……….901
 ఆల్జీబ్రా
అడ్డగోలు
ఒకపట్టం
అర్ధమవదు
……………….
ఎక్సులు
వైలు
హోల్స్క్వేర్లు
దిమాక్ఖరాబ్.
……………….
థీరంస్
సాల్వేషన్
గుండె
గాభరా
…………….
అర్ధమేటిక్స్
అయోమయం
నిద్దుర
కలవరింత
……………..
జామెట్రీ
బ్రెయిన్జాం
ఒంటబట్టదు
ఒదిలెయ్.
………………
అఆలోకే
లెక్కలు
ఎక్కాలు
భల్చిక్కు
………………
సిగ్గుచేటు
చెప్పుకోను
ఎందుకయ్యా
తిప్పలు
………………
జీవితం
ఆల్జీబ్రా
సాల్వేషన్
సమఝ్గాదు.
……………….
జీవితం
గణితం
కూడికలు
తీసివేతలు
………………
భాగాహారం
లవం
హారం
శేషమ్మురిపెం.
………………..910
అశోకుడు
చెట్లు
నాటించును.
ఎల్లప్పుడు.
………………
గాంధి
కూతురు
ఇందిర
యువభావన.
………………..
బుద్ధుడు
బోధిచెట్టు
నిత్యం
కళ్ళముందు
………………..
తాజ్మహల్
నిర్మాణం
బొటనవేళ్ళు
తీసివేత
…………………
సత్రాలు
చెరువులు
కాకతీయం
ప్రజాహితం
…………………
నిర్మాణం
సాంకేతికం
సౌరభాలు
శిధిలాలు
………………….
అధునాతనం
సౌకర్యాలు
లౌక్యులు
ఆంగ్లేయులు
…………………
పాలన
సౌలభ్యం
ఆంగ్లం
అద్దకం
………………
విభజించు
పాలించు
ఆంగ్లేయం
విచ్చిన్నత
………………
అంగాంగం
బానిసత్వం
పరపాలన
దుర్గంధం
………….920.
స్వయం
పాలన
ఆధిపత్యం
నికృష్టం
…………..
పసుపు
సున్నం
కలుపు
పారాణి.
…………….
తమలపాకు
వక్క
సున్నం
నోరెరుపు.
………………
సైకిలు
లైటు
చక్రం
తిప్పు.
……………….
డైనమిక్
స్టాటిక్
విద్యుత్తు
విభాజితం
……………….
స్టాటిక్
తాత్కాలికం
మెరుపులు
పిడుగులు.
……………..
డైనమిక్
ప్రసారితం
నేడు
వినియోగం
………………
కరెంటు
ద్వివిధం
డైరెక్ట్
ఆల్టర్నేట్.
………………..
బ్యాటరీ
సోలార్
కరెంట్
డైరెక్ట్
……………..
జెనరేటర్
డిసి
ఆల్టర్నేటర్
ఏసీ
…………..930
నిత్యం
వినియోగం
ఏసీ
విద్యుత్.
………….
ఆంగ్లం
నాక్కష్టం
ముళ్ళకంప
ఇంగ్లీష్.
…………..
అమ్మనాన్న
పిలుపులేవి
మామ్డాడ్
సంబడం.
…………….
మాద్యమం
ఆంగ్లం
మాత్రుభాష
నిర్లక్ష్యం.
……………..
ప్రభుత్వం
ప్రోత్సాహం
ఆంగ్లం
ఆటవిడుపు.
………………..
అమ్మభాష
చదువు
ప్రపంచజ్ఞానం
మెరుగు.
……………..
మాతృభాష
అభివృద్ధి
పాలకులు
సవతిబుద్ది.
………………
పక్షపాతి
ప్రభుత్వం
చంకెక్కింది.
ఆంగ్లము.
…………….
తెలుగు
మాట్లాడకు
బెంచెక్కు
పనిష్మెంట్.
……………….
ప్రభుత్వం
నోరెత్తదు
కార్పొరేట్లు
భోషాణాలు.
……………940.

మాతృభాష
ఎదగదు
ప్రభుత్వం
నిర్లక్ష్యం.
………….
అక్షరశక్తి
అద్భుతం
తెలుగు
తేనెకలశం.
……………..
దేశమందు
భాషలెన్నో
అమృతం
తెలుగు.
…………….
తెలుగు
కావ్యాలు
మహత్తరం
సాహిత్యం.
…………….
తెలుగు
కవులు
ప్రాశస్త్యం
ప్రపంచవ్యాప్తం.
………………..
తెలుగుభాష
తేనెలొలుకు
క్రిష్ణదేవరాయలు
పోషకుడు.
………………..
పశ్చిమం
ఇటాలియన్
తూరుపు
తెలుగు.
………………….
పెద్దన
నన్నయ
పాండిత్యం
ప్రసిద్ధం.
…………………
తిక్కన
ఎఱ్ఱన
కావ్యాలు
కమనీయం.
………………..
ఆదికవులు
అఖండులు
ఆధునికం
ఘనులేందరో.
…………….950
త్యాగరాజు
గానలహరి
రామదాసు
భక్తితత్త్వం.
………….
అక్షరాలు
అఆలు
లిపి
దేవనాగరి.
……………..
దేశం
ఎంచుకుంది
దేశభాష
హిందీ.
………………..
సంఖ్య
అత్యధికం
వినియోగం
హిందీ.
…………………
సాహిత్యం
సరళం
సరళి
భవ్యం
……………….
కావ్యాలు
అగణ్యం
హిందీ
ప్రశంసనీయం
………………
కవులు
దేశవ్యాప్తం
హిందీ
సాహిత్యం
………………….
సినిమాలు
హిందీ
ప్రపంచవ్యాప్తం
ప్రాశస్త్యం.
…………………
హిందీ
నటులు
అసంఖ్యాకం
అభిమానులు,
………………..
ప్రజలు
పెక్కురు
హిందీ
విస్తృతి
…………….960.
తేనెటీగ
నిత్యశ్రామిక
భావితరం
బాగుండాలి.
………………
చదగూడు
తేనెపట్టు
ఆర్కిటెక్చర్
అద్భుతాలు.
……………….
సృజనలు
మేధోజనితం
ప్రేరణ
కుక్షి.
……………….
పక్షిగూడు
పాము
సంధానకర్త
కుక్షి.
……………….
కాల్చేతులు
కోఆపరేషన్
ఆకలి
ఉపశమనం.
………………..
కన్ను
కాలు
కోఆర్డినేషన్
పురోగమనం.
……………….
నేడు
ఆచరించు
రేపు
ఊహాతీతం.
………………….
వేసవి
సహచరి
తాటిబుర్ర
భుజకీర్తి,
…………………
కుక్షి
పిడికెడు
ఆశ
అనంతం .
………………….
నియంత్రణ
భాద్యత
మెదడు
కన్సోల్.
……………970.
కాయం
సజీవం
గుండె
మాంత్రికుడు.
……………….
సంతానం
నిర్లక్ష్యం
వివాహేతరం
సంబంధం.
…………………
మామిడి
కాయ
కన్నీరు
సొన.
………………….
పవర్
కోతలు
పరిశ్రమలు
మూత.
………………….
కార్మికులు
అవస్తలు
విద్యుత్
రాహితి.
………………….
శంఖుస్తాపన
ఆర్భాటం
పునాదిరాయి
త్యాగశీలి.
…………………….
ఇటుక
సిమెంటు
మనిషి
మమత,
……………….
ఆభిజాత్యం
ఊసరవెల్లి
అహంకారం
వర్ణబేధం.
……………..
పరిహాసం
ప్రమోదం
అవహేళన
ప్రమాదం.
……………..
కొమ్మలు
వీవెనలు
తెమ్మెర
హాయి .
……………..980
జ్ఞాపకాలు
కళ్ళెదుట
కెమెరా
అద్భుతం.
………………..
కురవాలంది
చల్లగాలి
అగమంది
వేడిగాలి.
…………………
ఎలినినో
చిలిపిదనం
బిక్కచచ్చింది
రుతుపవనం.
…………………
కీటకాలు
కోటానుకోట్లు
ప్రభవం
విభవం.
………………..
సృష్టి
వ్యూహకర్త
పుట్టుక
చావు.
…………………
క్రిమికీటకాలు
సహచరులు
మనుషులెంట
కొట్లాదులు
………………….
పుట్టడు
ఎవ్వడూ…
పుట్టాలని
అప్రమేయం
……………….
సృష్టి
విరచితం
జీవం
మహత్తరం.
………………..
పుట్టడు
చావాలని
పుట్టుక
సృష్టిసేత
…………………..
మేఘం
కురవదు
ప్రేరణ
పచ్చదనం
…………..990.
చర్చ
విశ్లేషణ
వాదన
విమర్శ.
……………
ఆలంబన
ప్రోత్సాహం
శిఖరాగ్రం
కీర్తికిరీటం.
……………
పేదరికం
అడ్డుగాదు
ప్రోత్సాహం
ఆలంబన..
……………..
ఎవరెస్ట్
అధిరోహణం
జాతి
సగౌరవం.
………………..
ఎదురు
చూపు
ఎంత
వేదన !
………………….
సహనం
పరీక్ష
నిరీక్షణ
గీటురాయి.
………………….
రాజకీయం
ఆహారం
మీడియా
పాకనిపుణ.
………………
మీడియా
సృష్టికర్త
పిల్లగాలి
ప్రభంజనం.
…………………..
గాలికబురు
అగ్నిజ్వాల
రగిలించు
మీడియా.
……………….
పిచ్చికుక్క
భౌభౌలు
అదిగో
తోక.
…………….1000