అనునిత్యం.. కదనరంగం
రచన: నూతక్కి రాఘవేంద్రరావు.
తేది: 27-10- 2015.

కదలు కదలు కదలరా
కదనభూమి కరుగరా
కదంవెనుక కదం వేస్తు
అడుగడుగున యుద్దమేర……. కదలు కదలు….

నిద్రలోనరాత్రులందు
మెలుకవలోఉదయయమందు
మధ్యాహన్నం,సాయంత్రం
అనునిత్యం సమర స్మరణం……కదలు కదలు….

మితిమీరిన కాలుష్యం
కర్ణచేద శబ్దభరితం
పీల్చే గాలి త్రాగే నీరు
ప్రాణాంతకమై కాలుష్యం……కదలు కదలు….

మకిలపట్టి మనిషి మనసు
విశ్రుంఖలమై క్రోధ ద్వేషాల్.
అత్యాశ స్వార్ధం ఈర్ష్యాసూయల
వికృత మానస రాద్ధాంతం …………కదలు కదలు….

మానవమేధకు అందనిరీతుల
ప్రక్రుతి నెరపే దారుణ ఘోరం
భూకంపాలు సునామీలు
తుఫానులూ కరువు కాటకం……….కదలు కదలు….

రాజకీయమది విషసర్పసదృశం
ఎన్నికలందున విసృన్ఖలతలు
కలుషితమై ప్రజాస్వామ్యము
పాలకవర్గపునికృష్ట ఘూర్జనలు………కదలు కదలు….

విశ్వ విజేతగా తానుండాలని
వినూత్న రీతుల విధ్వంసం
ప్రపంచమంతా మారణహోమం
మనుషుల్లోన వికృత రూపం ……….కదలు కదలు….

కొండలు కోనలు అడవులు
భూగర్భం సకలం దోపిడీ
తనకాళ్ళేతానరుక్కుపోతూ
అహంకారమున మానవజాతి………..కదలు కదలు..

ప్రకటనలు