“అస్తవ్యస్త యింటి నంబర్ల వ్యవస్త వల్ల అభివ్రుద్ధికి కలిగే అఘాతం ”

రచన:నూతక్కి రాఘవేంద్ర రావు. తేదీ: 18-11-2009

అభివ్రుద్ధి చెందిన దేశాలలో లా మ్యాపు లయితే తయారు చెయవచ్చేమో కాని,యింటి నంబర్ ఫీడ్ చేసి గూగుల్ సీర్చ్ చేసి అడిగారనుకోండి ,గూగుల్ కే కాదుకదా ఆ బ్రహ్మ్మ దేవుడికి కూడా సాధ్యం కాదు. జంటనగరాలలోనే కాదు చుట్టూరా వున్న మహానగరంలో విలీనమైన పురపాలక సంఘాలలో కూడా సరైన యిళ్ళ నంబర్ల విధానం లేదు. క్రొత్తగావచ్చి ఏదైనా ప్రాంతంలో తమకు కావలిసిన యిల్లు తెలుసుకోవాలంటే (పూర్తి అడ్డ్రెస్స్ వున్నా కూడా) ఎంత కష్టమో, ఎందరి అడగాలో ? కాలనీల పేర్లు వుండవు.కాలనీలకు సూచకలుండవు. కాలనీలలో రోద్లలో యింటి నంబర్ల సూచికలుండవు. పురపాలక సంఘాలు కూడా నంబర్లు ఒక వరుసలో యివ్వరు. ఆధునిక సాంకేతిక సౌకర్యాలూ యాజమాన్య విధానాలూ వున్నా కూడా ప్రజానుకూల విధానాలు రచించి అమలుపరచడానికి అధికారులు సంసిద్ధంగాలేరు. ముందు వారి శిరఃప్రక్షాళన జరగాలి. తరువాత ప్రభుత్వాల ప్రక్షాళన గూర్చి ఆలోచించ వచ్చు. యీ యింటి నంబర్ల వ్యవస్త అస్తవ్యస్తంగా వుండటంతో వోటరు లిస్టులు కూడా అస్తవ్యస్తంగా మారి ఓటరు ఎన్నికలలో తమ ఓటు సద్వినియోగ పరచుకోలేక 30% to 50% ఓట్లు మాత్రమే పోలై మైనారిటీ అభిప్రాయంతోనే అభ్యర్ధులు ఎన్నిక కాబడుతున్నారు. యీ యింటి నంబర్ల విధానం ఆధు నీకరణ ,సరళీకరణ జరగకపోయినట్లయిన పైన చెప్పిన ప్రజలకు కలిగే అసౌకర్యాలెకాక ,ప్రభుత్వ ప్రజోపకార్యక్రమాలు ,ప్రజలకు చేరేందు కు అడ్డ్రెస్సులు లేక ఆయా కార్యక్రమాల అడ్డ్రెస్సే గల్లంతయ్యే ప్రమాదాలున్నాయి. కాబట్టి యిప్పటికైనా ప్రజల కొరకు,ఎన్నికైన ప్రభుత్వాలు, ప్రజా ప్రయోజనార్ధం ప్రజల డబ్బుతో నియమింపబడిన అధికారులు , వారి వునికి…వారి అధికారం ప్రజలకు వున్నత ప్రమాణాల్లో ప్రయోజనాలు అందించేందుకనీ ,వారికీ గౌరవ మర్యాదలు యివ్వవలసిన అవసరం వుందనీ గుర్తించి తదనుగుణంగా వ్యవహరించాలి.