శామూ తో శాన్డియాగో సీ వరల్డ్ లో ఓ అర గంట పాటు గడపిన అనుభూతుల వలయంలో నుంచి shamu_2ఇంకా మేము బయట పడలేదు.అది అంత తేలికగా వీలయ్యే సామాన్య మైన విషయం కాదని చాలా లేటుగా తెలిసింది.. తెలిసిన వారికి అట్లాంటి అవకాసం వస్తే వదులు కోవద్దని మాత్రం ఖచ్చితంగా చెబుతాను . ఇట్లాంటి అవకాశాలు చాల అరుదుగా లభిస్తాయని చెప్పటంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు.ఈ లోకాన్నే మరచి కాసేపయినా ఆత్మానందాన్ని పొందే ఇటువంటి ఆవకాశం అత్య ద్భుతం .చక్కటి శిక్షణ ,అణకువ ,శిక్షకులు చెప్పింది వినే నైజం ,ఆ భారీ కాయం తో చూడ చక్కని రూపంతో సంగీతానికి అనుగుణంగా ,ఆ నృత్యం, ఆ జల క్రీడలు ,అత్యద్భుత విన్యాసాలు, సన్నిహితంగా పలక రింపులు ….షామూ వంద టన్నుల బరువుతో నలుపు తెలుపు రంగులతో నున్నన్నటి శరీరంతో చూడ చక్కగా వుండే ఈ జల చరం షుమారు ఏడు నుంచి పది అడుగుల ఎత్తు వెడల్పులతో ముప్పై నుంచి నలభై అడుగుల పొడవుంటుంది. ఆ ప్రదర్శనలో శిక్షక నిర్వాహుకుల అద్వితీయ సామర్ధ్యం అమోఘమనే చెప్పాలి.ఆ ప్రేమ ఆప్యాయత ఆదరణ , అకుంఠిత దీక్ష ,దక్షత అబ్బురమనే చెప్పాలి.

శామూ సాని హిత్యములో గడిపిన ఆ అరగంట సమయం లో బాహ్య ప్రపంచాన్ని పూర్తిగా మరపించి పోతావు .నీ మనసులో అసూయ , ఆవేదన, ఆందోళన, ఆక్రందన ,ఆవేశం, కావేషం, రోషం, దుఃఖం ,ఈర్ష్య ,ఇవేవీ దరి చేరవు. ఆ సమయం లో మనసు కాస్త స్థిమిత పడుతుంది.

అది శాండియాగో పట్టణం .అమెరికాలో నైరుతి దిశ లో కాలి ఫోర్నియా రాష్ట్రం లో వున్న ఫసిఫిక్ మహా సముద్ర తీర నగరం శాండియాగో పట్టణం.ఎన్నో ప్రపంచ ఖ్యాతి గాంచిన పరిశ్రమలు, సాఫ్ట్ వేరు కంపెనీలు ,అణువిద్యుత్ వుత్పాదక , సంస్థలే కాక ,లెగో లాండ్, ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన జంతు ప్రదర్శన శాల ,కొన్ని వేల ఎకరాలలో విస్తరించి వున్న జూ సఫారి, ఈ సి వరల్డ్ లోనే మనం ముచ్చటించుకొనే శామూ నివాస ముండేది. ఈ సుత్తి మాకెన్దుకయ్యా అసలు విషయానికి రమ్మని మీరు నన్ను తిట్టు కొంటూ ఎదురు చూస్తూ వున్న విషయం నాకు తెలుసు.

వస్తున్నా ,అక్కడికే వస్తున్నా.

శామూ అంటే ఎవరనుకున్నారు? సముద్ర జీవ రాజం, వేల్, ఆ జీవాలు ఆ సీ వరల్డ్ లో పది దాకా వున్నాయనుకుంటా, కొంచెం పెద్ద చిన్న సైజుల్లోన్నే గాని దేని పేరు షామూ నో ఎవరూ గుర్తించలేరు, నిర్వాహకులు, . .శిక్షకులు ఇచ్చిన శిక్షణ మహాద్భుతం .ఆ మూగ జీవాల అభిమానాన్ని ,ఆప్యాయతని పొంది వారి నిర్దేశ కత్వంలో చిలిపిగా ప్రేక్షకుల పై నీళ్లు చల్లడం,కవ్వించడం , సంగీతానికి అనుగుణంగా నీళ్ళల్లో నిలబడి ఆ భారీ కాయాన్ని బాలన్స్ చేసుకుంటూ నృత్యం చేయడం, శిక్షకురాలిని అమాంతం నీటి అట్టడుగునుంచి ముఫై అడుగులు పైకి లేచి మూతితో పైకి లేపి నిల్పెట్టడం, ఏడెనిమిది వే ల్స్ కలిపి సంగీతానికి అనుగుణంగా నర్తించడం ,ఇవన్ని ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేస్తాయి .ప్రేక్షకుల పై నీళ్లు చిమ్మే టప్పుడు మొదటి నాలుగు అయిదు వరుసలలో వున్నవాళ్లు తడిచి పోతారు. అందుకు సిద్ధమై చాలా మంది పిల్లలు పెద్దలు ఆయా దుస్తులేసుకొని పోటీపడి ముందు వరసల్లో కూర్చుంటారు.

ఎన్నో ప్రఖ్యాతి చెందిన నగరాలు, కొన్ని వందల మైళ్ళ దూరం ఆ తీరం వెంట వ్యాపించి, పేరుకే పేరులు వేరయినా, నగర నిర్వహణలు, వేటికి అవే అయినా, చూపరులకు ఒకే బృహత్తర నగరంగా భాసిస్తూ వుంటాయి.అన్ని వందల మైళ్ళూ ఒకే నగరంలో ప్రయానిస్తున్నామన్న భ్రమ కలుగుతుంది.

ప్రపంచ ప్రఖ్యాతి గాన్చి న హాలివుడ్ సినీ ప్రపంచం, మరో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన డిస్నీ లాండ్ , అమెరకా, మరియు ప్రపంచ చిత్ర రంగాన్ని ముని వేళ్ళతో నిర్దేశిస్తూ నాట్య మాడించే యూనివర్సల్ స్టూడియో లు వున్న నగరం లాస్ ఏంజిల్స్. సాన్డియాగో నగరానికి వుత్తర దిశగా ఫసిఫిక్ మహా సముద్ర తీరం ఆనుకొని విరాజిల్లుతోంది. ఆ మహా సముద్ర తీరాన ఆ మహా నగరాల గుండా రోడ్డు మార్గం లో ప్రయాణించడం జీవితంలో అద్భుత అనుభవం, జీవితానికో అను భూతి.ఈ పర్యటనలో ఎన్నెన్నో వింతలు విశేషాలు వున్నా షామూ ఒక ప్రత్యెక విశేషం .మిగతా విశేషాలు వాటి వాటి ప్రత్యేకతలు, ఆయా వ్యాసాలలో త్వరలో.

రచన : నూతక్కి రాఘవేంద్ర రావు . తేది :శుక్రవారం 27-02-2009