అది కావచ్చును నిదురలోని చేష్ట
ప్రక్రుతి పురుషుని ఒడిలో
శయనించిన జ్ఞాపకాల పరవశాన
భూమాతకు కలిగినట్టి పులకరింత
కావచ్చును కావచ్చును
అలసిన ఆ ప్రుద్వీమ తల్లి
కలత నిదురలోని చేష్ట
కాని ఆక్షణాన!!!
ఆక్రందన ఆవేదన
భూన భొంత రాళా లలొ
దద్దరిల్లి భూ కంపన
అహో రాత్రాలు శ్రమియించి
నిర్మించిన ఆ మానవ నిర్మిత
భవన సముదాయాలేన్నెన్నో
పునాదులతో కూలి పోయి
వేల వేల జీవితాలు ఆ శిధిల
శకలాల క్రింద నలిగి విరిగి మరణిస్తే
ఆ కాళ రాత్రి ఆ నిర్భర నిశీధి
అంధకార బంధురమై
విక్రుతమై ప్రక్రుతిచేసిన
వికటాట్టహాస విశృంఖల నృత్య హేల
అతి క్రూర భయంకర మృత్యు క్రీడ
ఎం జరిగిందో తెలియదు
అచేతనావస్థలో అంతు
తెలియని అయోమయం.
పాపం ఆ భూమాతకు
గర్భ శోక భారం బాధా భరిత శోకం
ఆక్రందనం యెంత కష్టం
తన చుట్టూ తను తిరుగుతు
సూర్యుని చుట్టూ పరిభ్రమణ
అలుపంటే తెలియకుండ
క్రమ పధాన పయనిస్తూ
తననే నమ్ముకున్న తనపై
నడయాడే జీవకోటి పరి రక్షణకై
ఏమారని క్రమ పయనం
రేయి పగలు కల్పిస్తూ
అలసి సొలసి ఆ ఒక్క క్షణం
తత్తర పాటున జరిగిన
దుర్భర ఘటనాక్రమం
ఘోర భయంకర ప్రళయం
అతి భీకర భూ కంపనం.

రచన: నూతక్కి రాఘవేంద్ర రావు తేది: ౦౫-౦౨-2009