(స్థలపురాణం).
కప్పరగ్రామం …కుగ్రామంగా నాడు.. నగరంగా నేడు.-1
రచన: నూతక్కి రాఘవేంద్రరావు.contact no.9866651094.
రుక్మిణీపురి కాలనీ , కప్పర మునిసిపల్ డివిజన్
GHMC.
…………………………………………………………….
ఒకమాట.
……………….
భావితరాలకు మనకుతెలిసినంతవరకు గ్రామాలుకాని, నగరాలలో కాని ,కాలనీలలోకాని పునాది దశనుండి జరిగినఅభివృద్ధి పరిణామదశలను,అభివృద్ధికి కారకులైన మహాత్ములవివరాలను, మౌలికదశలన్నిటినీ వాస్తవాలను అక్షరరూపంలో నిక్షిప్తంచేసేయత్నం చేసి . ఆయాప్రదేశాల అభివృద్ధిలో పరిణామ దశలను భావితరానికి అందించడం మనందరిబాధ్యత . అంటూఆమధ్యఓచిన్నివ్యాసం ఫేసుబుక్ లో నేను ప్రచురించిన నాటినుంచి ఆవిషయం నావెన్నుతడుతూ ఉంది నిరంతరం.
ఇది భవిష్యత్తులో ఓచారిత్రిక ప్రాధాన్యమైన అంశంగా మారుతుంది. ప్రపంచీకరణ నేపధ్యం లో ఆకారాలు మార్చుకుంటూ నగరీకరణ వైపు మొగ్గుచూపుతూ గ్రామాలు నగరాలు . ఆయా మార్పులను అభివృద్ధిని సూక్ష్మపరిశీలన చేసి మౌలిక రూపాన్నివెలికి తీసి యధాతథంగా అక్షర పూర్వకంగానిక్షిప్తం చేయడానికి ప్రభుత్వాలు గాని స్థానికసంస్థలుకాని పూనుకోకపోవడం విచారకరం. ఇప్పటికైనా నగరీకరణలనేపధ్యంలో కనుమరుగౌతున్న వాస్తవచిత్రాలను ప్రభుత్వం సంరక్షించ పూనుకొని కనీసం గతయాభైఏళ్ళ పరిణామాలను ఆయాగ్రామ, నగరపరిధులలో పరిశీలించి వ్యాసాలుగా నిక్షిప్తపరిచితే, ఆయాగ్రామాల, ప్రాంతాల, అభివృద్ధికి సచ్చందంగా పాటుపడిన వ్యక్తులు అధికారులు, స్థానిక నాయకులు, మొదలైన వారినిఉటంకిస్తూ ప్రాంతం అభివృద్ధిపటాన్నిభావితరాలకు అందిస్తే రేపటి చరిత్రకారులకుఒకవాస్తవ ముఖ చిత్రాన్నిఅందించిన వారమౌతాము. లేకుంటేపరిశోధనలపేరుతొ వాస్తవాలువక్రీకరించబడతాయి. వాసవాలను అక్షరాలలో నిక్షిప్తంచేసే నా ప్రయత్నంతో నేనుచేపట్టిన ఈ ప్రారంభానికి అందరూ సహృదయం తో చేయూతనిస్తారని భావిస్తున్నాను.
తప్పొప్పులు , సవరణలు తీరిగ్గా చేసుకోవచ్చు. విజ్ఞులు మరింతసమాచారం అందించవచ్చు. వాస్తవాలుకనుమరుగౌతున్నతరుణం. అర్ధజ్ఞానం తో పుక్కిటపురాణాలకుఆస్కారమౌతున్నవేళ
ఈ కప్పర గ్రామ ప్రాంతాభివృద్ధి మహావృక్షాన్ని మొక్కగా వేరునుంచి చూసినవాడిగా నాకున్నఈ ఫెసుబుక్ బ్లాగులలో అందుబాటులో ఉన్న వనరువినియోగించి అందరికీ అందజేయ యత్నిస్తున్నాను. . సరిజేతలు చేర్పులు వున్నతెలుపగలరు. .తెలిసినవారు స్థలచరిత్ర నుకూడా దీనికిజోడించవలసిందిగా విన్నవిస్తున్నాను. )భావితరాలకువినియోగాపడుతుందనినా ఆకాంక్ష.
(ఈ రుక్మిణీపురి కాలనీ ఎక్కడఉంది రాఘవేంద్రరావుగారూ అన్న శ్రీ ముత్తేవి రవీంద్రనాథ్ గారి ఓచిన్నిప్రశ్న నాఈవ్యాసానికి స్ఫూర్తి.)
కప్పర గ్రామంగా నాడు…నగరంగానేడు.
తొలిపుట.
…………………………………………………….
ఇసిఐల్ నుండి సైనిక్ పురి వెళ్లే మార్గం1977 లోబళ్ళబాట.
ఆతరువాత సుదీర్ఘ సమయం కంకరరోడ్డుగా, సింగిల్ తారురోడ్ గా పరిణతిచెంది ఇప్పుడు డివైడర్ల తో ప్రముఖపారిశ్రామిక కేంద్రం లో నగరంలో ఓప్రముఖమార్గంగా మారిన Dr AS Rao Nagar ఎడమవైపున ఉంటె, కుడివైపున రుక్మిణిపురి కాలనీ ఉంటుంది .
ఆప్రాంతమంతటిలో 1977 తోలి నిర్మాణం నానివాసం.
1981 లోమాయింట జరిగిన డేకాయిటీ ఆప్రాంతానికిపోలిస్ స్టేషన్ తెచ్చింది. అప్పటివరకు కీసరమండలంమొత్తానికినలుగురు కానిస్టేబుళ్లు షామీర్ పేట నుండి సైకిళ్ళపై తిరుగుతూ గ్రామాలు పహారాకాసేవారు.కుషాయిగుడా ఓమజిలీ.
1969/70 ప్రాంతంలో కుషాయిగుడాకు సికింద్రాబాదు నుండిఒకటి, కోటి నుండి ఒకబస్ఉండేది. మౌలాలివరకు ఇరుప్రాంతాలనుండీ పలుబస్సులుఉండేవి. ఎక్కువబస్సులు లాలాపేటతోఆగిపొతే,మరికొన్ని రైల్వేకాలనీతో ఆగిపోయేవి. ECIL, NFC సంస్థలస్థాపన, ఆతదుపరి DAE కాలనీ నిర్మించి నివాసయోగ్యంగా ఆసంస్థతమఉద్యోగులకు అందజేసిన పిదప మరికొన్ని బస్సులు కుషాయిగుడకు,కొన్ని DAE కాలనీకి రావడంజరిగింది.
నేడు ఇసిఐఎల్ x roads అని పిలవబడే ప్రాంతంనుంచి రామకృష్ణాపురంవరకు అదివిశాలమైన నిర్మానుష్యప్రదేశం ఎడారిలా గోచరించేది .మధ్యలోసైనిక్ పురి వాయుపురి, డిఫెన్స్ కాలనీలు నిర్మాణ దశలో వేగవంతం కాని తరుణం . నిర్మాణాలు అక్కడక్కడాజరుగుతున్నకాలం. రామ కృష్ణాపురం రైలు స్టేషన్ వరకుమాత్రమె ఉన్నబస్సులను 1976 లో రైలు గేటు దాటించి సైనిక పురి వరకు, , ఉదయం ఒకటి,సాయంత్రం,ఆతరువాత కొంత కాలానికి ఎల్లారెడ్డిగుడావరకు ఉదయమొకటిసాయంత్రమోకటిగా పొడిగించడంజరిగింది. ఎకరంవెయ్యిరూపాయలచొప్పునకొని పొలాలను నివాసస్థలాలుగా మార్చినవ్యాపారులు .గత 35/40సం.రాల క్రితం చ.గజంఒక్కింటికి ఒక్కరూపాయినుండి మూడురూపాయలుగాఅమ్మి తే …చదరపుగజంవిలువ నేడు ప్రాంతాన్ని బట్టి నలభై వేల నుండి లక్షాయాభైవేలరూపాయల వరకు ఉందంటే అందుకు పారిశ్రామికప్రగతి కారణమనిచెప్పవచ్చు. ఆరోజుల్లో ఆ ఒక్క రూపాయిదొరకడమేగగనం.
ఇక రుక్మిణీపురికాలనీ విషయానికివద్దాం..
ఈకాలనీలోనే కాదు . ఎటు చూసినా జనసందోహానికి రెండుకిలోమీటర్ల దూరంలో ఏకాంతంలో 1977 లో నిర్మించబడ్డ తోలి గృహాలురెండు మాకాలనీలోవే . అందులోఒకటి ఈ వ్యాసరచయితది.మరొకటి మిత్రులు స్వ.ఇంద్రగంటిపార్ధసారధి గారిది. ()వారు రాష్ట్రప్రభుత్వంలోరోడ్స్అండ్ బిల్హింగ్స్ శాఖలో పదవీవిరమణచేసారు. కాలనీ వెల్ఫేర్ అసొసిఎషన్ లో స్థాపక అధ్యక్షులు .
ఒకఅగ్గిపెట్టె కావాలన్నా పన్నెండు కిలోమీటర్ల దూరంలోని సికిందరాబాద్ వెళ్ళవలిసిన స్థితి.కరెంటు,నీళ్ళు లేని స్థితిలో పసిపిల్లలతోఒంటరిగాఓకుటుంబం నివాసం .చాలాక్లిష్టతతోకూడుకున్నది.
ఆకాలంలో కప్పర, కుషాయిగూడాదూరదూరంగాఉందే రెండుచిన్నకుగ్రామాలు. అవిఒకప్పుడువైభవంగాబ్రతికినచరిత్రఉంది.
ఇకపోతే మాకాలనీవిషయానికివద్దాం.
కప్పర గ్రామపంచాయితీగా ఉద్భవించిన కాలంలో ప్రారంభించబడ్డ ప్రైవేట్ కా లనీలలో 1977 లో నిర్మించబడ్డ రెండవకాలనీ రుక్మిణిపురి.
అణుపురంకాలనీ ,సైనికపురి తోలితరం కాలనీలు 1976 లో ప్రారంభమైనాయి.
నేటి రుక్మిణిపురిప్రాంతంలో శారదాథియేటర్ , స్వాగత్ గ్రాండ్ హోటల్, సిటీబ్యాంక్ ,HDBC Bank మూడు సూపర్మార్కెట్లు, మూడుపెద్దఎలెక్త్రానిక్ సంస్థల షోరూములు నాలుగు సాఫ్ట్వేర్ఆఫీసులు ఇరవైయ్యయిదు అపార్ట్మెంట్కాంప్లెక్స్లు, ఓపది ఒంటరిఇళ్ళు ఒక రే సుకోర్స్ బెట్టింగ్ సెంటర్ వెయ్యికి పైగా కుటుంబాలతో మూడున్నర వేల జనాభాతో అలరారుతు రాజకీయవైవిధ్యభావాలున్నప్రజలతో ఉన్న మాకాలనీపైఇప్పటివరకు పాలకుల కుఅధికారులకు, ప్రజాప్రతినిధులకుకొంచెంచిన్నచూపే. శ్రద్ధకొరవడింది. ముందుముందు ఏమిజరుగుతుందోచూడాలి.
నగరప్రగతినిప్రస్తావిస్తున్నఈతరుణంలో DAE కాలనీని పరిగణన లోనికి తీసుకోకతప్పాదు. అదికేంద్రప్రభుత్వమేసకలనివాససౌకర్యాలతోతమఉద్యోగులకొరకు నిర్మించి యిచ్చినటువంటిది. ఆకాలనీలోని AEC స్కూల్ ఒకరకంగా భాగ్యనగరవిద్యావ్యవస్తలో పెనురికార్డులకుకారణమయ్యింది. కప్పరముఖచిత్రాన్నిమార్చినఘనతఆవిద్యాలయానికిదక్కుతుంది.
తొలుతఅరకొరవసతులతోఉన్నకాలనీకిరావడానికిఉద్యోగులు అయిష్టతచూపినపుడువారిపిల్లలకుస్కూలులోఉచితంగాప్రవేసాలుఅందించింది. ఆతరువాత పెక్కుశాతంఉద్యోగులుఈప్రాంతానికితరలివచ్చిస్వయంగాఇల్లునిర్మిచుకోవడంతోకాలనీలసంఖ్యా అభివ్రిద్ధిచెందాయి. నిర్మాణరంగంఊపందుకొంది. .ప్రైవేటువిద్యాసంస్థలు దాన్నిఅదనుగాచేసుకొని తమసంస్థలనుస్తాపించడంతో ఈప్రాంతం విద్యారంగంలో పటిష్టభూమిక నిర్వహించింది.
ఆతరువాత కాలాలలోనిర్మించబడిప్రఖ్యాతినొందినకాలనీలలో స్వర్గీయ Dr .శ్రీ ASRao గారి పేర వారిపై గౌరవంతో ECIL ఉద్యోగులు వారిపేరుపై నిర్మించుకున్న సహకారగృహసంస్థ Dr.ASRao Nagar. ఈప్రాంతం అనేక కాలనీలసముదాయమైనా Dr ASRAO నగర్ గా నేప్రసిద్ధిపొందింది.
త్యాగరాయనగర్, విజయపురి, , శ్రీనివాసనగర్, అణుపురం, మహేష్ నగర్, కమలానగర్. … ఈశ్వరీపురి, అరుల్ కాలని, బృందావన్ కాలనీ సాయిబాబాకాలనీ,హెచ్ఎంటినగర్, OU teachar’s కాలనీ, శంఖుకాలనీ లపేర్లతో ఇంకా అనేక, పెద్ద చిన్నకాలనీలు ఆతరువాత అభివృద్ధిచెందాయి. సాకేత్ వాటిలోప్రముఖమైనది.1979 లో మౌలాలిలో హౌసింగ్ బోర్డ్వారునిర్మించిప్రజలకుఅప్పగించిన విశాలమైనకాలనీ మౌలాలిహౌసింగ్బోర్డుకాలనీ కప్పరమునిసిపల్డివిజన్లో ప్రముఖమైనది. ఇందులోNFC,ECIL,HCL,యూనియన్ కా ర్బైడ్, HMT bearings మొ. పారిశ్రామికసంస్థలకుచెందినా మధ్యతరగతి, చిన్నతరగతి కార్మికులునివాసాలుపొందారు. అలాఈప్రాంతం ఒకప్పుడునిర్మానుష్య ప్రాంతం ఇప్పుడు అపార్ట్మెంట్వ్యవస్థవ్రేల్లూనుకొని విరాజిల్లుతూ జనసమూహాలతో అలరారుతోంది.
ఒకప్పుడు ప్రతీవస్తువుకూ అగ్గిపుల్లతోసహా సికింద్రాబాద్ కువెళ్ళవలసివచ్చ్ది. ఇప్పుడు కుషాయిగుడాలోకూరగాయలమార్కెట్టేకాక ప్రతీరోజుఎదోవిభాగంలోరైతుబజార్లునిర్వహించడంప్రజలకుఏంటోసౌకర్యం. కుశాయిగూడలోహోల్సేల్షాపులుఅభువ్రుద్ధిచెందాయి.
ఒకనాడుజలుబుచేసినా వైద్యానికిగాంధీహాస్పిరాల్ తప్పఆధారంలేదు. ఇప్పుడు మాప్రాంతంలో అయిదారుకార్పోరేట్స్థాయిలోలేకున్నాపెద్దవైద్యశాలలు ప్రజలకుసేవచేస్తున్నాయి. అంబులెన్స్వసతిఅందుబాటులోఉంది.
గ్రామపంచాయితీగా మునిపాలిటీగా, ఆతరువాత నగరకార్పోరేషన్లో మిళితమైన విభాగ ప్రాంతంగా సువిశాలమైన నగరవిభాగంఇప్పుటి మా కప్పరమునిసిపల్ డివిజన్. భాగ్య నగరకార్పోరేషన్ తొలి, చివరి కార్పొరేటర్లు ఈప్రాంతంవారే. మాడివిజన్లో నలుగురు కార్పొరేటర్లు.
మా నగరవిభాగం లోని చెర్లపల్లిడివిజన్నుంచి కార్పొరేటర్ గా ఎ న్నికకాబడిన శ్రీబొంతురామమోహన్ గారు. నగరమేయర్ కావడం మాకు ఆనందదాయకం. గౌరవకారణం .
కప్పరమునిసిపాలిటి డివిజన్లోని నివాసకాలనీలనుండి, నివాస మరియు వాణిజ్య పన్నులుచెల్లించే అత్యధిక రెవిన్యూ అందించే కాలనీ టూకీగా రుక్మిణిపురికాలనీ (ఇంకాఏంతోఉంది. శ్రీ ముత్తేవి రవీంద్రనాథ్ గారి ఓచిన్నిప్రశ్న నాఈవ్యాసానికి స్ఫూర్తి.
స్పందించండి