…………….1101

అడుగడుగు
ఇబ్బందులు
అడ్డంకులు
జీవితం.
……………..
పక్షం
సమయం
సహస్రం
నానోలు .
……………..
యోచన
కేంద్రీకరణ
నిర్మాణం
నిశితం.
……………….
ద్విశతం
నానోలు
ఒకేదినం
రికార్డు .
………………
నిబద్ధత
సాధనం
నిర్దిష్టత
సుసాధ్యం .
…………….. .
సంకల్పం
సాకారం
సాధన
మార్గం .
……………..
సమయం
సంకల్పం
ఆచరణ
సన్నిహితం .
……………….
అసాధ్యం
శత్రువు
సుసాధ్యం
హితుడు .
……………….
అలసత్వం
వెనుకబాటు
ఉత్సాహం
పురోగమనం .
…………………
నిరుత్సాహం
క్రుంగుబాటు
నిర్వీర్యత
వంటజేరు .
……………..1110.

గళాలు
విచ్చుకున్నాయ్
శ్వేతపత్రం
విరామం .
…………………
పరిష్కారం
అవాంఛితం
కాలక్షేపం
రాజకీయం .
………………….
ప్రజాస్వామ్యం
పరిహాసం
ప్రజాసభలు
శునకరభస
………………….
ప్రతిపక్షం
పాలకవర్గం
పార్టీపరం
పట్టుదలలు
………………….
ప్రజాహితం
అసంగతం
వ్యక్తిగతం
ఏవగింపు .
………………….
పరస్పరం
అవాచ్యాలు
చట్టసభలు
నికృష్టం .
………………..
వ్యక్తిగతం
నిందలు
ప్రజాసభలు
భౌభౌలు .
………………….
దోచుకొనుడు
దాచుకొనుడు
ప్రజాధనం
ఫలాహారం .
………………….
దోపిడి
ప్రావీణ్యత
ఎక్కువలు
తక్కువలు
…………………
ప్రాజావాణి
వినిపించరు
ప్రాతినిధ్యం
వ్యాపారం.
……………..1120.

“అంకురం /జననం ”
………………………
##############

అంధకారం
కుహరం
జీవాంకురం
అసహనం .
……………….
పిడికిళ్ళు
బిగింపులు
అరచేతులు
జాతకం .
……………….
ఆక్రోశం
భ్రుకుటిముడి
ముడతలు
నుదుటిరాత.
……………….
గర్భస్తం
స్థితిగతులు
వ్యక్తిత్వం
పునాదులు
……………….
అమ్మ
వేదనానందాలు
గర్భాంకురం
తనతనం .
……………….
ఆనందాలు
వేదనలు
అక్షరాభ్యాసం
గర్భస్తం .
…………………
జీవం
ఆవిర్భావం
ధరిత్రి
ప్రసవం .
………………….
పుట్టుక
రోదన
గర్భావేదన
ప్రక్షాళన .
………………….
పసితనం
నిర్మలం
ప్రపంచం
దుర్గంధం .
……………….
తప్పటడుగులు
ఒడిదుడుకులు
నిత్యజీవనం
శుభారంభం .
………………….1130.

“బాల్యం”
………………………
############

కేరింతలు
పారాటకం
నిలకడ
బాల్యం.
………………….
నడక
పరుగు
జీవనం
యానం.
………………….
ఆహారం
నిర్బంధం
వత్తిళ్ళు
వ్యతిరేకతలు
……………………
స్వేచ్చ
నియంత్రణ
తనతనం
నిర్బంధం.
……………………..
ఇష్టం
అయిష్టం
వ్యక్తీకరణ
వికాసం.
…………………….
ఆటలు
పాటలు
బాల్యం
పూదోట
………………
పాఠశాల
స్నేహాలు
సన్నిహితం
ఆలంబన.
………………..
బాల్యస్నేహం
ఆత్మీయత
జీవితం
నందనం.
……………….
ప్రోద్బలాలు
మలుపులు
బాల్యం
మైనం.
…………………..
స్నేహం
ప్రభావితం
అలవాట్లు
మంచిచెడులు
……………..1140

(యవ్వనం)

విచక్షణ
విశ్లేషణ
జీవితం
పూబాట.

……………..
మనిషి
జీవితం
వైవిధ్యం
దశలు.
……………..
యవ్వనం
దశ
విచిత్రం
సంక్లిష్టం .
…………….
ఆత్మవిశ్వాసం
పోట్లగిత్త
ఎదురుదెబ్బలు
స్వానుభవం .
………………..
ఆకర్షణ
అనుభూతి
ప్రేమ
సంఘర్షణ.
…………….
సామాజికం
ఆర్ధికం
వైవిధ్యాలు
అడ్డంకులు.
………………..
వివేకం
రాహిత్యం
విచక్షణ
మృగ్యం.
………………
వయసు
వాంఛ
ప్రేమ
ముసుగు.
…………….
ప్రేమ
పవిత్రం
విచలితం
వికృతం.
………………..
యవ్వనం
ధీశక్తి
ఉత్సాహం
అమితం
……………….1150.
ప్రేమ
గుడ్డిది
యవ్వనం
ఊతకర్ర్ర..
……………….
తప్పొప్పులు
తారతమ్యం
విశ్లేషణ
వయసెరుగదు.
……………….

కౌమారం .
……………………..

బాధ్యత
బరువులు
సంసారం
ఎడ్లబండి.
……………..
వివాహం
సంతానం
ముందుచూపు
వివేకం .
……………….
కూడు
గుడ్డ
గూడు
బాధ్యత.
………………..
జీవితం
గ్రంధం
కౌమారం
ఎపిసోడ్
……………….
ఎపిసోడ్
రచయిత
తాను
మనిషి .
………………
పునాదులు
నిర్మాణం
సంతానం
భవనాలు
……………….
బాట
గతుకులు
పయనం
నిర్ణయాత్మకం .
…………………
సంయమనం
సమన్వయము
సహనం
త్రైసూత్రం.
……………….1160

“వృద్ధాప్యం”


నిర్ణయాలు
పొరబాట్లు
జీవితాలు
తక్రిందులు .
…………………..
మార్గం
ఎన్నిక
వివేకం
దుర్భిణి
…………………

నెమరువేత
వృద్ధాప్యం
భూతకాలం
మేత.
…………………
తోడు
కోరు
ఒకరు
మరొకరు.
………………..
వృద్దాప్యం
ఒంటరితనం
దుర్బలత్వం
దౌర్భాగ్యం.
…………………..
సంతానం
అండ
శేషజీవితం
బ్రహ్మాండం.
………………….
ముప్పూటలు
ముమ్ముద్దలు
ఎదురుచూపు
బ్రతుకు.
……………………
చీత్కారం
వెటకారం
ఎదుర్కోలు
అనుక్షణం.
……………………
సంతతి
బరువంది.
విధి
నిరాదరణ.
…………………..
వృద్దాప్యం
దయనీయం
గోడకాను
పీట.
……………..1170
అణుమాత్రం
ప్రాణం
పోనీ
తప్పదు.
…………………..
ఏమైతెనేం
కాయం
ఖననం?
దహనం. ?
…………….

పుట్టుక
వేదన
గిట్టుక
రోదన.
………………
మసిపాత
విసిరేత
మరణం
పునఃజననం.
………………..
శరీరం
శిధిలం
విద్యుత్
స్విచ్డాఫ్.
…………………..
కాయం
ప్రాణం
అనుబంధం
జీవనకాలం.
…………………
బ్రతుకు
చైతన్యం
మరణం
నిస్తేజం.
………………..
బాల్యం
అంకురం
మరణం
విచ్చేదం.
…………………
కాయం
ఎదుగు
జీవం
పోషకం.
…………………
మరణం
దుఃఖం
బంధం
బలీయం.
…………..1180
ప్రక్రుతి
………….

జననం
చిత్రం
మరణం
విచిత్రం.
………………….
జీవం
అద్యంతం
జననం
మరణం.
……………

ప్రకృతి
ఫలం
జీవం
సజీవం.
……………
ప్రకృతి
ప్రణవం
వికృతి
ప్రళయం.
…………….
ప్రక్రుతి
చలనం
చైతన్యం
జీవం,
……………
ప్రక్రుతి
రోదన
పచ్చదనం
విచ్చిన్నం
………………
ప్రక్రుతి
విచ్చిన్నం
ఇంధనం
వెలికితీత.
………………..
వనాలు
విస్తారం
ప్రక్రుతి
హర్షం.
…………………
ప్రక్రుతి
ప్రకోపం
సునామీలు
ప్రళయం.
………………..
ప్రక్రుతి
క్రోధిత
భూకంపన
జననాసిని
……………1190
ప్రక్రుతి
కన్నెర్ర
గుణపాఠం
నేర్చుకుందాం.
…………….
పర్యావరణం
పరిరక్షణ
ఉపశమనం
ఉగ్రధాత్రి.
……………1192.
గగనం
……………………….
గగనం
పైకప్పు
ధరిత్రి
నిశ్చింత
……………..
వర్ణం
సుందరం
నీలం
గగనం
…………….
మేఘాలు
ఆచ్చాదనలు
నగ్నం
నీలం
………………
గగనం
కాన్వాస్
మేఘవర్ణం
వర్ణచిత్రం .
……………….
కిరణాలు
వర్ణాలు
వికీర్ణం
సంకరం .
………………..
వాయువు
కుంచె
వర్ణం
విస్తరణం.
……………….
మేఘాలు
రూపాలు
ఆకారాలు
క్షణికం.
…………….
క్లిక్
మేఘం
స్వంతదారు.
నీవు .
………………..1200