పరాన్న బుక్కు
రచన : నూతక్కి రాఘవేంద్ర రావు.
………………………………………………….
అనంతానంత విశ్వం లో
నక్షత్రకూటములు
పాలపుంత ఒకటి
అందుతో
తానూ తిరుగుతుంటాడు
సూర్యుడు
విశ్వ పరిమాణం లో
ఇసుకరేణువు వాడు
తన సంతును
వెంటేసుకొని
అనంత యానం
కోడి ,పిల్లల తంతు.
గుడి గుడి గుంచం
ఆటలు.
ఆ సంతునున్నదో పి ల్ల
తానె పుడమి
మానవ జీవి
ఓ పరాన్నభుక్కు
అందుపై ఓ పరమాణువు.
తన ఆరాటం .
విశ్వాన్నితన కైవసం చేసుకోవాలని.
తాను కూర్చున్న కొమ్మను
నరుక్కుంటూ వాడు .
………………………………………………..