ఉద్దండులు

రచన :నూతక్కి రాఘవేంద్ర రావు.

తెలుగు సాహిత్య ఉద్దండులు

కొందరు

భాషా కోవిదులు

పద వుచ్చారణా ధీరులు

మాన్యులు

ఉత్సాహాన్ని ప్రోత్సహించనేర్వని

పోకడల అహంకార ధురీణతలు .

తెలుగు భాష పై

స్వీయోత్సాహం

అంతర్జాలంలో అక్షర విన్యాసం

తప్పో ఒప్పోతప్పటడుగులు

అడుగులే పరుగులై తే

పాపం వారికి తెలియదు

ఎదురురాళ్ళు  వ్యంగ్యోక్తులని  .

అపహసించేవారుంటారని

మార్గనిర్దేశకత్వం వహించకనే

ఆగ్రహ జ్వాలలు కురిస్తే

సరిదిద్దకనే అపహాస్యమాడితే

అవాకుల చవాకులతో

అస్త్రాలు సంధిస్తే

ఊపిరి పోసుకుంటున్న

భాషా బాల్యం

ఉత్సాహం చచ్చి

వూపిరి కోల్పోదా !
తెలుగుభాష చస్తోందని

మృత్యుఘోష

ఒక ప్రక్కనేర్వాలని తపనపడే

అత్యుత్సాహం

మరో ప్రక్క

బిక్కచచ్చి పొతే

వుత్సాహంపై దుమ్ము చిమ్మే

ఉద్దండుల వ్యూహపాశం

ఊపిరందక మ్రుత్యుద్వారం

తట్టబోదా తెనుగు భాష  !

ఓంకారమే నాదమై

వేదమే సంవేదనై తే …

అక్షరం పలికిన ప్రతి వాడు

తానూ ఓ కవిననుకొంటె తప్పేంటి

తను వల్లించినదే కవిత్వమనుకొంటే

ముప్పేమిటి ?

కొంపలు మునుగుతాయా

అండపిండ భ్రహ్మాండాలు

బ్రద్దలౌతాయా

అంతనే తెనుగు సాహిత్యం

భ్రష్టు పట్టి పోతుందా

ప్రయోగాల విన్యాసం లో

భాషేగా బ్రతికేదీ  తెలుసుకుంటే విజ్ఞతేగా .
పరుగులన్నవి

తొట్టతొలుత

తప్పటడుగులే

తప్పటడుగులు  అడుగులేగా

ప్రోత్సాహిస్తే పరుగులేగా

అడుగుముందున అడుగు వేస్తె

వడిగ వడిగా నడకలై

అది పరుగుకాదా

తప్పులుంటే సర్ది చెప్పక

అపహాస్యమన్నదదేలనో  .
ఉద్దండుల  పదవిన్యాసం ఉదహరిస్తూ

ఊదరగొట్టే కవులమనుకొనే

కుహనా ఘనులు  కొందరు

అంతర్జాలంలో తమ తప్పటడుగులు

స్మరించుకొంటూ

ఒకపరి నెమరు వేయుట

ఉత్తమం సముచితం .
పోనీ ఉద్దండులూ!

తమరు నేర్పుడి అక్షర వినియోగం,

పద సంధానం

భావాల కూర్పుల్లో

ఇమిడిన నైపుణ్యం

అన్నప్రాసన నాడే

ఆవకాయ ఆరగించు టేటులనో !

ఎంతటి వుద్దండులైననూ

వారి  సాహితీ భాండాల పైననూ

తేలక తప్పదులే

ఎదో ఒకనాడు తప్పుల తెట్టు .
(ఎవరి మనోభావాన్నిదెబ్బతీయాలనికాదు గాని ఉత్సాహాన్ని ఎగతాళి చేసి నిరుత్సాహపరచరాదు. అది విజ్ఞత  కాదు అని .)

ప్రకటనలు