బూతు… తెలుగు ఓ భాషాభాగం
రచన: నూతక్కి రాఘవేంద్రరావు.
…………………………………………
బూతు
మన సంస్కృతి సాంప్రదాయం

ప్రతీక
భాషలోభాగం.


జనజీవనస్రవంతిలో
బూతుపదాలు, శాపనార్ధాలు,
తిట్లు, అభిశంసనలు.
నిరంతర ప్రవాహాలు..

ప్రాంతాలు, మాండలికాలు ,
వైవిధ్యాలు ఉచ్చారణలోతీరులు
వివిధ సామాజిక వర్గాలలో
వైవిధ్యభరిత భాషా సంపద
తిట్లు,బూతులు, అశ్లీలాలు.

తరతరాలు
మేధావులు,
పండితులు
స్వేచ్చగా
నోరారా తామని
వినియోగం
అక్షరాలలో
ఆదరణకు నోచని
పదబంధం
మరుగున పడి పోతూ
గ్రామీణ పదసౌందర్యం
సంరక్షణా చర్యలేవి ?
అవసరం
అత్యవసరం
సేకరణ
సంరక్షణ
పదకోశం

మనం పూజించేదేవుడు,
మనని భయపెట్టే దేవుడు
మనను కాపాడే దేవుడు
బూతుకొరకే, బూతునుంచే,
పుట్టుకోచ్చాడని
ది సెక్స్ఎరౌండ్ ది వరల్డ్
అనేపుస్తకంలోచదివినగుర్తు.
మనగురువుగారు
ఆయనఎవరప్పా
“తాపీధర్మారావు”
దేవాలయాలమీది బూతుబొమ్మలు,
పెళ్లి దానిపుట్టుపూర్వోత్తరాలు
నిజాలుచెప్పి నిష్టురమయ్యాడు……….
“దొంగ లంజకోడుకులసలే మెసలే”
ఈదూర్తలోకం వదలి వెళ్లిపోయావా నేస్తం ”
అని తిట్లని ఆశ్రయించి మహాకవి
శ్రీశ్రీ అంతటివాడే
అక్కసువెల్లగ్రక్కాడు…నివాళి లో . ..
తనఆప్తమిత్రుడు ” కొంపెల్లజనార్ధనరావు కోసం” లో
శ్రీనాదుడూ తిట్లను నిశ్చింతగా తిట్టాడు.

తన బూతు పద్య శతకంలో
ప్రఖ్యాత జనరంజక కవి కవిచౌడప్ప
బూతును బూతుగానే ఆస్వాదించ మన్నాడు.
ఈమధ్యకాలంలోఎదుగుతున్నయువకవులూ
విసృన్ఖలంగా వినియోగించాలని
ఉత్సాహపడుతున్నారు బూతును .

ఎయిడ్స్ రోగులనూ, క్షయ రోగులనూ,
ఇతర సాంప్రదాయ నిషిద్ధ రోగాలను
రోగులను అక్కునచేర్చుకోమంటున్నవి ప్రభుత్వాలు…

బూతు, తిట్టు, అభిశంసన, శాపనార్ధాలు
కనుమరుగౌతున్న తీరులు
నేటిదనుక నిషిద్ధ భాషా పదబంధ సంపదలు

భావితరాల కొరకు
ఒక్కొక్కటీ సేకరించి
విడదీసి విశ్లేషించి
వదలక దేనినీ
సంరక్షణ అత్యవసరం.

అశ్లీల బూతులు,
శీలబూతులు,
ఆడతిట్లు,
మగతిట్లు,
వ్యవసాయం తిట్లు,
వ్యాపారం తిట్లు,
ప్రయాణం తిట్లు,
శ్రామికుని తిట్లు.
కార్మికుని తిట్లు
యాచకుల తిట్లు
యాచకులు పొందేతిట్లు
అప్పిచ్చినవాళ్ళ తిట్లు
అప్పు తీసుకొని
ఎగ్గోట్టినవాళ్ళ తిట్లు
గోడ్లకాడి బుడ్డోడితిట్లు
వీధుల్లో పేడకలెక్షన్ తిట్లు
గిలకబావి కాడ
సిగపట్లతిట్లు

బాలకులతిట్లు
బాలికల తిట్లు
భామినుల తిట్లు
తాతల .అమ్మమ్మల
నానమ్మల
ఆడబడుచుల ,మేనత్తల
అత్తల
తిట్ల పదకోశం

సృష్టింఛి
సంరక్షించడం
అత్యవసరం

సత్వరం
బూతు పద సేకరణా
సంరక్షణా చర్యలు.
ప్రభుత్వబాధ్యతలు
యుద్ధప్రాతిపదికలు

ప్రకటనలు