ఒరే ఒరే ఒరే !
రచన : నూతక్కి రాఘవేంద్ర రావు

ఒరే ఒరే ఒరే!

ఆడలేక మద్దెలోడు

అన్నచందమొద్దురా
.
దంచలేక రోటినీ
ఆడలేక మద్దెలనూ
ఓడన్నవాని రీతి
నిత్యనామ స్మరణతో
ప్రతికక్షి పైన నెపమేలరా !

అనునిత్యం
ప్రతికక్షులన్న
అసహనం
ఆక్రోశం
నీ చేతకానితనమేరా .

నీ బలహీనత
నీ వైఫల్యం
కప్పిపుచ్చ వేషాలు
ఓట్లు దోచ వ్యూహాలు కాదా !
నిత్య దూషణలు
వెళ్ళగ్రక్కు ఉక్రోషం,విద్వేషం .
ప్రత్యక్షంగా చూస్తున్నాం .
నిత్యం నీ వాలకం
అతనిని బూచిగా చూపి
నగరప్రజల మనస్సులో
ప్రతికక్షుల
నలిపివేయు యత్నాలు కావ?

అతడేవడో చేయలేదని
వాడేదో అన్యాయం చేసాడని
అన్యాయం అయిపోయామని
ఊదరగొట్టి రెచ్చగొట్టి
వేల మంది బ్రతుకులు బుగ్గి పాలు జేసి
వేర్పడి

అధికారం అందుకున్నా  …
ఇంకా ఇంకా ఇంకా ఎంతకాలమింకా ?

వేలాదిగ  రైతులు

ఆత్మాహుతులౌతుండగ

గతపాలకులే  రాబండులంటు

అది నీ  చేతగాని తనం కాదా .

ఎందుకురా
యువతలోన
అబద్ధాల విషం
నింపుకుంటు పోతుంటా వ్ !
విద్వేషం రగిలిస్తుంటావ్.
నిన్నునమ్మి ఓటేసిన
ప్రజలకింత చేయరా
మేళ్ళుజేసి ఫలితం
కొంతైనా అందించరా.

యువతలోన బ్రతుకంటే

విశ్వాసం  నింపరా

ఒరే ఒర్ ఒరే.

ప్రకటనలు