…………..701

అనుకూలత
అనుమానం
అజ్ఞాని
వీక్షణ .
…………….
ప్రతికూలత
అనుకూలం
విజ్ఞాని
దృక్కోణం
………………
ఆకాశం
వీధి
స్వేతాంబరాలు
మేఘకన్నెలు .
………………….
తెరలు
తెరువు
గాలి
విస్తృతం
……………..
దోచుకుంది
రాజకీయం
రుణగ్రస్తులు
ప్రజలు .
……………….
పరిమాణామం
అణుమాత్రం
వినియోగం
అభ్యుదయం .
………………….
వృద్ధాప్యం
అనుభవం
జీవితం
విశ్లేషణ .
………………..
సంకల్పం
చిత్తసుద్ధి
సాధన
పరికరాలు.
………………
చట్టాలు
పురాణాలు
వాస్తవాలు
అందనీరు.
……………………
మనఃసరస్సు
కవితలు
మత్స్యాలు
జలకాలాట .
………………710.

అమాయకులు
సోపానాలు
అవకాశవాదులు
అందలాలు.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
ప్రేమ
చంపదు
చంపు
చావదు .
………………..
ఇద్దరు
మేధావులు
వేదిక
ఒర.
…………………
నీతి
వ్యక్తిగతం
“అవి”
ప్రిఫిక్స్.
…………………
వాస్తవాలు
క్రీనీడలు
ఊహలు
జడివానలు.
…………………..
ప్రేమ
ఋణం
అనుబంధం
అప్పు.
………………….
అణువు
సూక్ష్మం
విస్ఫోటం..
విధ్వంసం.
……………..
శలవులు
క్రోవ్వోత్తులు
కరగడం
క్షణాలు.
………………
మోదం
ఖేదం
వ్యక్తీకరణలు
అంతర్బాహ్యం.
……………………
భోగిమంట
భుగభుగలు
సంగీతం
సవ్వడులు.
……………..720.

కూరలు
విషతుల్యం
రసాయనం
విచ్చలవిడి.
……………..
పళ్ళు
హాలాహలం
గ్రాఫైట్
ప్రమాదకారి.
,……………..
జలపుష్పం
ప్రాణాంతకం
రసాయనం
పెంపకం.
……………..
చెరువులు
కలుషితం
చేపలు
విషాహారం..
…………………
మేకలు
గొర్రెలు
మాంసం
ఉత్ప్రేరితం.
………………….
పాలు
సంపూర్ణాహారం
హాలాహలం
ఉత్ప్రేరకం.
………………..
కోడిగ్రుడ్డు
ఉత్పాదన
కృత్రిమరీతి
ప్రమాదకరం.
…………………
కోళ్ళపెంపకం
రసాయనాన్వితం
భుజించకు
విషాహారం.
…………………
రొయ్యలు
దొరువులు
భూగర్భజలం
విషతుల్యం.
………………….
పచ్చగడ్డి
భవ్యాహారం
పెంచితిను
విషరహితం.
…………….730.

మతం,
వర్గం
విభజన
విదేశీప్రేరణ
…………..
హేళన
అగ్గిరవ్వ
ప్రతీకారం
ప్రమాదకారి .
……………..
సెంటిమెంటు
గ్యాసుబండ
రగులుతుంది
వాడుకుంటే.
………………..
రోగాలు
రొష్టులు
జీవితం
గతుకులరోడ్డు
………………..
ఇబ్బందులు
కష్టాలు
ఎదురుదెబ్బలు.
బ్రతుకుబాట.
………………735.
గడ్డిమొక్క
చులకనొద్దు
పుష్పిస్తాయి
అద్భుతాలు .
………………
చెయ్యి
వలిసిరింది
చేపలు
ఎంపీలాంధ్రులు.
……………….
అల
వాస్తవం
కల
కల్ల.
………………
ఆకాంక్ష
ఆచరణ
జీవితం
మువ్వన్నెలు.
………………
అంకుశం
తుప్పట్టింది
ఏనుగు
లేదు .
…………….740
మేఘం
గర్జించింది
ప్రసవసమయం
వేదన .
…………………
తండ్రితనం
మొగ్గ
తల్లితనం
పుష్పం .
…………………
ఆకు
పచ్చదనం
సూరన్న
ప్రసాదం .
……………….
శుభాకాంక్ష
సుప్రభాతం
ఉదయం
చిరునవ్వు.
………………
అంతరంగం
గ్రంధం
జ్ఞాపకాలు
పుటలు .
……………..
గిజిగాడు
నిపుణుడు
గూడు
అద్భుతం.
………………
కూలు
మిగులు
శేషం
అవశేషం.
………………
పురాతనం
చరిత్ర
గుర్తులు
అవశేషాలు.
………………
మొరాయింపు
అక్షరాలు
కాగితం
చిత్రం.
………………..
కపటం
ద్వేషం
ప్రేమకంటవు
తామరాకు.
…………………..750.
విరులు
నగవులు
పరిమళాలు
కవితలు.
…………………
అడ్డదారి
ఎరుగదు
విజయం
విశ్వాసం.
…………………
పీక
తెగ్గోసినం
గిప్పుడడుగు
ఏంగావాలే.
………………..
సిహం
రాజసం
అడవి
దర్పం.
…………..
పున్నమి
చీకటి
మేఘమేనుక
చంద్రుడు.
………………755.
అంతరంగం
జ్ఞాపకాలు
నిక్షిప్తం
అరలెన్నో !
………………..
వేకువ
సుప్రభాతం
వెలుగులు
చిరునగవులు .
……………….
ప్రక్రుతి
పరవశం
పుష్పాలు
పల్లదనం
………………..
విరులు
పరవశం
నవ్వులు
కవితలు.
………………..
బిగ్బాంగ్
కళ్ళముందు
భూచక్రం
విన్యాసం.
……………760
కుటుంబం
పెద్దలు
యువతరం
బాటలు..
…………………..
పరికించు
ప్రక్రుతి
అడుగడుగున
అందాలు.
…………………
విశ్రాంతి
ఉండదు
అలలు
నిత్యశ్రామికులు.
…………………..
మస్తిష్కం
విషభరితం
విధ్వంసం
సునాయాసం.
…………………..
విరిసింది
సుమం
గడ్డిపరుపు
కురులు.
………………..
మహాదధి
దాటవచ్చు
ఉద్వేగం
దాటలేము.
……………….
చైతన్యం
సజీవం
నిశ్చలం
నిర్జీవం.
…………………
వెలువడింది
మాట
తిరిగిరాదు
తూటా.
…………………
కిరణాలు
వర్ణాలు
క్రీనీడలు
క్రీడలు.
…………………..
సంధ్యలు
అటునిటు
పవలు
రేయి.
…………….770
తాటాకు
కప్పు
తాటిపండు
కడుపు
……………………
కలం
బలం
సిరా
రాత.
…………………
అసాధ్యం
కాదేది
సంకల్పం
ధృడం.
………………….
కాటేస్తుంది
కాలుష్యం
కాపాడు
ప్లాంటేషన్.
………………
మమతలు
బీటలు
ఆధునికం
జీవనం.
…………..775
కాకులు
అరుపులు
వేకువ
మేల్కొలుపులు.
…………………….
బిర్లామందిర్
శ్రీనివాసుడు
ప్రేక్షకుడు
మౌని.
……………………..
తధాగతుడు
లోకహితుడు
సాగరం
స్వంతిల్లు.
……………….
ఉదయం
సాయంత్రం
ఆదిత్యుడు
ఒక్కడు .
………………
పచ్చిమిర్చి
దివ్యౌషధం
అధ్యయనం
నిర్ధారణ .
…………….780
కారం
కళ్ళనీరు
మిర్చిబజ్జి
నోరూరు .
………………
మిరప్పండు
సుందరి
ముద్దెట్టకు
ముక్కుకారు
……………….
రైతు
ఆర్టిస్ట్
వరిచేను
చిత్రం .
……………..
మొక్కజొన్న
గర్భిణి
పొత్తులు
ప్రసవం .
…………….
రహదారులు
గాయాలు
ప్యాచ్వర్క్
మాలాం.
……………..
టోల్గేట్లు
తోలోల్చు
రవాణా
ధరలెరుగు .
……………….
ఏకపక్షం
నిర్ణయాలు
నియత్రుత్వం
పోకడలు
…………………
అనుక్షణం
అభద్రత
బిపిఎస్
మూడుతూర్లు .
………………….
పన్నులు
అధికధరలు
ఆకళ్ళు
కళ్ళేరుపు.
……………….
భావం
సవ్యం
భవ్యం .
కవనం
……………790
కారాదు
దాంపత్యం
జీవితాలు
సమాంతరం.
……………….
సాధన
ప్రయత్నం
విజయం
సుసాధ్యం .
……………….
సూర్యుడు
తుమ్మలు
పొద్దుపొడుపు
ఆనవాయితీ.
…………………
పరుషత్వం
మిక్కుటం
ఫలితం
దూరం.
…………………..
పిల్లి
మ్యావి
పిట్ట
తుర్రు.
………………..
తివాచీలు
పచ్చగడ్డి
లానులు
పరుపులు .
………………….
పరవశం
మనసు
ఆహ్లాదం
అందలం .
……………..
ఆకలి
అజీర్తి
లోటు
మిగులు.
……………….
సొగసులు
ప్రమాదాలు
వంటిల్లు
క్లీనర్లు.
……………..
నీకోసం
నిరీక్షణ
అనుక్షణం
వ్రణం .
…………..800.