………….301

మనసు
బీజం
శరీరం
క్షేత్రం.

…………..

ఆరోగ్యం
అంతంత
పట్టుదల
పర్వతం.

…………..

సంకల్పం
పటిష్టం
వ్యూహం
బలీయం.

…………..

అక్షరం
మైనం
మలుచు
నీకనువు.

……………

భావం
గుప్తం
భవ్యం
కవనం.

……………

చిక్కదనం
నిక్కచ్చిదనం
భావోపేతం
కవిత్వం.

…………..

రక్తం
ఎరుపు
జీవం
కలర్లెస్.

…………..

భావాలు
రంగుండదు
అక్షరాలు
వర్ణభరితం.

……………

కవి
యోచన
విలక్షణం
నిర్దిష్టం.

…………..

భావాలు
శిలలు
కవి
శిల్పి.
………………….310.

కన్ను
కేమేరా
దృశ్యం
నిక్షిప్తం.

………….

నయనం
నిర్మాణం
శాస్త్రం
నిక్షిప్తం.

………….

వీక్షణం
దృక్కోణం
భావాలు
నిక్షిప్తం.

…………..

చూపులు
కలయికలు
సందేశం
నిక్షిప్తం.

……………

తీక్షణత
చూపులు
కావేశం
నిక్షిప్తం.

……………

ప్రియురాలు
నయనాలు
అనురాగం
నిక్షిప్తం.

…………….

అమ్మ
వీక్షణలు
ఆశీస్సులు
నిక్షిప్తం.

………………

సోదరి
చూపులు
ఆత్మీయత
నిక్షిప్తం.

……………..

తండ్రి
చూపులు
భద్రత
నిక్షిప్తం.

………………

మిత్రుడు
చూపులు
హితతత్త్వం
నిక్షిప్తం.
……………..320.

వినిపించింది
విన్నది
వ్యత్యాసం
మాట.
శబ్దాలంకారం
వ్యక్తీకరణ.
లోకవ్యాప్తం
మాట.

ఆత్మీయత
పెంచు
ప్రేరణ
మాట.

బాంధవ్యం
త్రుంచు
కటువు
మాట.

ప్రేమ
బంధనం
హృదయతంత్రి
మాట.

రగిలింది
ద్వేషం
అవాచ్యం
మాట.

యుద్ధం
రగిలించు
నికృష్టం
మాట.

ప్రతీకారం
చెరుగు
వెటకారం
మాట.

పౌరషం
పెంచు
చీత్కారం
మాట.

ప్రగతి
కారకం
పట్టుదల
మాట.
…………..330.

 నవ్వు
హేతువు
ఆరోగ్యం
ద్విగుణం.నవ్వు
వైద్యం
రోగం
నిదానం.

నవ్వు
యోగం
ఆరోగ్యం
సౌభాగ్యం.

నవ్వు
నవ్వించు
వైద్యశాల
నిద్రించు.

హాసం
ఆనందం
పరిసరాలు
పరవశం.

స్నేహితం
శత్రుత్వం
ప్రేరకం
పరిహాసం.

దరహాసం
స్నేహశీలి
శత్రుత్వం
తిరోగమనం.

నగుమోము
రాయబారి
పరిష్కృతం
వైరుధ్యం.

కోపం
వికృతం
దరహాసం
అలంకారం.

చీత్కారం
శత్రుత్వం
హాసం
స్నేహశీలి.
……………..340.

కల్తీమద్యం
మృత్యువు
దారుణం
నిర్లక్ష్యం.విషం
త్రాగకు
మద్యపానం
ప్రాణాంతకం.

మద్యం
ఆదాయం
ప్రభుత్వం
మద్యవ్యాపారి.

ప్రజలు
జీవితాలు
ప్రభుత్వాలు
చెలగాటం.

బలహీనత
మాపరు
మప్పుతారు
బలవంతం.

జీవితాలు
బలి
మద్యం
మహమ్మారి.

వ్యక్తి
బానిస
మద్యం
నియంత.

వ్యాపారం
విచ్చలవిడి
నియంత్రణ
త్రాగుబోతు.

కుటుంబాలు
విచ్చిన్నం
విచక్షణ
చక్షువు.

కాపాడరు
వేరెవరు
జీవితాలు
తమవి.

………….350.
అలలు
ఆకాంక్షలు
సముద్రుడు
ఔత్సాహికుడు..
………………సముద్రం
ఆతిధ్యం
పాదాలు
ప్రక్షాళనలు.
,,,,,,,,,,,,,,,,

భూగర్భం
ఉగ్రం
సునామీ
ముఖకవళిక.
………………

రమణీయం
వర్ణం
సముద్రం
భవ్యచిత్రం.
……………..

సంద్రం
రత్నగర్భ
భాగ్యమంతం
ధరిత్రి.
……………..

సప్తసంద్రాలు
సంపర్కం
భూఖండాలు
కరచాలనం.
……………..

తుఫానులు
తుమ్ములు
సముద్రం
జలుబు.
……………..

సునామీలు
త్రుల్లింతలు
భూపయనం
ఒడిదుడుకులు.
…………………

అంచులు
అలజడి
సముద్రగర్భం
ప్రశాంతం.
………………

చేరనీదు
సాగరం
ఒడ్డుజేర్చు
భద్రం..
…………………..360.

వంటిల్లు
పడతిల్లు
పురుషుడు
రాజముద్ర.
…………..పొయ్యి
పోప్పెట్టె
వంటిల్లు
ప్రాధమ్యం.
……………

కవ్వం
ప్రతిష్ట
మిక్స్తీ
కాలరాత.
……………

రోలు
రోటిపచ్చడి
గ్రైండరు
సమవుజ్జీ.
…………….

కట్టెలు
పచ్చివి
పొగ
తంటాలు.
……………

గ్యాస్స్టవ్
సౌకర్యం
ఇంటింట
సుకుమారం.
……………..

కత్తిపీట
తరిగింది
వందమంది
బంతి.
……………

గరిటాట
ఇల్లాలు
లేస్తాయి
వందిస్తళ్ళు.
…………….

రోళ్ళు
రోకళ్ళు
శరీరం
వ్యాయామం.
……………….

వూదుగొట్టం
ఊపురితిత్తులు
యోగా
ఎక్సర్సైజ్.
………………370.

వడ్లు
విత్తులు
నారు
నాట్లు.
……………..
గుంటక
దమ్ము
వరిపైరు.
మాగాణి.
………………అంతర్పంట
పెసళ్ళు
వరికోత
తొక్కిడి .
………………

కోతలు
కుప్పలు
కల్లాం
సంసిద్ధం.
……………..

పిల్లలు
పరమానందం
పరిగ
పాలబెల్లం
……………….

నూర్పిడి
తూర్పార
తాలు
పోక.
………………

పంట
బళ్లయాయి
బస్తాలు
బండేక్కాయి
………………..

ట్రాక్టర్లు
యంత్రాలు
ఎడ్లు
జంతుప్రదర్సన.
………………….

గడ్డి
తరలింపు
ఊళ్ళు
వాముల్లేవు
…………………….

ప్యాకేజ్
పరిశ్రమ
మూడుపూలు
కాయలారు.
………………….380.

కరేపాకు
కేటలిస్ట్
కూరనందు
మధుద్వంసి
……………….
వెల్లుల్లి
వైద్యం
గుండె
ఖుష్
………………
పోప్పెట్టె
డాక్టర్కిట్
వంటింట
వైద్యం
……………….
అజీర్తి
యాతన
వాము
పరమౌషధం
……………….
ఆవాలు
మెంతులు
ఆరోగ్యం
అనుపానం
………………పసుపు
వాడు
రోగక్రిములు
ఆవలెట్టు.
……………….
ఎండుమిర్చి
తాలింపు
కూరనందు
సౌరభం.
……………….

ఇంగువ
వినియోగం
సీతలం
సుదూరం
………………..

ఉప్పు
కారం
రుచులు
నోటూటలు.
………………….
చింతపండు
పరమావధి
విసర్జనం
సక్రమం
……………..390.

బ్రతికున్నావా
బ్రతికున్నా
రుజువేంటి?
పెన్షనాఫీస్
……………..కాగితమ్ముక్క
విలువైనది
మనిషెందుకు?
చావాలి.
……………..

ఎవడికాడు
సర్టిఫై
బ్రతికున్నా!
చెల్లుబాటు.
……………..

నికృష్టం
చట్టాలు
ఆధునికత
పొందబోవు
………………

కఠినతరం
అర్ధంగావు
చట్టాలు
కొబ్బరికాయలు.
…………………

బ్రోకర్లు
బ్రతుకు
చట్టాలర్ధం
అనర్ధం
………………..

చట్టాలు
అందనీర
సామాన్యుడు
బ్రతకనీర.
…………………

చట్టం
అధికారం
చుట్టం
కారాదుర.
………………..

డాక్యుమెంటు
రైటర్లు
ఆర్కిటెక్ట్లు
కలెక్టర్లు.
……………….

సరళతరం
నిర్దిష్టం
కావాలిర
చట్టాలు.
…………….400.