ఎందుకు బిడ్డా ఈ తాపత్రయం?
రచన: నూతక్కిరాఘవేంద్రరావు.
…………………………………..

లక్షలున్నా .కోట్లున్నా ,
అంతస్తుల భవనాలున్నా ,
గమ్మత్తేంటంటే ,
ఎంతటి కోటీశ్వరుడైనా తాను
తన స్వంత కాళ్లపైననే నడవాలి…
కారు దిగినా
విమానాశ్రయం యింట్లో వున్నా
ఇంట్లోకి …పోవాలన్నా ,….
భోజన స్థలికి ,
విసర్జన స్థలి కి ,
నిద్రా స్థలికి
తన కాళ్లతోటి నడచి పోక తప్పదు గా ….
ఎందరు సేవకులున్నా….
తన నోటితోటి తోటి తానె తినాలిగా?
శరీర మలినాలను
పాపం తనకు తానె విసర్జించాలి….
అదేమిటో ప్రపంచం లో ఎవనికి వాడు
తమకుగా తాము తప్ప
మరెవరూ చేయలేనీవవి . ..
కొట్లువెచ్చించినా …
విచిత్రంగా లేదూ !
అంతే కాదు ,..
భోషాణాల్లో దాచుకున్న బంగారం
ఇటికలేన్నున్నా ఆకలి తీర్చవుగా .
తిననూ లేవుగా ,నీవేమో ముప్పూటలా
మూడు పిడికేళ్ళు తినలేవు.
లేని వాడికేమో ఓ పిడికెడూ దొరకదు .

ఎన్ని పడక గదులున్నా .
ఒక గదిలో ఓమూల నే కదా శయనం.
మూడు మూరల జాగాలోనే గా .,
చచ్చినాక కాల్చడమో బొందలో పూడ్చడమో.
కోట్లాది కొట్లున్నావైభవంగా కట్టించుకున్న
నీ ఇంట నీ శవాన్ని వుండనీరు .
ఎందుకు బిడ్డా ఈ తాపత్రయం?

ప్రకటనలు