…………..501
నీలాకాశం
కాన్వాసు
చిత్రాలు
విచిత్రాలు.
………………
సప్తవర్ణం
సమ్మిళితం
కిరణం
శ్వేతం.
……………….
కిరణాలు
వర్ణాలు
మేఘాలు
మాద్యమాలు
……………….
సంకీర్ణం
శ్వేతం
వికీర్ణం
రంగులేడు.
………………
కారుమేఘం
కాలుష్యం
పరిశ్రమలు
విసర్జితం
…………………
మేఘాలు
ప్రయాణాలు
డిప్రెషన్
నిర్దేశం
………………..
భూతాపం
మూలకం
డిప్రెషన్
ఆవిష్కృతం.
………………
నిత్యం
చైతన్యం
ఆకాశం
క్రీడావని
……………..
పచ్చదనం
భూవదనం
గడ్డిపూలు
ఆభరణాలు
………………..
ఎండుటాకులు
చెంతజేరు
గలగలలు
ఊసులు
………….510.
ఆకాశం
సంద్రం
పిల్లమేఘం
యీతలు.
………………….
నీలిగగనం
పిల్లమేఘం
తల్లి
తప్పిపోయింది.
………………….
ఆకులు
రాలుగాలం
పక్షులు
అయోమయం.
……………………
సేవకుడు
నిబద్ధుడు
సేవ
వూపురి.
…………………..
తెలియంది
ఎరుగు
తెలిసింది
తెలుపు .
……………….
అంతరంగం
ఆలోచన
వ్యక్తిత్వం
పునాదులు.
………………
సంస్కారం
ఇమిడింది
పరిధి
విశాలం.
………………..
అంగలు
పరిమితం
పరుగులు
నిషిద్ధం.
…………………
పిక్కబలం
పట్టుదల
గెలుపోటమి
మనోగతం.
…………………
ఆత్మీయత
ఆప్యాయత
అంతరంగం
వ్యక్తిగతం
……………520.

పాదరసం
అనుభూతి
తామరాకు
నీటిబొట్టు
……………….
చెరువు
ఫక్కుమంది
మేఘం
తొలిగింది.
……………….
పూర్వార్ధం
పస్చిమార్ధం
అంతర్జాలం
వారధి.
……………..
చంద్రుడు
గిజగిజ
తటాకం
గాలికలుసు.
………………
పుడమి
పులకరం
జీవం
కలవరం.
……………….
పుష్పం
మకరందం
ప్రక్రుతి
వైచిత్రి.
…………………
జ్ఞాపకాలు
దొంతరలు
బాల్యం
పునాది .
…………………..
కూనిరాగం
అలారం
బాత్రూమ్డోర్
బోల్టుల్లేవు .
………………….
రాతలు
తక్కువ
రాగాలెక్కువ
నేనె.
……………………
భౌతికం
శాస్త్రం
నయనం
నిర్మాణం.
………………..530
వెలుగు
నీడ
వైవిధ్యాలు
సహచరులు .
…………………ఎత్తు
పల్లం
తోడ్పాటు
పరస్పరం.
…………………
ధ్యేయం
ఆశ
అధైర్యం
నిర్వేదం .
………………..

అప్పులపొది
బాల్యం
ప్రశ్నలు
బాణాలు .
…………………
ప్రశ్న
ప్రగతి
అవరోదం
సమాజం .
……………….

సమాజం
మూర్ఖత్వం
ప్రశ్న
అణచివేత.
…………………
చీమ
శ్రమజీవి
ఆహారం
బరువమితం .
……………….
మెతుకు
అమ్మెవరు
సందేహం
తొలుస్తోంది
……………….
పసిరిక
ఆభరణం
ఆకు
రాలింది .
………………
ధ్వంసం
క్షణం
వ్రుక్షపోషణ
దశాబ్దాలు
……………540.
దుఃఖం
జీవితం
సంతోషం
చిరుకాంతి
……………….
ఆశ
వెలుగు
జీవితం
పయనం
……………….
మడుగు
రాయిసురు
తరంగాలు
దైర్ఘ్యాలు
…………………..
అలలు
మెరుపులు
రేరాజు
క్రీడలు
………………….
ఆవిష్కరణలు
సకలం
మూలం
ఆకలి.
…………………
జీవితం
నాటకం
పాత్రలు
అసంఖ్యాకం.
……………….
పుట్టినూరు
జ్ఞాపకాలు
అంతరంగం
కంప్యూటర్.
………………..
పచ్చదనం
సూర్యకాంతి
ఆకులు
సుందరులు
……………….
బింబం
ప్రతిబింబం
సముద్రం
అద్దం
…………………
అక్షరం
దద్దరిల్లింది
గాయకుడు
గద్దర్
…………….550.
ప్రశ్న
ఆయుధం
ప్రభుత్వం
నిషేధం.
………………
ఓటు
విచక్షణ
వినియోగం
విజ్ఞత .
……………..
రక్షకులు
బక్షకులు
ప్రజాప్రభుత
నియంత
……………….
నిర్ద్వందం
ప్రజాతీర్పు
నికృష్టులు
వెలివేత
………………..
ప్రజలు
తీర్పరులు
నియంతృత్వం
ఖననం.
…………………
పాలించు
ప్రజాహితం
పట్టం
మరోపరి
………………..
పన్నులు
అమితం
ఓటు
గొడ్డలి
………………..
రెచ్చగొట్టు
సెంటిమెంటు
సామరస్యం
చట్టుబండ
……………….
రణరంగం
జనజీవనం
ఆక్రోశం
హద్దెరుగదు
………………
రాజకీయం
స్వార్ధహితం
సెంటిమెంటు
అగ్గిరవ్వ ..
……………..560.
సహనం
శ్వేతకపోతం
సామరస్యత
శాంతిదూత.
……………..
అటకెక్కెను
సమన్యాయం
గన్పాయింట్
తీర్పులు
……………..
నిరాధారం
తరిమివేత .
నికృష్టం
చీల్చివేత
………………..
అభివృద్ధి
కేంద్రీకృతం
ఉమ్మడిగని
రాజధాని .
………………
దేశం
విచ్చిన్నత
కేంద్రం
కుటిలతంత్రం
………………
కుహకం
గాంధారం
ప్రతినిదులు
బానిసలు
……………….
పక్షపాతం
పక్షవాతం
పంపకాలు
ఏకపక్షం
……………..
మృష్టాన్నం
రోదితార్ధం
పూర్ణకుంభం
ఉమ్మడాస్తి
………………..
రచ్చబండ
తీర్మానం
చీకటిల్లు
బందిఖాన.
……………….
పెద్దరికం
పెండకుప్ప
దుర్గంధం
తీర్మానం .
……………570.
మతం
అభిమతం
మనసు
యుద్ధరంగం
……………..
వ్రుత్తి
ఆర్ధికం
మతం
హార్దికం.
………………..
వ్రుత్తి
వుపాధి
రూపాంతరం
కులం
………………..
కాలాంతరం
కులం
సమాజం
పీలికలు.
……………….
మతద్వేషం
రాక్షసత్వం
అసహనం
ఉగ్రవాదం
…………………
మతం
మూలసూత్రం
మానవత్వం
అమృతత్వం..
………………..
మానవాళి
మనుగడ
మతాలు
ఐక్యతత్వం.
………………..
హింస
విధ్వంసం
మతం
ఉన్మాదం
………………..
మానవాళి
ఉనికి
సహనం
పరమావధి.
……………….
కులమతాలు
అడ్డుగోడలు
మానవత్వం
బోన్సాయి.
…………….580.
సహనం
సంయమనం
సమన్వయం
సమాజం.
…………………
ఉద్రేకం
ఉద్వేగం
ద్వేషం
ఉత్పన్నం.
………………….
ఆవేశం
కావేశం
విచక్షణ
నిర్వీర్యం.
………………
మంచి
చెడు
వివేకం
దుర్భిణి.
……………….
అత్యాచారం
అరాచకం
పర్వతాలు
కళ్ళెదుట.
………………..
సమాజం
వెర్రితలలు
మద్యపానం
మాదకద్రవ్యం.
………………..
అలసత్వం
నిర్లిప్తత
సమాజం
వెనుకబాటు.
………………..
విద్వేషం
పటిష్టం
ఈర్ష్యాసూయలు
పునాదులు.
…………………
ఆత్మీయత
అనురాగం
బంధుత్వం
భవ్యతరం.
…………………
ప్రేమ
ఆప్యాయత
ఆహ్లాదం
జీవనం.
………….590.
 నేల
నెర్రెలు
భూమి
దాహార్తి
……………..
బీడు
దుక్కి
అధునాతనం
జేసిబి.
………………
ఎడ్లు
బళ్ళు
నాగళ్ళు
గతవైభవాలు
………………..
మోటర్లు
విస్తారం
మోట
గతజ్ఞాపకం
………………….
నాగటికర్రు
గొర్రు
మ్యూజియం
ప్రదర్శితాలు
………………..
విద్యుత్లేన్
అవసరముండదు
సోలార్కిట్లు
వరాలు.
…………………
అధునాతనం
వ్యవసాయం
అభ్యున్నతి
జాతిప్రగతి.
………………
ప్రకృతి
క్రోధం
రైతు
శాపగ్రస్తుడు.
………………
భూగర్భం
నిర్వేదం
నీళ్ళు
అడుగంటాయి.
………………..
పల్లెలు
జాతిహితం
రైతు
అన్నదాత.
…………….600.