భిన్నపార్శ్వాలు.
రచన: నూతక్కిరాఘవేంద్రరావు.
తేది: 15-11-2015
సాయంత్రం 06-00 గం.

వినేవాడికి
ఒకసారి చెబితేచాలు
కాని
వినడనితెలిసీ
చెప్పడం
శుద్ధదండుగ

గడ్డిపోచ
నిటారుగా ఉందామనే
ఎదుగుతుంది
కాని
దానిబలహీనత
వంగిపోవడం.
నైజం మైనస్

తప్పనితెలిసీ
సర్దుకుపోయి
ఒప్పని
బ్రతికేయడం.
మనిషి బలహీనత
తప్పులచిట్టాలోకి
మరో కూడిక

ప్రకటనలు