనిషి?

58) పృధ్వీ విధ్వంసం కాళిదాస విన్యాసం.

59) రాజైనా పేదైనా తినేది పిడికెడే.

60) దండుకొన్న లక్షల కొట్లు,లెక్కింపబడుతున్న  ఊచలు .

………………………………………………………………….

61) ఎవరికి వారు నేనొక్కడినే, రాజుగారి పాల సేకరణ అన్నీ నీళ్లు

62) నాకేందుకులేమ్మని నిర్లిప్తత లొ ప్రజలు .. నడ్డి విరుస్తూ అదినాధులు అధికారులు .

63) సంకల్పం పట్టుదల సాధనకు పరికరాలు

64) సౌందర్య ప్రదర్శన బట్టలెందుకిక  మిల్లులేందుకిక.

65) ధ్యేయానికి అధైర్యానికి పొసగదు.

66) భూతకాలం అనుభవాల దొంతర.

67) అనుభవాలు వర్తమానానికి నియంత్రణా ఘంటికలు.

68) అనుభవం  భవితకు  జీవన  మార్గదర్శకం  .

69)   రెక్కలు ఎగిరెందుకే, కొన్ని పక్షులు ఎగరలేవు.

70)   వర్తమానం భూతకాలపు ఓ విస్తృత ధ్ర్హుహ్క్కోణపు విశ్లేషణ.

………………………………………………………………………..

71) నిజ జీవన సంగీతం లొ అపస్వరాలెన్నో

72) తొంభై  శాతం  నగ్నం బికినీలాట.

73) ఎవరికి వారే ఘనులు మహాభారత యుద్ధం లొ

74) పద పదాన స్రవించిన భావం రాగ  ప్రవాహమై పారుతోంది.

75)  ధనం  తోటి  కొన్న  బలం ఎంతో కాలం నిలబడదు.

76) కనలిన హృదయం సొలసిన మనిషి వేసట లొ మనుషులు.

77) బోసినవ్వుల  వెలుగులు మనసుకు సాంత్వనలు.

78) సృజనలు, ఆవిష్కారాలు , అంతరంగ సంవేదనలు.

79) ఆశన్నది లేకుంటే ఆకాంక్షలు వుండవు.

80) నాకెందుకులే  యని నిర్లిప్తతలో ప్రజలు .

……………………………………………………………………..

81)ప్రజల  నడ్డి  విరుస్తున్న అదినాధులు, అధికార గణం

82) ఉచ్చ్వాసం నిచ్చ్వాసం ప్రాణానికే ప్రాణం .

83) మా నా మన స్వార్ధ వ్యక్తీకరణలు.

84) ఆకులు రాలుతున్నాయి …రాలుగాలమొచ్చింది  .

85) దండుకున్న లక్షల కోట్లు …ఊచలు లెక్కింప బడుతున్నాయ్ .

86) రాజైనా పేదైనా పొట్టకు పిడికిడు మెతుకులు చాలు.

87) విశ్వ పరిమాణం  లొ దినకరుడు ఒక రేణువు  . మరి మనిషి ?

88) ఎవరికి  వారు  నేనొక్కడినే …రాజుగారి బిందెల్లో అన్నీ నీళ్లె.

89) సమస్య లేకుంటే పరిష్కారం మూసినా పుస్తకం ?

90) అమ్మమ్మ నాన్నమ్మలు యువతకు వ్యక్తిత్వాలు.

…………………………………………………………………..

91) గుండెలోతుల దాగి పుట్టింటి మమతలు అత్తింటి కేగే

92) వేవేల  భావనల  సంద్రం  ఓ  చిరు  చిత్రం  .

93) వికృత ప్రేమ భావనలు నికృష్ట వేదనలు యాసిడు దాడులు.

94) కళాకారుడు అమరుడు ఆతని వ్యక్తిగత లోపాలు సామర్ధ్యాలతో సహా .

95) కొబ్బరి చెట్టున కాయలు చెట్టెక్కడం తెలియదు ….మొక్క పెట్టగానే చెట్టెక్కడం నేర్చుకో.

96) తేనే  తుట్టె నిర్మాణం అద్భుతం, తేటి కూర్చు మధువు  మధురం, తుట్టె కదిపావో కష్టాల పాలు.

97) సమాజం  ఓ  కుటీరమైతే సంస్కృతి ,సంప్రదాయాలు రెండు నిట్టాళ్ళు.

98)  పెదవి  దాటిన  మాట  తుపాకి  వీడిన  తూటా .

99) కులం  లేదు  మతం  లేదు  కడుపోక్కటే  హితం .

100) కాలంశకటం. చక్రంలొఆకులం ,తిరగక తప్పదు.

……………………………………………………………………………………………………………

101) కుక్షి  నిండితే  ఆభిజాత్యం  హూంకరిస్తుంది .

102) కులం అదో ఆభిజాత్య దాహం

103) కుక్షి    కొఱకు   వృత్తి కులమై కల్లోలమై.

104) ధ్యేయ ముంటే  అధైర్యమెందుకు ?

105) కవికి ప్రోత్సాహం ..ఉత్సాహం ఆలంబన .

106) అభినందన సృజనకు ఆలంబన .

107) భావ  వేదనలు  అక్షర  పద  సంకలనాలు .

108) ఎర్రగా కాల్చి సుత్తి  వేటుతోనే మలుగు ఇనుము  .

109) రెచ్చగొట్టినా రెచ్చి పోకు అది సంయమనం.

110) సందిగ్ధం  తటపటాయింపు రైలు వెళ్ళిపోయింది.

……………………………………………………………………

111) రెచ్చి  పొతే  సంఘర్షణ లక్ష్యం నిర్వీర్యం.

112)ఒడిదుడుకుల    వాస్తవాల  క్రీనీడల్లో  పారాడేది  జీవితం .

113) కష్టమంటూ లేకుంటే సుఖం విలువ ఇంకెక్కడ?

114) వెలుగులే  లేనప్పుడు  నీడలనే  మాటేక్కడ ?

115) పల్లమంటూ  లేకుంటే ఎత్తుకు విలువెక్కడ?

116) నాడన్నది ఉన్నపుడే నేటికి వునికిక్కడ .

117) రేపటి కట  నేడు  నిన్న .

118) నిన్నకు  అది   నేడు  రేపు

119) మొన్నకు  నిన్న  రేపు,  నేడై తది అది ఎల్లుండి .

120) ప్రోత్సహించడం నా విధి..మంచియని భావించినపుడు.

……………………………………………………………………….

121) నా  వ్యక్తీకరణలు మనో జనిత వేదనలు.

122) భావాక్షర  సంకలనం  పదం .

123) పదాలు ఇమిడ్చినంతనే కవిత కాదు.

124) కవిత్వం భావాక్షర భంగిమ ..

125) ప్రేరణ ఆత్మీయ ఆలంబన .

126) ప్రోత్సాహం సృజన ఆవిష్కారం.

127) విడి విడిగా అక్షరాలు సంకీర్ణం .. పదం

128) కాలంనిత్య ప్రవాహం జీవితం నదిమధ్యలో  లంక .

129) అన్నం పరభ్రహ్మస్వరూపం మెతుకుల తల్లులేవరో .

130) తుమ్మెద ఝుంకారం విరికన్నియ తన్మయం .

ప్రకటనలు