గొంతులో పచ్చి వెలగ  .

రచన : నూతక్కి రాఘవేంద్ర రావు .

తేది  : 10-11- 2015.

…………………………………….

ఏమో !

ఎప్పటిదప్పుడే

కావొచ్చేమో

కాని

ఎక్కడో ఎదో ఓమూల

గొంతున ఇరుక్కున్న

పచ్చి వెలగ తరకలా

ఓ చిన్న  సందిగ్ధత

మనం మనం పొందిన

ఆనందం అందమైన

బాల్యం ,

ఆ అనుభూతులు

ఆ జ్ఞాపకాల రవళులు

మనం

మన భావి తరాలకు

అందించటం లేదేమో !

ప్రకటనలు