ఉర్వి
సర్వం
చైతన్యం
నిరంతరం.
…………………….

మిణుగురులు
మిలమిలలు
ఆకాశం
అర్ధరాత్రి.
…………………….

ఉల్క
అన్వేషి
అమ్మ
తప్పిపోయింది .
…………………….

గ్రహశకలం
అనాధ
ఆదరణ
కరువు.
………………………

భూమి
అమ్మ
ఉల్క
భావన .
………………………

విశ్వం
విశాలం
గగనం
భ్రాంతి
………………………

క్రమశిక్షణ
ఆలవాలం
ఖగోళం
మార్గదర్శి.
…………………….

సూర్యుడు
కోడి
భూమి
పిల్ల.
………………..

భూమి
సురక్షితం
ఓజోన్
గొడుగు.
…………………

విశ్వయాత్రి
మనిషి
నిరంతరం
యానం.
…………………..10.

నీలం
గగనం
సముద్రం
అద్దం.
………………..

మేఘాలు
శ్రామికులు
వర్షం
స్వేదం.
………………..

గర్భిణి
మేఘం
వేదన
ఉరుము.
………………..

ఆకాశం
చలనచిత్రం
మేఘాలు
యాక్టర్లు.
………………..

పరుగు
పోటీలు
శ్వేతమేఘాలు
హడావుడీ.
…………………..

మేఘం
భోరుమంది
వర్షం
కన్నీరు.
………………….

గగనం
వర్ణచిత్రం
రంగులద్దాడు
సూరీడు.

ఆపాదించు
రూపాలు
ఆకాశం
జంతుశాల.
………………….

జలజీవం
గమనించు
గగనం
అక్వేరియం.
………………….

వర్ణం
వివర్ణం
క్షణికం
అంబరం.
……………….20.

సంధ్యలు
ఇరువురు
చీరలు
సేంటుసేం.
…………………..

సాయంసంధ్య
స్వాగతం
వేకువ
వీడ్కోలు.
………………….

కిలకిలలు
ఉత్సాహం
కలకలం
నీరసం.
………………..

తరువులు
పక్షులు
అవినాభావం
యుగాలు.
……………….

విధానం
సూత్రబద్ధం
రేయి
విశ్రాంతి.
……………..

ఉదయం
విసర్జించు
నిస్తేజం
మలినం.
……………….

ఉషోదయం
ఉత్తేజం
చైతన్యం
వెలుగు.
……………….

దినకరుడు
శక్తిదాత
వెలుగు
ఆహారం.
………………

సూర్యుడు
గూఢచారి
పగలు
నిఘా.
……………..

దివం
రాత్రం
ధరిత్రి
సూత్రధారి.

……………..30.

పుడమి
వెతలు
మనిషి
మూర్ఖుడు.
…………….

వైభోగం
అనుభవం
అగ్రరాజ్యాలు
పెద్దన్నలు.
…………….

భూగర్భం
ఛిద్రం
అగ్రరాజ్యం
అత్యాశ.
……………

పర్యావరణం
పరిరక్షణ
అభివృద్ధి
ఆటంకం.
……………..

అంతర్దాత్రి
అందరిది
దోపిడీదారులు
కొందరు.
……………..

ప్రకృతి
దైవం
పూజిద్దాం
దీవించు.
…………….

అగ్రరాజ్యాలు
సుఖజీవనం
ఉద్గారం
భూతాపం.
…………….

ప్రకృతి
సంపద
హక్కుదారులు
సర్వులు.
………………

సౌకర్యం
కాలుష్యం
బ్రతుకు
సహజం.
……………….

సూదులు
బోర్లు
ధరిత్రి
రోదిత
………………40.

పేదరికం
తొలగింపు
ఆచరణ
పేదలు .
…………………

అకృత్యాలు
నియంత్రించు
ఆచరణ
ఆదర్శం .
…………………..

అరుపు
వేసట
సందేశం
సత్ఫలితం .
……………….

ఆచరణ
అసంఘిటితం
సాధన
అసఫలం .
………………..

మెతుకు
మెదడు
కుక్షి
అక్షరం .
……………..

త్రుంచబడింది
మొగ్గ
గర్భకుహరం
పూలమొక్క .
………………

మొగ్గ
స్త్రీశిశువు
చిదిమింది
రాక్షసత్వం .
………………..

సంకల్పం
పట్టుదల
సాధన
పునాది .
……………..

ఈనాడు
మూఢత
ఆనాడు
భధ్రత.
………………

ఆహారం
సేకరణ
చీమలు
సుశిక్షితులు.
………………..50.

మాట
మాండలికం
భాష
సజీవం.

యాసలు
పరస్పరం
సుహృద్భావం
విస్తారం.

ఆచారం
ప్రాంతీయం
గౌరవించు
సన్నిహితం.

సమైక్యత
విస్చిన్నం
పరస్పరం
హేళనలు.

మాండలికం
సౌందర్యం
భవ్యం
ఆస్వాదించు.

ఉచ్చారణ
వైవిధ్యం
ప్రాంతీయం
ప్రత్యేకత.

భావం
అదే
వ్యక్తీకరణ
వ్యత్యాసం.

ఆత్మాభిమానం
కాలనాగు
కించపరచకు
కాటువేయు.

పదం
వైవిధ్యం
మాండలికం
తీరులు.

రిధం
ప్రత్యేకం
మాండలికం
సజీవం.
………………….60

వర్తమానం
నీడ
చిగురించదు
భవిత

నిరంతరం
గానం
గుండె
గాయని

భూతం
అనుభవం
భావి
సంశయం

తత్క్షణం
వర్తమానం.
గతం
భూతం

వర్తమానం
వాస్తవం
క్షణం
యోచించా

జీవి
జీవితం
తృటి
విశ్లేషించా

బ్రతుకు
అసహనం
నిత్యం
రాద్ధాంతం
.

సాంప్రదాయం
అనుబంధం
చావు
రేవు .

సమాజం
సంప్రదాయం
అనూచానం
ఆచారం.

పశ్చిమం
సిగ్గిలింది
సూరయ్య
కౌగిలి
……………………..70.

దీపం
రాజ్యాంగం
మలిపింది.
రాజకీయం.

కలలు
సాకారం
కను
సాధించు.

సామరస్యం
సహభావం
ప్రగతి
మూలధనం.

సహనం
సంయమనం
శాంతి
స్వభావం.

ఆశలు
పల్లకి
ఊరేగింపు
ఎన్నికలు.

వాగ్దానాలు
కోకొల్లలు
ఆచరణ
లేశం.

ప్రజాప్రభుత
ప్రతినిధులు
దోపిడీలు
చట్టబద్ధం.

చట్టం
పారదర్సకం
పాలకులు
పప్పులుడకవు.

గోప్యం
చట్టం
విస్రుంఖలం
అవినీతి.

అవినీతి
పగ్గాల్లేవు
ప్రభుత్వం
నిర్వీర్యం
………………….80.

ఈర్ష్య
ద్వేషం
విరుగుడు
ప్రేమ.

అసూయ
అగ్నికణం
దహించు
విసర్జించు.

ముదం
ఆనందం
వ్యక్తిగతం
ఆస్వాదన.

మోదం
సంతసం
హృదయం
గానం.

ఆమోదం
అంగీకారం
సిగ్నల్
ఆకుపచ్చ.

మదం
బలుపు
అహంకారం
ఆరంభం .

కోపం
చురకత్తి
బద్రం
వినియోగం.

అసహనం
భావస్రావం
పర్యవసానం
విస్ఫోటం.

సహనం
భావస్థైర్యం
వ్యక్తిత్వం
మెరుపు.

ఓర్పు
సహనం
సంయమనం
నియంత్రణలు.
……………………90

పూలు
తెంచకు
పూపొద
వికారి.

పుష్పాలు
శోభలు
వనాలు
వైభవాలు.

తుమ్మెదలు
ఝుంకారం
విరులు
తన్మయం.

పుష్పాలు
వైవిధ్యం
వర్ణాలు
సౌరభాలు.

విరులు
రాజిల్లు
కురులు
శోభాన్వితం.

ప్రాణవాయు
జీవహితం
వనాలు
ఉత్పాదకులు.

కాలుష్యం
విషశస్త్రం
తరులు
రక్షాకవచం

కిరణజన్యం
పత్రహరితం
ప్రాణవాయు
ప్రాణహిత.

పచ్చదనం
జనహితం
పర్యావరణం
పరిశుభ్రం.

చెట్లు
సంరక్షించు
పెంచు
పోషించు..
……………………100