నిర్వహణ
రచన : నూతక్కి రాఘవేంద్ర రావు.
తేది :07-11-2015.
…………………………………………

మెయింటెనెన్స్
అదేలెండి
నిర్వహణ

యంత్రానికేకాదు
మనిషికీ
కావాలి
మనిషికే కాదు
సమాజానికీ
కావాలి
.
కరేక్టివ్
ప్రివెంటివ్
బ్రేక్డౌన్
ప్లాన్డ్ ప్రోగ్రాం

ఆచరణలో
సమయానుసారం
అవసరానుగుణం
అనువైనది
ఎదో ఒకటి ఎన్నుకొని.

నిర్వహణ
తప్పని ప్రక్రియ.
కందెన వేసి
మకిలతుడిచి
మనసులన్నింటికేకాదు
సమాజాలకున్ను

అరిగిన విరిగిన
భాగాలు
త్రుప్పు పట్టి
మకిల పడితే
మార్చక తప్పదు
కందెన కూడా .
సమాజాలలో
మనుషుల
యోచనలున్నూ

వర్గాలు
మతాలు
కులాలు
తమనుతాము
అప్పుడప్పుడూ
కడుక్కొకతప్పదు
తమ మురికి తాము

ఊళ్ళు,మండలాలు,
జిల్లాలు,రాష్ట్రాలు,దేశాలు
సరిహద్దుల్లో
తలలు త్రెంచుకోవాలా
ఆప్యాయంగా
మెదళ్ళమొదళ్ళు
తడుముకుందాం
పరస్పరం
నిర్వహణలో అదీ ఓభాగం

మధ్యమధ్య
ప్రక్షాళనతప్పదు

మానవ సంబంధాలకూ
మేయింటేనేన్స్ తప్పదు

ప్రకటనలు