……………….201

సంధ్యలిద్దరు
రేయి
పవలు
రెండెంపులు.
…………………

సంధ్యలు.
సంధానం
రేయింబవళ్ళు
ఆలింగనం.
…………………..

పుడమి
పులకరింత
జీవనం
కల్లోలం.
…………………..

వృక్షం
ఆదర్శం
సర్వం
సేవకంకితం.
…………………
.
రాతిరిల్లు
విడిది
పగలు
విశ్రాంతి.
………………….

వారాంతం
ఆటవిడుపు
అలిశాయి
మనసులు.
…………………..

శీలం
అశ్లీలం
ఆపాదితాలు
భాష్యాలు.
…………………

నయనం
నిర్మాణం
సృష్టి
శాస్త్రజ్ఞుడు.
………………..

కాపాడు
నిన్ను
కాపాడు
శరీరాంగాలు.
…………………..

విమర్శ
స్వీకరించు.
సానుకూలం
అననుకూలం.
………………..210.

హృదయం
పదిలం
వెల్లుల్లి
పరమౌషధి.
………………..

వెనువెంట
సహచరులు
వెలుగు
నీడలు .
………………..

సందేహం
బీజం,
ప్రశ్న
మొలక .
…………………

ప్రగతి
బీజమాశ,
చిద్రబీజం
అత్యాశ .
………………….

ధ్యేయం
అధైర్యం
భిన్నం
ధ్రువాలు.
…………………..

సందేహాలు
బాణాలు
బాల్యం
అమ్ములపొది.
……………………

ప్రశ్న
రబ్బరుబంతి
అణచకు
వువ్వెత్తునెగురు.
…………………….

స్వేదఫలం
మెతుకులు
సేద్యకారుడు
ఎవరో!
……………………..

ఆకు
రోదిత
అమ్మ
విడిచింది.
………………..

మేఘాలు
సంఘర్షణ
వర్షం
కన్నీళ్లు
……………220

చెట్టు
స్నేహితుడు
పెంచు
ప్రాణహితం
…………………

పెంచు
చెట్లిరవై
చెలుగొక్కటి
అవసరాన.
………………..

పండు
కోసుకో
కొమ్మ
విరవకు.
………………..

క్షణం
త్రుంచడం
పెంచడం
దశాబ్దాలు.
………………

కలలు
కను
కానివ్వు
సాకారం.
…………………
జీవితం
దుఃఖం
సగభాగం
ఎందరికో .
………………….

బడుగులు
గృహస్తులు
దుఃఖం
నిత్యఅతిధి.
…………………..

కడలి
అలలు
చంద్రన్న
రసికుడు
………………….

ఆవిష్కరణలు
సకలం
కుక్షి
మూలం .
………………….

మనసు
ఘర్షణ
అంతరంగం
సంవాదాన.
………………..230

అభిమతం.
ద్రవం
ఘనీభవం
మతం .
……………….

పాపం
మొక్కులు
తప్పులు
లెక్కలు.
………………..

పునాదులు
స్వేచ్చాకాంక్ష
కూలాయి
భవనాలు.
………………….

అనుకూలత
అనుమానం
అజ్ఞాని
వీక్షణ.
………………….

వ్యతిరేకత
అనుకూలం
ప్రజ్ఞావంతుడు
శిల్పి.
………………….

ఉసిరి
నోరూరు
పళ్లు
పులుపు.
…………………

ప్రాంతీయం
మాండలికం
భాష
ఊపిరి.
………………….

ఆత్మవిశ్వాసం
ఆత్మాభిమానం
వ్యక్తిత్వం
ప్రాణం .

………………….

అందలం
అడ్డనుకుంది
ఏరివేత
రాజకీయం .
…………………

నాగళ్ళు,
కర్రులు
సాగు
సాధనాలు .
………………240.

వృక్షసంరక్షణ
పరోపకారం
కాదు
స్వయంసేవ .

………………

నిన్న
నన్నన్న
నిన్ను
నేనననా.

………………

అన్నీ
ఇన్నేనా
ఉండాలి
ఇంకెన్నో.

………………

గతం
అనుభవం
పుస్తకం
భాండారం.

……………..

భవిత
ఊహాన్వితం
అస్పష్టం
రేఖాచిత్రం.

…………….

బ్రతుకు
నీకేడర?
ఆడదాయి
లేకుంట.

……………….

పాతది
ట్రంకు
జ్ఞాపకాలు
ధూళి.

………………

జ్ఞాపకాలు
నిక్షిప్తం
మనసు
పేటిక.

……………….

స్మృతులు
చుట్టుముట్టు.
ఒంటరితనం
చులకన.

………………..

అనుభవాలు
పుటలు
జీవితం
గ్రంధం.
……………..250

ప్రవాహం
అవరోధం
ముంపు
అనివార్యం.

……………..

ప్రణాళిక
రాహితి
నగరాలు
దుస్తితి.

………………

నగరాలు
విస్తరణ
అసంబద్ధం
వ్యూహం.

……………….

జలప్రవాహం
ఆపకు
నిర్మాణాలు
కూలు.

………………

జలావర్ణం
దాహం
తీర్చవు
వరదలు.

……………….

రోడ్లు
కాలవలు
పడవలు
వాహనాలు.

………………

రోగాలు
ప్రబలం
వరదలు
వాహకాలు.

………………

జలం
కలుషితం
త్రాగునీరు
దుర్లభం.

……………..

చెన్నై
వరదలు
కునారిల్లింది
కంచిపట్టు.

……………..

వరద
బాధితులు
నిద్రాహారాలు
అందనిద్రాక్ష.
………………….260.

కరణం
మునసబు
గ్రామం
భోజ్యం.

………………….

గ్రామాధికారం
దాష్ట్నీకం
ప్రజావ్యవస్థ
సర్పంచి.

………………….

గ్రామీణం
ప్రజాస్వామ్యం
ధనం
కులం.

………………….

గ్రామాలు
బీజాలు
ప్రగతి
బీజాలు.

…………………

పల్లెలు
నిర్జీవం
ప్రాభవాలు
శిధిలాలు.

……………….

ఉపాధి
ఎండమావి
యువత
దాహార్తి.

………………..

వృద్ధులు
ఆశ్రితులు
గ్రామం
పర్ణశాల.

………………..

త్యాగులు
రైతులు
ఆత్మహత్య
అసహాయత.

………………..

పంటలు
పైరులు
పుడమి
పరవశం.

………………..

గ్రామం
సౌభాగ్యం
దేశం
సుసంపన్నం.
………………..270.

మేలుకుంది
చీకటి
నిద్రకేగింది
వెలుగు.

…………………

తెగింది
గాలిపటం
అగమ్యం
చేరునెట?

………………….

అంతరంగం
విన్యాసం
మోదం
ప్రేమోద్భవం.

…………………..

జాలుంది
జాగ్రత్త
జారడం
సహజం.

…………………..

చిలక
ఎరుగు
పండో
పచ్చో .

…………………

జీవి
శిల్పం
దేవుడు
శిల్పి .

………………..

దైవం
లీల
ఘనం
క్రీడ.

………………..

బొండం
నీళ్లు
ప్రకృతి
ప్రసాదం.

……………….

కొబ్బరి
నీళ్లు
ప్రసాదం
తీర్ధం.

………………..

ఎంతని
చెప్పను
అద్భుతం
పదేపదే
…………………280.

గతులు
తప్పవు
గ్రహాలు
నిబద్ధులు.

………………

భూచక్రం
విన్యాసం
బిగ్బ్యాంగ్
ఆవిష్కృతం.

……………….

విశ్వం
కళ్ళెదుట.
భూచక్రం
విస్ఫోటం.

………………
నిఘూడం
అనంతం
విశ్వం
విచిత్రం.

………………

అభిజాత్యం
నిర్గమం
గుభాళించు
ప్రేమ.

………………

కామెంటు
వెయ్యను
ఆత్మక్షోభ
నాకెందుకు!

……………..

కీలెరుగు
వాతెట్టు
కీలెరిగింది
కేంద్రం.

…………….

అనుభూతులు
నెమరువేత
ఆవిరి
స్నానం.

………………

పుట్టిల్లు
ఆత్మీయతలు
అంతరంగం
పేటిక.

……………..

సాహసం
ధీరత్వం
దీరోదాత్తుడు
కార్యశీలి.
……………..290.

నో
కామెంట్

లైకిట్ .

…………….

నమ్మింది
వచ్చింది
నాతి
చరామి.

…………….

తలిదండ్రులు
అనుబందం
గుండె
గూడు .

………………

విశ్వాసం
జీవితాంతం
వివాహం
భవ్యావస్త.

……………….

ఒకరినొకరు
ఎరుగరు
దాంపత్యం
తనతత్వం.

…………………

అగ్నిప్రదక్షిణ
వాగ్దానాలు
వివాహం
సప్తపది.

……………….

పరస్పరం
గౌరవం
వివాహం
బలీయం.

…………………

ఆదరించు
అభిప్రాయం
ఆదరణ
ఆస్వాదించు.

……………….

మెదళ్ళు
విభిన్నం
వైచిత్రి
వివాహం.

………………

సహనం
సర్దుబాటు
సంసారం
తొలిసూత్రం.
…………….300.