దిగ్విజయం e తెలుగు సమావేశం.

నూతక్కి రాఘవేంద్ర రావు. 

e తెలుగు సంస్థ వారు 11-12-2011 న భాగ్య నగరం లొ నిర్వహించిన రాష్ట్ర స్థాయి తెలుగు బ్లాగర్ల సమావేశాలు దిగ్విజయంయ్యాయి. 

నిర్ణీత సమయానికి సమావేశ స్థలికి చేరిన తెలుగు బ్లాగర్లను సభ నిర్వాహకులు శ్రీ కశ్యప్,శ్రీ వీవెనుడు స్వాగతించారు. 

శ్రీ కశ్యప్ ఆహూతులను సంబోధించి ,అంతర్జాలం లొ తెలుగు వినియోగానికి సదుపాయాలందించే కృషిలో గత ఎన్నో సంవత్సరాలుగా తము చేసిన కృషిని వివరిస్తూ … internet లొ తెలుగు వాడుక నాడు నేడు వైవిధ్యాన్ని వివరించారు.

ఇంటర్నెట్ కై వాడే వివిధ ఆంగ్ల సాంకేతిక పదాలకు అనుగుణ్యమైన తెలుగు పదాలను కొన్నిటిని 
తాము సిద్ధం చేసి వియోగం లోకి తెచ్చినట్లు వివరిస్తూ , వాటిలో కొన్నిటిని ఉదహరించారు. అంతర్జాలం=Internet, జాలము =net,

blog =గూడు group=గుంపు, సమూహము వంటి క్లిష్టతరమైన అనేక తెలుగు పద ప్రత్యామ్న్యాయాలను అంతర్జాలం లొ వినియోగం లోకి 

తెచ్చి ప్రభుత్వ,దృశ్య పత్రికా మాధ్యమాల ప్రసంసలు పొందిన విషయం తెలియజేసారు. 

లేఖినీ.ఆర్గ్ …లేఖిని తెలుగు కంపైలర్ సృష్టికర్త శ్రీ వీవెనుడు e-తెలుగు కరపత్రాన్ని విడుదల చేసి మాట్లాడుతూ ఇంగ్లీషు రాని తెలుగువారు 

కూడా తమ అవసరాల కొఱకు కంప్యూటర్లనూ, ఎలెక్ట్రానిక్ పరికరాలనూ మరియూ అంతర్జాలాన్ని వినియోగించుకో గలిగే స్థితికి తీసుకొని 

వచ్చి తద్వారా తెలుగు భాష మనుగడకు తమవంతు కృషి చేయడం ముఖ్య ఆశయంగా e-తెలుగు కృషి చేస్తుందని వివరించారు. 

ప్రచారం ,సాంకేతిక సహాయం,అవగాహనా సదస్సులు,స్థానికీకరణ,తెలుగు వికీ పీడి యా వంటి స్వేచ్చాయుత ప్రాజెక్టులలో పాలుపంచుకోవడం,

ఆ విషయమై ఔత్సాహికులకు తోడ్పడటం,వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలియజేసారు. ఇంటర్నెట్ లేకుండా నూ తెలుగులో టైపు 

చేయడం ,తెలుగులో చూడగలగడం వంటి విషయాలలో ఎదురయ్యే సాంకేతికపర సమస్యలకు,పరిష్కారాన్ని పొందేందుకు 

support@etelugu.org అన్న e mail చిరునామా లొ సంప్రదించ వలసినది గా కోరారు . 

ఆహూతులైన బ్లాగర్లు సభకు తమను తాము పరిచయాలు చేసుకొని తమ తమ బ్లాగుల చిరునామాలు, మరియు తాము తమ బ్లాగుల్లో 

ప్రచురించే విషయాల గురించి సంక్షిప్తీకరించిన తదుపరి తేనీటి విందు, వందన సమర్పణ కార్యక్రమాలతో సభ ముగిసింది. 

ఇరవై అయిదు మంది బ్లాగర్లు పాల్గొన్న యీ సభలో సభ్యులు అందరూ సభా ప్రారంభ సమయానికి విచ్చేసి సమయ పాలన పాటించడం ,

ఇద్దరు స్త్రీ బ్లాగర్లు విచ్చేయగా, ఒంగోలునుంచి, గుంటూరునుండి ఒక్కొక్క బ్లాగరు సభకు విచ్చేయడం తొలిమేరుపైతే , సభ చివరివరకు 

సభ్యులు ఓపికగా వుండటం కొసమెరుపు.