చెదగూళ్ళు
గుంభనం
నిర్మాణం
సునిశితం.
నిర్మాణం
రేఖాగణితం
మూలాధారం.
ఆర్కిటెక్ట్
గూడు
సంక్లిష్టం.
బెరడు
శిల్పారామం
వీక్షించు.
శిలలు
వెతుకు
ఆకారాలెన్నో.
పరికించు
సరస్సులు
పర్వతాలు.
రవ్వంత
మిగిల్చింది
బూడిద.
శభాషనకు
ఒప్పనుకుంటా
తప్పు.
పరిధులు
అయస్కాంతం
వికర్షాకర్షణలు.
నీడివ్వదు
గూడుండదు
పక్షింకెక్కడ.
అస్తవ్యస్తం
అత్యాశ
అంతులేదు.
మార్చు
ఊసరవెల్లి
స్వీయరక్ష.
సాయంత్రం
ఆదిత్యుడే
అధ్యయనం
చెప్పింది
దివ్యౌషధం
కీళ్ళనొప్పి
కట్టు.
మిర్చి
పచ్చిమిర్చి
సూపర్ఫుడ్
పరిశోధనంది.
పండు
కొరక్కు
కంటినీరు .
వలుస్తున్నవి
టోలు
గేట్లు.
అదృష్టం
నీతవినీతి
అక్షరవ్యత్యాసం.
“విశ్రాంతి”
నెమరువేత
జ్ఞాపకాలు
ఉరవడి.
…………………20
ఆత్మీయత
అనుబంధం
ఆలింగనం
మధురిమ ..
వెనక్కు
ఆటవికత
ఆవైపు.
కాయ
ఉడత
జడ్జి.
కారం
మామిడి
నోరూట.
పూత
కరెంటు
చీమలు.
బంధుమిత్రులు
సంతాపం
కాకి
మరణం.
……………30
దొరికింది
ఎముక
వదలదు
కుక్క.
……………
అందలం
ఆకాంక్ష
దోపిడి
లక్ష్యం.
……………
నాట్యం
భంగిమలు
నెమలి
అడుగులు .
……………….
కన్ను
కాంచింది
నెమలి
కన్ను.
……………..
మనసు
తన్మయత
కుంచ
నర్తించింది .
………………
రాజకీయం
చిత్రరంగం
వారసత్వం
పల్లకీ
………………..
వెట్టిచాకిరీ
అలవాటు
గాడిదలు
ప్రజలు.
……………….
నాగలి
ఉలి
దుక్కి
శిల్పం.
………………..
అరిటాకు
విచ్చుకుంది
గాలికలుసు
చించింది.
………………..
రూపాయి
బిళ్ళ
తులం
వెండప్పుడు.
………………..40
కాణి
దమ్మిడిలు
మూడు
నాడు.
………………..
ఖూనీ
కానీకు
భాష
పరితపిస్తుంది.
…………………
చెరువుంది
స్కూలుంది
భోజనంబెల్
చేపలెదురుచూపు .
…………………..
పోలీస్!
హెచ్చరిక
తాటితోపు
గప్చుప్.
………………..
కోళ్ళు
ఎడ్లు
ఫణం
జీవితాలు.
………………….
వామనం
కుబ్జం
కవిత్వం
తీరులేవైన.
……………………
పదాలు
నాలుగు
భావస్పూర్తి
నానో.
…………………..
బుద్భుదాలు
కుబ్జకవితలు
పండితులు
మనోభావన.
………………….
గమనం
చైతన్యం
నిశ్చలం
జడత్వం.
………………
మనసు
గాయం
కాలం
ఔషధం .
………………….50
గతం
త్రవ్వకు
శిలలు
శిధిలాలు.
………………
గమకం
రాగం
తమకం
మైకం.
………………
సమైక్యం
ప్రగతి
వేర్పాటు
విస్చిన్నం.
………………..
కోడికూతలు
తువ్వాయిలు
సందళ్ళు
సంక్రాంతి..
…………………
ముగ్గులు
గొబ్బిళ్ళు
విరిఝల్లు
సంక్రాంతి.
…………………
మిరపపంట
చెరకుతోట
బెల్లమొంట
సంక్రాంతి.
…………………
నూర్పిడి
పందారం
పంపకాలు
సంక్రాంతి.
………………..
కోడిపుంజులు
తాటితోపులు
సరాగాలు
సంక్రాంతి.
………………..
భోగిపళ్లు
బోసినోళ్ళు
పరవశాలు
సంక్రాంతి.
…………………
భోగిమంట
కాపడాలు
మంచుతెరలు
సంక్రాంతి.
………………….60
పట్టుకోక
పరికిణీలు
రెపరెపలు
సంక్రాంతి.
…………………..
కుప్పలు
నూర్పిళ్ళు
పురులు
సంక్రాంతి.
………………..
బావలు
మరదళ్ళు
ఎకసేక్కాలు
సంక్రాంతి.
………………..
కొత్తల్లుడు
ఆడబడుచు
అలకపాన్పు
సంక్రాంతి.
…………………..
బంతిపూలు
చేమంతులు
ద్వారహారాలు
సంక్రాంతి.
………………..
రోడ్లు
వూడుపు
కళ్ళాపి
సంక్రాంతి.
……………….
గంగిరేద్దులాట
సన్నాయి
బుడబుక్కలు
సంక్రాంతి.
………………….
అరిసెలు
పూర్ణాలు
రేగుబళ్ళు
సంక్రాంతి.
………………..
భూతం
సనాతనం
భవిత
అధునాతనం
………………..
వర్తమానం
నావ
భవిత
మహాసంద్రం.
………………..70
పడుగు
పేక
మగ్గం
నేత .
……………….
ఈతాకు
తాటాకు
తుంగ
చాపలు.
………………….
ఈతచెట్టు
తాటికాయ
వ్రేలాడింది
కల్లుముంత.
…………………
అల
కల్లోలిత
శిల
అడ్డొచ్చింది.
………………….
తుమ్మెద
పుప్పొడి
అనుబంధం
నిరంతరం .
……………….
అంతరంగోద్భవం
కారుణ్యం
హ్రుదయోద్భవి
కార్పణ్యం.
………………..
మనసు
నిర్దేశం
కాయం
చేష్టలు.
………………..
మౌనం
భాష
కనురెప్పలు
పదాలు .
……………….
సేవ
విద్యుత్లక్ష్యం
అపహాస్యం
అసహనం .
…………………..
విద్యుత్తు
అంటరానిది
ముట్టకు
మాడిపోతావ్.
………………..80
కొండ
కన్నది
బండ
బిడ్డ.
………………..
సాహిత్యం
దాహం
నానోలు
జల్లులు.
………………..
ఓర్పు
సహనం
వేట
నేర్పు.
………………
ఆకసం
మురిసింది
గగనమంటింది
పిఎసేల్వి
…………………
తాతలు
నేతులు
మూతులు
ముచ్చట్లు.
…………………..
పొదిగింది
కాకి
కోయిల
పిల్లలు.
………………..
చెట్టు
కన్నీరు
పనస
కొమ్మిరిచా!
……………….
అనూచానం
ఆచరణ
సమాజం
సంప్రదాయం.
…………………
చావు
రేవు
అనుబంధం
సాంప్రదాయం.
………………….
లోకులు
కాకులు
నిత్యం
రాద్ధాంతం.
………………90
జీవి
జీవితం
క్షణం
విశ్లేషించు.
……………..
క్షణికం
వర్తమానం
వాస్తవం
యోచించు.
………………..
భూతం
గడిచింది
నడుస్తోంది
వర్తమానం.
…………….
భావి
సందిగ్ధం
భూతం
అనుభవం.
……………….
గుండె
నర్తకి
గానం
స్వీయం.
………………..
భవిత
పుష్పించదు
వర్తమానం
నీడలు.
………………..
గడియారం
ముళ్ళు
పన్నెండేక్కాయి
కొత్తేడాది.
………………..
కొత్తేడాది
పాతేడాది
మధ్య
త్రుటి.
………………..
కొత్త
ఆకాంక్ష
పాత
అనుభవం
…………….
మైలురాళ్ళు
సంవత్సరాదులు
ప్రస్తానం
ప్రణాళిక .
……………….100
Feb-2014.
………………
ఆప్యాత
తటాకమప్పుడు
నేడు
ఎండమావి.
……………….
అనురాగం
అంబరం
ఆత్మీయత
జల్లు.
……………….
ఇరుకు
మనసు
ప్రయత్నం
అసఫలం
……………….
స్నేహితాలు
సునిసితాలు
నిర్వహణ.
సావధానం.
……………….
చనువు
మీరకు
స్నేహం
విరుగు.
……………….
పరిహాసం
అవహేళన
పర్యవసానం
అఘాతం.
………………..
గౌరవించు
బ్యాంక్బ్యాలేన్స్
రెట్టింపు
ఎదురొచ్చు
………………….
రాళ్ళు
క్రింద
తేళ్ళు
ఎత్తకు .
…………………..
లోహద్రవాలు
మలుస్తాడు
కార్యధనుడు
కార్మికుడు.
………………..
విద్యుత్తు
పడగలు
కార్మికుడు
కాటుకెరవడు.
…………………110
ప్రాణాంతకాలు
ద్రావకాలు
సాధకుడు
కార్మికుడు.
…………………
యంత్రదంష్ట్రం
నియంత్రణ
కార్మికుడు
సవ్యసాచి .
………………..
భవనం
నిర్మాణం
ఆణువణువు
శ్వేదాశృవు.
………………..
నిత్యం
వేవేలు
కవిత్వాన్వితం
ఫేస్బుక్.
…………………
నానో
స్థిరత్వం
నాలుగు
పాదాలు.
…………………
భవ్యం
భావం
నానోకృతి
సూక్ష్మం.
………………
నియమాలు
నిష్ఠలు
రమ్యాక్షరి
నానో .
………………..
ప్రగతి
తొలిమెట్టు
ఎప్పటికి
అట్టడుగున.
………………
అడుగు
ముందు
అడుగు
అభ్యుదయం.
…………………
వేకువ
మేల్కొంది
వెన్వెంట
చైతన్యం.
………………..120
ప్రభాతం
ఒళ్లిరిచింది
రెక్కలల్లార్చింది
పక్షి.
…………………
చీమలబారులు
మనుషులు
గుట్టేక్కాను
దృశ్యం
…………………
ఉసిరిచెట్టు
పూత
గుత్తులు
కాయలు
……………..
ములగచెట్టు
విరబూతలు
నవ్వులు
అతిశయాలు .
……………..
పెరడు
తులసి
మొగ్గిరిసింది
గుత్తులు
……………
పెరడు
జిల్లేడు
ఆరోగ్యం
అభిజాత్యం .
………………
ప్రక్రుతి
ప్రసవం
వాసంతిక
మంత్రసాని .
………………..
సూరన్న
వీక్షణలు
కిలకిలలు
పకపకలు.
………………….
కాలం
కౌగిలి
ఓదార్పు
ఉపశమనం.
…………………….
నికృష్టం
రాజకీయం
రాజ్యాంగం
ఆటవస్తువు
………………130.
రాష్ట్రం
విచ్చిన్నం
ప్రజాస్వామ్యం
ఖననం
………………..
మైనారిటీ
ప్రభుత్వం
మైనప్బొమ్మ
రాజ్యాంగం.
………………
శిలలు
ఎన్నో
శిల్పాలు
కొన్నే
…………………
మనుషులు
అసంఖ్యాకం
మహనీయులు
కొందరు.
………………
అమ్మలు
అపురూపం
మమతలు
స్వరూపాలు
………………
బస్సెక్కా
దింపేశాడు
చూస్కోలా
జేబుక్కంత.
……………….
సిటీ
బస్టికేట్
పైసలేడు
మినిమమప్పుడు.
………………….
పైసల్తగ్గాయి
రెండు
మైళ్లు
పైసకొక్క టి.
…………………..
సంపుడు
జచ్చుడు
యుద్ధం
ఇంగితం.
……………………..
ఆకలి
తీరింది
పెట్టినిల్లు
వాసాల్లెక్కిక
……………………..140
ఒడ్డుజేరినం
తెప్ప
తగలెట్టు
ఇమానమన్నదేంది .
…………………
గడ్డి
పువ్వు
వీక్షించు
అందాలు !
……………………
విభజన
భజన
ద్రుశ్యమాద్యమం
అత్యాసక్తి.
……………………
ప్రజాస్వామ్యం
నేడు
నియంత
రేడు .
…………………..
ధనాహంకారం
మదాంధకారం
నియంతృత్వం
అధికారాకాంక్ష .
……………………
కాండం
కొమ్మలు
రెమ్మలు
ఆకులు .
…………………..
కాకులు
గుంపులు
అసహనం
చూపులు.
…………………..
ఎంగిలి
విస్తళ్ళు
కుక్క
కబ్జా .
……………………
వైద్యం
గర్భస్రావాలు
పిండఘోషలు
ఖగోళం
గోళంగాదు
అసంఖ్యాకం
గోళాలు .
…………………….
ఖగోళం
గందరగోళం
మొదలెక్కడో
తుదెక్కడో.
…………………..
సెందురుడు
పక్కింటోడు
మందలించిన్రోపారి
మనోళ్ళు .
…………………..
పండినం
అనుకుంటం
విశ్వమంతట
తిరుగుతున్నం.
………………….
ప్రజాస్వామ్యం
నిధనం
ఆయుధం
అధికారదాహం
…………………….
ప్రజాస్వామ్యం
కొనవూపిరి
నియంత్రుత్వం
బలిష్టం .
…………………..
రాష్ట్రమిడిపోతేనేం,
మూజువాణి
సంపూర్ణం
అవగతం .
…………………..155
స్పందించండి