అమెరికా లో నా పర్యాటక అనుభవాలు …1


 

యూసమిట్ వ్యాలీ :

అక్కడకు వినోదం కొరకే గాక ,విజ్ఞానం కొరకు ,విద్యా ప్రాప్తికి, పరిశోధనకు, ప్రతి నిత్యం ,అనేక వేల మంది పర్యటిస్తూ వుంటారు. ప్రభుత్వం ఈ పర్యాటక కేంద్రాభివ్రుదికై వెచ్చించిన మొత్తాన్ని పర్యాటక్యాభి వృద్ధి ద్వారా తిరిగి రాబట్టుకో గలుగు తోంది. ఈ విధానం ఏ దేశానికైనా అనుసరణీయం.
వేల ఎకరాలలో అమెరికాలో వున్న యూసమిట్ ప్రాంతం ఆరక్షిత జాతీయ వనం. ఇక్కడకు చేరడానికి అనేక ప్రాంతాలనుండి సురక్షితమైన,సౌ కర్యవంతమైన రోడ్లు వున్నాయి. ప్రభుత్వ రవాణా సౌ కర్యాలున్నా ఎక్కువ మంది తమ వాహనాల్లో వస్తుంటారు. మధ్య మధ్య వసతి గృహాలలో విడిది చేస్తూ ఎంతెంతో దూరాల నుంచి కూడా రోడ్ ద్వారా ప్రయాణం చేసి వస్తుంటారు. శ్రమ ధన ప్రయాసలతో కూడుకొన్న దే కాని ఈ యాత్ర అద్భుత ఆనందానుభూతుల్ని మిగుల్చుతుందనడంలో సందేహంలేదు.ఈ ఆనందాన్నిజ్ఞాపకాలను నా జీవితాంతం మిగుల్చు కొంటాను.

వన్య భరిత పర్వతాలతో, శిఖరాలతో ,ఎలుగుబంట్లతో సింహాలు పులులు ,జింకలు ఇత్యాది ఎన్నో ఇతర జంతు జాలంతో,వాటి అరపులతో రకరకాల పక్షులతో ,కిలకిలారావాలతో ,జలపాతాలతో , సాంద్ర తరమై సు విశాలమైన కైవారాలతో ఆకాశాన్నంటే సాంద్ర తర వ్రుక్షారన్యాలతో ,ఔషధ జాతుల మొక్కలతో, సెలయేళ్ళ పరవళ్ళతో , సుందర వర్ణ భరిత వుద్యానవనాలతో ,నదులతో ఆ లోయ ప్రతి నిత్యం సజీవంగా కళ కళ లాడుతూ అలరారుతుంటుంది.

ఇక్కడి స్థానిక ప్రజల, ఆటవిక జాతుల పునరావాసానికి, అభ్యున్నతికి ,సంక్షేమానికి ,అమెరికా ప్రభుత్వం అమిత శ్రద్ధ తీసుకుంటోంది.ఇక్కడి ప్రభుత్వం సామాజిక అవసరాలకు సేకరించే భూమి కి చెందిన భూమి పుత్రులను వారి మానాన వారిని గాలికి వదలదు.ముందే పునరావాసానికి ప్రణాలికలు రచించి ఆచరణలో పెడుతుంది.దానికి కావలిసిన నిధులను సమకూరుస్తుంది. ఇదంతా ఆ యా కార్యక్రమ నిర్మాణం లో భాగంగా కొనసాగుతుంటుంది .

ప్రతి దేశానికి ఈ ప్రక్రియ ఆదర్సనీయం.

పర్వతాలను, శిలలను ,అడవుల్ని, ఓషధ జాతి మొక్కలిని ,లోయలను, సెలయేళ్ళను, జలపాతాలను, జలాశయాలను ,రహదారులను,అక్కడి జంతు వృక్ష సముదాయాన్ని కాపాడేందుకు ,వివిధ భాగాల్లో పరిశోధనలు జరిపేందుకు వేరు వేరు ప్రభుత్వ విభాగాలున్నాయి. వేల మంది విశ్వ విద్యాలయ విద్యార్థులు యిక్కడ వివిధ రంగాల్లో పరిశోధనలు చేస్తుంటారు. పర్వతారోహణ ఇక్కడ ప్రత్యెక క్రీడ.మంచులో ఆడే క్రీడలకు కూడా యిక్కడ ప్రత్యేకసరదా చూపుతారు. ఇక్కడ యాత్రలో అనేక వింతలు విశేషాలు చూడవచ్చు.పర్వతాలు, శిఖరాలు,శిలలు శిలాజాలు ,మహోన్నత వృక్ష జాతులు, లోయలు, జలపాతాలు, సెలయేళ్ళు ,పక్షులు, ఆరక్షిత జంతు జాలం ,ఒకటేమిటి అనేకం.

అందులో ప్రత్యెక మైంది హాఫ్ దోం అని పిలవ బడే శిఖరం.ఆ లోయ నుండి ఆ దృశ్యం చూడ టానికి అద్భుతంగా వుంటుంది . నేను దానికి ప్రత్యేకమైన పేరు పెట్టుకున్నాను . అది చూడటానికి… ఒక పక్షి పిల్ల, తల్లి తెచ్చే ఆహారం కోసం గూటిలోనుంచి తల బయటకు పెట్టి ఎదురు చూస్తున్నాడా అన్నట్లు ..భావన నాకు కలిగింది. కాబట్టి దానిని చిక్ బీక్ దోం ( డ కారం లో ఒత్వం పలకడం లేదు. )అని పేరుపెట్టాం. చిక్ అంటే పక్షి పిల్ల ,బీక్ అంటే ముక్కు. కొన్ని కొన్ని కాలాల్లో (సాయంత్రం వేళ మాత్రమె) సూర్యుడు పశ్చిమ ముఖుడై తరలే తరుణాన ఆ లోయలో పర్వతాల నీడల కదలికల పరిణామ క్రమంలో ప్రస్ఫుటంగా ఒకే ఒక శిఖరం పై కాంతి మిగిలి వుండి ఆ దృశ్యం ,మహాద్భుత దృశ్య కావ్యంగా ఆవిష్కరింపబడుతుంది . సూక్ష్మ దృష్టితో, విమర్సనాత్మకంగా ,పరిశోధనా పరంగానూ ,వాస్తవ పరంగానూ చూస్తే నా ఈ వ్యాసంలో లెక్కకు మించి దోషాలు కనపడవచ్చు. కాని వాస్తవ దూరాలు మాత్రం కాదు. న పర్యటనలో కలిగిన ఆనందానుభూతుల్ని నలుగురితో నా భాషలో నా వారితో పంచు కోవడమే ఈ వ్యాసం ముఖ్యోద్దేశ్యం.

ఇక్కడకు పర్యాటకులు రోజూ వేల సంఖ్యలో వస్తుంటారు .కొద్ది మందికి మాత్రమె అక్కడ బస చేసే అవకాశముంది మిగిలిన వారు ఆ రోజు సాయంత్రానికి తిరిగి వెల్ల వలసినదే..,మనం మన అవసరాలకు ఆహారం నీరు తీసుకు వెళ్ళినా, అవసరానికి భోజన ఫలాహారాది సదుపాయాలు,సోవ్చాలయాలు వున్నాయి.

నా అనుభూతులు:
ఆ దృశ్యం :
చిక్ బీక్ దోం (అని నె పిల్చుకొనే )
హాఫ్ దోం

రచన : నూతక్కి రాఘవేంద్ర రావు. తేది : ౧౧ – ౦౨ – ౨౦౦౯



నా గళం లోన వాక్కు లేదు
నా నేత్రాలకు దృష్టి లేదుgrandcanyon
అంగాంగం కదలదేల
సమ్మె చేస్తున్నాయి కాబోలును
గుండె కవాటాలు
కదలనని మారాం చేస్తున్నాయి
సుషుప్త స్థితి లో
నా మనసు శరీరం
అసంకల్పితంగా
నోరు తెరచి
అనిమేషిత నేత్రుడనై
ప్రక్రుతి చిత్రించిన
వైచిత్రిని ద్రుశ్యిస్తూ
వు త్తుంగ తరంగిత
మనో జనిత
భావ ఘర్షణం ..
అసంకల్పిత
వ్యక్తీకరణలు
నాలో నేను …
ఈ గాయం భూమాతకు
కలిగించిన వారికి
చేతులెలా
వచ్చాయో !!!
భీకరాఘాతపు ఈ చారిక
భూమి కెటుల చేరిందో!!
కాదు కాదు కాదు కాదు
అది గాయపు చారిక కానే కాదు
మది తలపుల ద్వైధీ భావం …

కాబోలును పుడమి తల్లికది
ప్రక్రుతి చేయించి యిచ్చిన
అతి సుందర వజ్ర ఖచిత కంఠ మాల
అనంతానంత అఖాతాలు
యోజనాల దైర్ఘ్యం లో
సుదూరాలు ఇరు తీరాలు
సుందర పర్వత పంక్తులు
ప్రక్రుతి భూమాతకు చేసిన
అలంకారమా!!!!మహాద్భుతం
అనూహ్యం అనిర్వచనీయం
వీక్షకుల కది
గానామృత కావ్యాన్విత
నేత్ర పర్వ సంగీతం .

రచన :నూతక్కి రాఘవేంద్ర రావు. తేది:౧౦ -౦౨-2009


అది డిసెంబర్నెల, రెండు వేల ఎనిమిది. హైదరాబాద్ నుండి , నేను, నా భార్య అమెరికా లోని కాలిఫోర్నియాకు మా పెద్దఆమ్మాయి దగ్గరకు వచ్చి ఒక నెల అయింది.ఆమెకు ఇద్దరు పిల్లలు.
మన తెలుగు సంప్రదాయం ప్రకారం, మనుమరాలికి చీరలు, మనవడికి పంచలు ఇద్దామని వచ్చాము. ఆ ఫంక్షన్ ఘనంగా జరిగింది..
ఇంకా ఇతర బంధువులు స్నేహితులు కూడా ఇక్కడ వుండటంతో, మేము వచినప్పుడల్లా ఆరు నెలలు వుండి వెలుతుంటాము.
మనవడు ,మనుమరాలు వాళ్ల స్కూల్ శలవలు అయిపోతున్నాయని ఎక్కడికన్నా టూర్ వెళ్దామని ప్రోపోజల్ పెట్టారు .
మేము అంటే – నేను, నా భార్య,మా అమ్మాయి ,పిల్లలు, స్నేహితులు , వాళ్ల పిల్లలు,వేరు వేరు కార్లలో బయలు దేరాము.ఆ రెనో పట్టణానికి, మా పిల్లలు వుండే నగరానికిమధ్య షుమారు ౩౦౦ మైళ్ళ దూరం వుంటుంది .ఆమార్గం లో ఎక్కువ భాగం సముద్ర మట్టానికి చాలా ఎత్తు లో వుండటం తో nu ,ఆ పట్టణ పరిసరాలన్నీ అదే స్థితి లో వుండటం తో అక్కడ మంచు ఎక్కువ కురుస్తుంది.మంచు పర్వతాలు చాలా ఎక్కువ. దారిలో రోడ్ల పై మంచు వుంటే అక్కడ కారు స్లిప్ అయి ప్రమాదం జరగ కుండా వుండేందుకు ముందు జాగ్రత్త గా వీల్స్ కు చెయిన్ లు వేస్తారు.

అట్లాంటి పరికరాలు సమకూర్చుకొని,ఇంధనాన్ని నింపుకొని, ఆహార పథార్థాలు, పిల్లల ఆటవస్తువులు, చలికి తట్టుకొనేబట్టలు, మంచులోఆడుకునేన్దుకు పరికరాలు, తీసుకొని మధ్య మధ్యలో గాస్ స్టేషన్ దగ్గర ఆగి,రెస్ట్ రూమ్ లకు వెళ్లి కాలకృత్యాలు తీర్చ్కొని కాఫీ లవి త్రాగి అవసరమున్నప్పుడు ఇంధనం నింపుకొని, మొత్తానికి, అర్థరాత్రి రెనో నగరంచేరాము. దారిలో ఎక్కడా చక్రాలకి చయిన్ లు వెయ్యాల్సిన అవసరం రాలేదు. సిటీ లో అడుగు పెడుతూనే, ముందుగా ఒకఇండియన్ హోటలుకు వెళ్లి భోం చేసాము.
నగరం చాలా అందంగా ,రంగు రంగుల విద్యుత్ దీపాలతో అలంక్యరిచబడి విశాలమయిన రోడ్లకు ఇరువైపులా కాంతి వంతమయిన దీపాల వరుసలు, ఆ నిశీధి లో ఆకాశం వైపు చూస్తేఆకాశం కాదు ఆకాశాన్నంటే భావన సముదాయాలు మాత్రమె కనబడుతున్నాయా అన్నట్లు మిల మిల లాడుతూ చాల ముచ్చటగా కనుల విందులు చేస్తూ స్వాగతించాయి . ఆతరువాత హోటల్ సిల్వర్ లెగసి చేరి పార్కింగ్ లాట్ లో ఎనిమిదో అంతస్తులో కార్లు పార్క్ చేసి, ఏడో అంతస్తు లోముందే రిజర్వు చేసుకున్న మా మా గదులకు లకు వెళ్లి కాసేపు విశ్రాంతి తీసుకొని కాసినో లకు బయలు దేరాము.
కాసినోలలో కాసేపు తిరిగి సర్కస్ సర్కస్ కాసినోలో అప్పుడే మొదలయిన సర్కస్ చూసాము. తరువాత ఏవరికి వాళ్ళుగా విడిపోయి, కాసినో కు వెళ్ళాము . నేను మాత్రం స్లాట్ మెషిన్ లో ఆడి పైసలు పోగొట్టుకొంటే, పిల్లలు మాత్రం బొమ్మలుగెల్చుకొన్నారు. మిగతావాళ్ళూ కొందరు గెలిస్తే కొందరు పైసలు హుండీ లో వేసామనుకున్నారు.
రోజువారి పనుల వత్తిడినుంచి మనసును మళ్ళించి విశ్రాంతి నివ్వడానికి ఇలాంటి పర్యటనలు వినోదం గా విలాసంగావుండి, పిల్లలు పెద్దవాళ్ళు ఎక్కువ సమయం కలిసివుందే అవకాశం కలిగిస్తాయి.
ఇక్కడ సూపర్ లెగసి హోటల్నుండి ఎన్నో కాసినోలు , భవనాలు అనుసంధానించబడి వున్నాయి. అన్ని వసతులు అక్కడే పొందవచ్చు.ఇక సూపర్ లెగసి భవనం లో సౌకరియాలు అమోఘం. అంతే కాకుండా ఆ భవనం బయట నుండి కూడా చూడముచ్చటగా ఎలిగెంటుగా వుంటుంది.

ఇక్కడ మధ్యలో ముచ్చటించవలసిన కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పటం మాటల మధ్యలో మరచిపోయాను.
…అమెరికాలో చెప్పుకోవలసిన అనేక గొప్ప విషయాల్లో ముఖ్యమయినవి ; విశాలమయిన రోడ్లు , బ్రిడ్జిలు,రోడ్ల పై డైరక్షన్ బోర్డులు,సుచి, పరిసరాల పరిశుభ్రత .
ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా ఇంటిదగ్గరే నెట్ నుంచి మ్యాప్ తీసుకొని వెళ్ళవచ్చు .ఎవరినీ దారి మధ్యలోనో చౌ రస్తాల దగ్గరో ఆగి, బాబూ ఆ ఊరికి దారెటు.. ఎటు ప్రక్కకు వెళ్ళాలి అని ఎవరిని అడగనక్కర లేదు. అడగటానికి మనిషనే వాడు దొర్కితె కదా!
రోడ్లు, బ్రిడ్జిలే అమెరికా వారి ఆర్ధిక రంగ విజయానికి ఒక ముఖ్యకారణమని చెప్పవచ్చు.గల్లి అయినా, ఘాట్ రోడ్ అయినాజాతీయ రహదారి అయినా ,రోడ్లు బ్రిడ్జి ల విషయంలో అమెరికా వారి శ్రద్ధ…నిజంగా వారి తరువాతే మరేదేశమైన అనిచెప్పడంలో ఏమీ పొగడ్త లేదు .ఎన్నివేల మైళ్ళు ఐనాసరే ఎక్కడా రోడ్ కు అడ్డంగా ఏ జంతువు గాని మనుషులు కాని రారు . అంత పెద్ద దేశంలో ఆ ఏర్పాటు అమోఘమని చెప్పక తప్పదు.అంతే కాదు శుభ్రత విషయంలో ,పరిసరాలను నీటుగావుంచడం లో అమెరికాలో వున్న ప్రతివారు ఆఖరికి క్రొత్తగా అమెరికా యాత్ర కు వచ్చిన వారు కూడా ఇందుకుతోడ్పడం,పాటించడం చాలా గొప్ప విషయం. ఒక్క ఈ విషయమనే కాదు అన్ని ప్రభుత్వ విధానాలను ప్రజలుగౌరవిస్తారు ,ఆచరిస్తారు. అందుకు వ్యతిరేకంగా నడుద్దామని ప్రయత్నం ఎవరూ చేయరు. అంటే ఒక రూల్నుప్రవేసపెట్టేముందే ఆ విషయమై చర్చ జరిగి ప్రజల అభీష్టాన్ని తెలుసుకున్న తరువాతనే రూల్ గా మారుస్తారు. కాబట్టి ముందే ప్రజల అభిమతాన్ని తెలుసుకొని, వారి అభ్యంతరాలు కూడా గమనిస్తూ యాక్టులు పాస్ చేస్తే ,ఆచరించేందుకు ప్రజలు సిద్ధం గా వుంటారు.గౌరవిస్తారు. అంగీకరిస్తారు.
మనిషిని చూసి మనిషి నేర్చుకుంటాడు , ఆచరిస్తాడు అన్న మాట ఇక్కడ వాస్తవం. రోడ్ రూల్స్ పాటించటం దగ్గర, టాక్సు కట్టే దగ్గర, పెంపుడు కుక్కలుబహిరంగ ప్రదేశాలలో మల మూత్రాలతో కాలుష్యం చేయకుండా, పిల్లలను,తల్లి తండ్రులు దండించే విషయంలోను, పెంపుడు జంతువులను విచ్చలవిడిగా వదిలేయకున్డాను, ప్రభుత్వం కతినాతి కటినంగా వుండటం తో ప్రజలు కూడా చాలా జాగ్రత్తతో వ్యవహరిస్తారు .ఎవరూ, ఎక్కడా బహిరంగాంగావుమ్మడం చూడ లేదు, బహిరంగంగా,మల, మూత్ర విసర్జన చేయరు,చెత్త కాగితం ముక్క కూడా విసిరేయరు,మన ఇంటి చెత్త ,మన ఇంటి ముందో వెనకో, ప్రక్కవాడి ప్లాట్ లోనో, ఖాళీగా వున్న ప్రదేశాలలోనో ,వేయరు. అంత పెద్ద దేశం లో వేస్ట్ డిస్పోజల్ సిస్టం అనే ప్రక్రియ నిరంతరంగా సాగుతూనే వుంటుంది. దానికి కావలిసిన యంత్రాంగం నిరంతరం పనిచేస్తూనే వుంటుంది.ఆ వేస్ట్ ,రి సయికిల్ చేసి వస్తూత్పత్తి చేసే ప్రత్యెక యంత్రాంగం వారికి వుంది.అందు చేత ,చెత్త కుప్పలుగా పేరుకుపోతుంది అన్న భయం లేదు. దగ్గు వచ్చి తెమడవుమ్మాలిసి వచ్చినా, ముక్కు చీదాలిసి వచ్చినా, ప్రత్యామ్నాయవిదానాలో ,వాటికి నిర్ణయించిన ప్రదేశాలలోనో తప్ప, బహిరంగ ప్రదేశాలని మైలపరచరు.పుట్టిన దగ్గరనుంచే ఆయా విధానాలు అలవడటం వల్ల కావచ్చు,ప్రభుత్వ సదుపాయాలు, విధానాలూకతినంగా వుండటంవల్లకావచ్చు,తరాలుగా వస్తున్న అలవాటు కావచ్చు, ఏదేమైనా వారు పరిసరాలను కాపాడుకొనేవిధానాలూ, ఇతర మరెన్నో విషయాలలో ప్రతివారూ తీసుకొనేసామాజిక భాద్యత క్రమ శి క్షణ, మనందరం అందరం , ప్రపంచమంతా కూడా ఆచరించ దగ్గవి, మరియు, ప్రస్తుతించ దగ్గవి.ఈ విషయం లో మాత్రం యిక్కడి ప్రజలను ప్రశంసించి తీరాలి..

అమెరికాలో రోడ్ ప్రయాణం చాలసౌకర్య వంతంగా వుంటుంది .ఒక నగరంలోని ఇంటి నుండి మరో నగరంలోని మరోచోటికి దిశా నిర్దేశం చేసే పరికరాలు విరవిగా ప్రతి కారుకు అందుబాటులో వుండడం, అందరి ఇళ్ళల్లో కంప్యూటర్లు వుండటం వల్ల…..
హోటళ్లు బుక్ చేయడమైనా, లేక చూడాలనుకొన్న ప్రదేశంలో అనుమతి టిక్కెట్లు కొనాలన్నా చాల సుఖంగా జరిగిపోతోంది.వెళ్ళిన ప్రదేశంలో ఇంకా చూడాల్సిన విశేషాలు ఏమైనా ఉన్నాయో కూడా తెలుసుకుని ప్రయాణ ప్రణాళిక సిధంచేసుకోవచ్చు.రోడ్లు విశాలంగా వుండటం, అనేక లైన్లు వుండటం, వెళ్ళే వాహనాలకు వచ్చే వాహనాలకు వేరు వేరుప్రత్యేకమయిన మార్గాలు వుండటం వల్ల నిర్ణీత వేగానికి మించని వేగం లో ప్రమాదాలు జరగ కుండా ప్రయాణంచేయవచ్చు.అమెరికాలో ఏ రోడ్ మీద అయిన కుదుపులు లేకుండా ప్రయాణం చేయవచ్చు. ముఖ్యంగా వాహనం నడిపేవారికి ఈ రోడ్లు పైన ఎన్ని మైళ్ళు అయినా , చాలాసౌకర్యంగా , అలసట లేకుండా ప్రయాణం చేయ వచ్చు. వాహనాలుకూడా రోడ్ల మీద ప్రయాణానికి, అనుకూలంగా, ఆహ్లాదకరంగా వుంటాయి.

రెనో ముచ్చట్లు మానేసి వేరే పిచ్చాపాటి మాట్లాడి బోరు కొడుతున్నానా?.
అసలు విషయానికి వద్దాం.

ఆ రాత్రి రెండు గంటల కు హోటలుకు వచ్చిఅందరం పడుకున్నాం. అలసి వుండటం తో బాగా నిద్ర పట్టిందేమో ,లేచే సరికి వుదయం ఎనిమిది. వెంటనే కార్యక్రమాలు పూర్తీ చేసుకొని కిటికీ కర్టెన్ తీద్దునుకదా…వావ్!!…వావ్! …..అబ్బురపరిచే ఆ – ఆ ఆ దృశ్యం…
కళ్ళెదురుగా …..ఇటుక వర్ణం, నీలం రంగులతో కూడి తెల్లని మంచు దుప్పటి కప్పుకున్న ఎత్తైన పర్వత సానువులు,వాటి పైనతేలియాడే తెల్లని మేఘాల దొంతరలు ,అప్పడే వుదయిస్తున్న సూర్యుని లేలేత కిరణాలు ఆ మంచు దొంతరల గుండాపయనించి సృష్టించిన ఇంద్ర చాపం ,భాను ని కిరణాలు మేఘ మాలికల ద్వారా పయనించగా , పర్వత పాదం నుంచిశిఖరం వరకు మారుతున్న రంగులు ,ఈ క్రమంలో పర్వత వున్నతాలలో, లోయలలో , , సూర్యునిఅవరోహనా క్రమం వల్ల మారతున్న నీడలు, రంగులు, పర్వత కన్నియ, నిద్ర నుంచి లేస్తూ ఓడలు విరుచు కొంటూ ,
పయ్యెద జారుతున్నా కానని స్థితిలో కూని రాగాలు తీస్తూ నర్తిస్తున్నదేమొ ననే భావన……మీరు కవి కానక్కరలేదు, మనిషైవుంటే చాలు … ఆ దృశ్యం……అది …… అది దృశ్య గీతమో,నృత్య గానమో అనిపించక మానదు.

రచన : నూతక్కిరాఘవేంద్ర రావు
తేది : 24/12/2008